Link copied!
Sign in / Sign up
0
Shares

గోర్ల రంగు, గోర్ల ఆకారాన్ని బట్టి మీ అనారోగ్య సమస్యల గురించి మీరే తెలుసుకోవచ్చు

మీకు తెలుసా ప్రపంచంలో ఏ ఒక్కరి చేతి గోళ్లు మరియు వేలిముద్రలు ఒకేలా ఉండవు. మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళితే నాలుక చూపించమని, కళ్ళు చూపించమని చెప్పిన తర్వాత మీ చేతి గోర్లను కూడా పరిశీలనగా చూస్తూ ఉంటారు. అంటే చేతి గోర్ల ఆకారాన్ని బట్టి ఆరోగ్య స్థితిని తెలుసుకుంటారు. అందుకే మీ ఆరోగ్య స్థితిని ఇంటి వద్దే తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ అందిస్తున్నాం.

గోర్లు పాలిపోయి ఉంటే..

మీరు గమనించారో లేదో కొందరిలో కాళ్లు లేదా చేతి గోర్లు పాలిపోయినట్లుగా ఉంటాయి. అంటే వీరి శరీరంలో ఐరన్ శాతం తక్కువైందని అర్థం. దీని కారణంగా రక్తహీనత, హార్ట్ ఎటాక్ మరియు లివర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకని ఐరన్ అధికంగా ఉండే పచ్చని ఆకుకూరలు, పాలకూర, బెల్లం, ఫ్రూట్ జ్యూస్ లు బాగా సేవించాలి.

గోళ్లు పసుపు రంగులో ఉంటే

గోర్లు పసుపు వర్ణంలో ఉండి మళ్ళీ సాధారణ స్థితికి చేరి, మళ్ళీ పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్స్ కారణం. ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్య మరియు మధుమేహంతో బాధపడేవారిలో ఇలా ఎక్కువగా కనిపిస్తాయట.

నీలం రంగులో గోర్లు

నీలం రంగులో గోర్లు కనిపించినట్లయితే శరీరానికి సరిపడ ఆక్సిజన్ అందటం లేదని, డయాబెటిస్ మరియు ఇన్సూలిన్ లోపంగా గుర్తించాలి. హార్ట్ ఎటాక్ మరియు ఊపిరి తిత్తుల సమస్య కారణంగా గోర్లు నీలం రంగులోకి మారుతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇటువంటి వారు ఆందోళన పడకుండా ఉండటం మంచిది.

తెల్లని చారలు

గోర్లపై తెల్లని చారలు లేదా తెల్లని కొసలుగా ఉన్నట్లయితే కాలేయ సంబంధిత సమస్యలు లేదా కిడ్నీ సమస్యల ప్రభావం అని అంటున్నారు. వీరి శరీరానికి ప్రోటీన్ సరిపడా స్థాయిలో అందకపోవడమే కారణం. అందుకని ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని బాగా తీసుకోవాలి. అలాగే హెపటైటిస్ వ్యాధి సంకేతాలు కూడా ఉండవచ్చని అంటున్నారు.

గోళ్ల కింద నల్లని మచ్చలు

కొందరిలో గోర్ల కింద నల్లని మచ్చలుగా ఉంటాయి. ఇవి చాలా ప్రమాదకరం. స్కిన్ ఇన్ఫెక్షన్స్ కారణంగా ఈ విధంగా జరుగుతుంది. చర్మంపై మంటగా ఉండటం, ఒక్కోసారి దద్దుర్లుగా ఉండటం లక్షణాలు. కాబట్టి వెంటనే డాక్టర్ ను సంప్రదించడం చేయాలి.

గోళ్లు ఎర్రగా ఉంటే..

కొందరిలో గోళ్లు ఎర్రగా లేదా గులాబీ రంగులో ఉంటాయి. గుండె సంబంధిత సమస్యల కారణంగా, శరీరంలో అనవసరంగా పేరుకుపోయిన కొవ్వు కారణంగా ఈ రంగులోకి రావడానికి కారణం. కాబట్టి ఇలా గోర్లు ఉన్నవారు నిర్లక్ష్యం మరియు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ ను సంప్రదించి సలహాలు తీసుకోవడం ఉత్తమం.

ఇది ఎవరినీ భయపెట్టాలని కాదు, మీ ఆరోగ్య స్థితి గురించి తెలపడానికే. అందరికీ ఉపయోగపడే విషయం కాబట్టి SHARE చేయగలరు.  

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon