Link copied!
Sign in / Sign up
39
Shares

గోంగూర పచ్చడిని రుచికరంగా 5 నిముషాలలో ఎలా చేసుకోవాలో చూడండి

తెలుగువారికి ఆవకాయ, పచ్చళ్ళ తర్వాత ఇష్టమైన వంటకాలలో గోంగూర పచ్చడి ఎంతో ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని అందులో  గోంగూర పచ్చడిని కలుపుకుని తింటుంటే కలిగే రుచికరమైన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. మరి, అటువంటి గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. తెలియని వంటకాల గురించి మేము అందిస్తున్న ఈ ఆర్టికల్ మీకు నచ్చితే అందరికీ SHARE చేయగలరు.

గోంగూర పచ్చడికి కావలసిన పదార్థాలు :

గోంగూర - 5 లేదా 6 కట్టలు

ఎండు మిర్చి - 15

వెల్లుల్లి రిబ్బలు - 10

కరివేపాకు, ఉప్పు - సరిపడినంత

జీలకర్ర, మెంతులు, ఇంగువ - ఒక స్పూన్

చింతపండు - 10 గ్రాములు

శనగపప్పు, మినపప్పు తాలింపుకు - 10 గ్రాములు

గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి..?

1. ముందుగా గోంగూరను శుభ్రంగా కడిగి గోంగూరలో నీరు లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో మూడు స్పూన్ల నూనె వేసి వేయించాలి. వేయించిన గోంగూరను ఒక పాత్రలో పక్కకు తీసుకోవాలి.

2. ఇక అదే గిన్నెలో మెంతులు, ఇంగువ, ఎండు మిర్చి, వెల్లుల్లి, ఆవాలు వేసి పోపు పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ పోపును మెత్తగా రుబ్బుకోవాలి.

3. మెత్తగా రుబ్బుకున్న పోపులో గోంగూర, కాస్త ఉప్పు వేసి మిక్సీ పట్టడం లేదా రుబ్బుకోవడం చేయాలి. దీంతో గోంగూర పచ్చడి సిద్ధమైనట్లే.

4. ఇక తాలింపుకు పాన్ లో కాస్త నూనె వేసి, నూనె మరిగాక అందులో శనగపప్పు, మినపప్పు, కొంచెం కరివేపాకు వేసి కొంచెం రంగు మారాక కిందకు దించి రుబ్బుకున్న గోంగూర పచ్చడిలో వేసుకుంటే కమ్మగా ఉంటుంది.

ఇంకా మీకు ఏమైనా వంటకాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మాకు COMMENT చేయగలరు. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
50%
Wow!
50%
Like
0%
Not bad
0%
What?
scroll up icon