Link copied!
Sign in / Sign up
1
Shares

గుండెపోటు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..! గుండెపోటు లక్షణాలు

హార్ట్ ఎటాక్.. అకస్మాత్తుగా వచ్చే మరణాలలో ప్రస్తుతం ఈ అనారోగ్య సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చిందంటే వయస్సు అయిందికదా అనేవారు, కానీ ఇప్పుడు యంగ్ జనరేషన్ వాళ్ళు కూడా ఈ సమస్యతో ఇబ్బందిపడుతున్నవారే అధికంగా ఉన్నారు. గుండెపోటు రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి? గుండెపోటు లక్షణాలు ఎలా ఉంటాయో మీరు తెలుసుకోండి, అందరికీ షేర్ చేయండి.

గుండెపోటు లక్షణాలు..

గుండెపోటు ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పడం కష్టమే, కానీ గుండెపోటు లక్షణాలు ఎలా ఉంటాయో తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనీసం ఈ లక్షణాల ద్వారా గుండెపోటు బాధితులను కాపాడే సమయం దొరుకుతుంది.

◼️ శ్వాస తీసుకోవడంలో తరచూ ఇబ్బందిగా ఉండటం, కొద్ది దూరం నడిచినా సరే త్వరగా అలసిపోవడం ఇలా ఉంటే హార్ట్ ఎటాక్ లక్షణాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

◼️ గుండెపోటు లక్షణాలలో అతి ముఖ్యమైనది ఛాతీలో నొప్పి. ఛాతీలో నొప్పి ఎక్కువగా ఉన్నా, ఎడమచేయి నొప్పి ఎక్కువగా ఉండి లాగినట్లుగా ఉన్నా కూడా హార్ట్ ఎటాక్ లక్షణాలుగా పరిగణించి వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.

◼️ కొంతమందిలో ఎప్పుడు జలుబు, జ్వరంతో పాటు ఆగకుండా దగ్గు వస్తుంటే హార్ట్ ఎటాక్ అని తెలిపే సూచికలుగా చెబుతున్నారు.

◼️ ఉన్నట్లుండి శరీరంపై చమటలు ఎక్కువగా ఉండటం, బాడీ వణుకుతున్నట్లుగా ఉండటం జరిగితే గుండెపోటు లక్షణాలుగా గుర్తించాలి. ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు.

◼️ గ్యాస్, అసిడిటీ, కడుపులో నొప్పిగా ఉండటం, వికారంగా ఉండటం, కాళ్ళు, పాదాలు ఉబ్బినట్లుగా ఉంటే హార్ట్ ఎటాక్ సూచికగా గమనించాలి.

గుండెపోటు రాకుండా ఏం చేయాలి..!

గుండెపోటు లక్షణాలు ఎలా ఉంటాయో చూశారు కదా, గుండెపోటు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..! ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో తెలుసుకుందాం…

◼️ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోవడం వలన రక్తనాళాలు గడ్డకట్టినట్లు రక్తసరఫరాను నిలిపివేస్తుంది. దీని కారణంగా హార్ట్ ఎటాక్ రావడానికి కారణమవుతుంది.

◼️ ముందుగా హార్ట్ ఎటాక్ సమస్యతో బాధపడేవారు, గుండెపోటు లేనివారైనా సరే ధూమపానం, మధ్యపానాలకు దూరంగా ఉండాలి. ఇవి రక్తపీడనం మరియు రక్తనాళాలలో అడ్డంకులు మరి హార్ట్ ఎటాక్ కు కారణమవుతాయి.

◼️ మసాలా పదార్థాలు, కొవ్వు పదార్థాలు అస్సలు వదిలివేయమని చెప్పట్లేదు కానీ వీలైనంత వరకు ఈ ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ ఆహారాల వలనే శరీరం నిండా కొవ్వు చేరుకుపోయి గుండెను ఆరోగ్యకరంగా లేకుండా చేస్తుంది.

◼️ ప్రతి రోజూ తప్పనిసరిగా ఒక అరగంట పాటైనా వ్యాయామాలు చేయడం ఉత్తమం.

◼️ ఆహారంలో ఉప్పును ఎక్కువగా తీసుకునేవారు వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది. ఉప్పు బ్లడ్ ప్రెజర్ కు కారణమవుతుంది కాబట్టి కొంచెం తక్కువగా తీసుకోవడం మీ శరీరానికి ఉపయోగకరం.

◼️ వెన్న, నెయ్యి ఆహారాలను కొద్దిమొత్తంలో తీసుకోవాలి. ఇవి పొట్ట చుట్టూ కొవ్వు చేరేలా చేసి, మీ శరీరాన్ని చాలా ఇబ్బందికి గురి చేస్తాయ్. రక్తపీడనం మరియు రక్త సరఫరా కష్టమవుతుంది.

గుండెపోటు రాకుండా ఏం చేయాలి, గుండెపోటు లక్షణాలు ఎలా ఉంటాయో చూశారు కదా. నెక్స్ట్ ఆర్టికల్ లో గుండెపోటు వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలో చెప్పుకుందాం… 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon