గోర్లను ఈ రెండు రోజుల్లో అస్సలు కట్ చేయకూడదు : ఇలా గోర్లను కట్ చేస్తే..
గోర్లను చాలామంది అందంగా పెంచుకుంటూ ఉంటారు. కొందరైతే అన్ని గోర్లను కట్ చేసుకుని ఒక్క వేలి గోరును మాత్రమే స్టైల్ గా ఉంచుకుంటుంటారు. అయితే గోర్లను ఇలా పెంచుకోవడం చాలా పాపం అని అంటున్నారు. ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఆ గోర్లను కట్ చేస్తూ ఉండాలి. లేకపోతే మన పాపాలు కూడా పెరుగుతాయని మన పెద్దలు అంటున్నారు. ఇది నిజమా! కాదా! అని అనుమానం ఉంటే దీని గురించి పురాణాలలో ఒక కథ కూడా ఉంది. ఇలా మనుషులు చేస్తున్న పాపాల గురించి పాపాలు అన్నీ దేవుడి దగ్గరకు వెళ్లి మొరపెట్టుకుంటాయట. దేవుడు కూడా ఈ విషయంలో నేను ఏం చేయలేను, ఎక్కడి నుండి వచ్చారో అక్కడికే వెళ్ళమని చెబుతారని మన పెద్దలు ఇప్పటికీ గోర్లను కట్ చేసుకోని వారిని చూసినప్పుడు ఊర్లలో చెబుతూ ఉంటారు.
గోర్లను కట్ చేసుకోకపోతే..

- జుట్టు పెరిగితే ఎలా అయితే కట్ చేసుకోవడం చేస్తున్నారో అలానే గోర్లను కూడా కట్ చేసుకోవాలి. పాపాలను కాస్త పక్కనపెడితే వాటంతట అవి విరిగినప్పుడు ఆ బాధను భరించడం చాలా కష్టం.
- గోర్లను ఎక్కువగా పెంచడం వలన గోర్ల మధ్య మురికి ఎక్కువగా చేరుతుంది. అందుకే ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
- గోర్లు బాగా పెరిగినప్పుడు వేలి, గోర్ల మధ్య క్రిములు ఎక్కువగా చేరుతూ ఉంటాయి. మనం ఆహారం తీసుకునేటప్పుడు ఈ క్రిములు మన శరీరంలోకి వెళతాయి. అలాగే ఆహారం తీసుకున్న తర్వాత గోర్లు ఎక్కువగా ఉన్నవారు గోర్ల మధ్య ఏదైనా ఆహారం ఉంటే వెంటనే బాగా క్లీన్ చేసుకోవాలి.
- గోర్లు అందంగా కనిపించడానికి గోర్లను బాగా కట్ చేసుకుని గోరింటాకు పెట్టుకోవడం వలన గోర్లు అందంగా ఉండటమే కాకుండా రక్తప్రసరణ బాగా జరుగుతుంది కూడా.
గోర్లను ఏ రోజుల్లో కట్ చేసుకోకూడదు..?

మన పెద్దలు కొన్ని ఏళ్లుగా ఫాలో అవుతున్న ప్రకారం జుట్టును మంగళవారం కట్ చేయించుకోకూడదన, మరికొంతమంది శుక్రవారం క్షవరం పనులు వద్దని అంటూ ఉంటారు కదా. గోర్ల విషయంలో కూడా మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో కట్ చేసుకోకూడదట. ఈ రెండు రోజుల్లోగోర్లను కట్ చేస్తే దరిద్రం అని అంటున్నారు. ఏదైనా పని మొదలుపడితే సరిగ్గా జరగకపోవడం మరియు ఆర్ధిక ఇబ్బందులు వంటి సమస్యలు అని చెబుతున్నారు.
అలాగే గోర్లను ఇంట్లో కట్ చేసుకోకూడదు. ఇంట్లో కట్ చేసుకున్నప్పుడు అవి కిందపడ్డట్లయితే అనుకోకుండా కాలితో తొక్కడం వలన కాలికి ప్రమాదం అంటుంటారు కదా. అంతే కాకుండా ఇంట్లో గోర్లను కట్ చేసుకోవడం మీ ఇంటికి మంచిది కాదని, బయట కట్ చేసుకోవాలి.
గోర్లను కట్ చేసుకోవాలి అనుకునేవారు ఉదయం స్నానానికి ముందు శుభ్రం చేసుకోవడం మంచిది. చీకటి పడ్డాక కట్ చేసుకోవడం వలన వేలి చర్మానికి తగిలి నొప్పి, బాధ కలుగుతుంది.
..............................
మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..
Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.
ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.
Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
cover image source : footfiles
