Link copied!
Sign in / Sign up
12
Shares

గోల్డెన్ మిల్క్ : 100 ఏళ్ళ ఆయుష్షునిచ్చే ఈ అమృతం మన ఇంట్లోనే ఉంది!!!

అమృతం భూమి మీద దొరకదు అనేది ఒక అబద్ధం. భారతీయులుగా మనం ఎప్పటి నుండో ప్రతి ఇంట్లో వాడుతున్న అతి సాధారణమైన వస్తువులు అమృత బండాగారాలు. మన ఆరోగ్యాన్ని రక్షించి మన ఆయుష్షు ను పెంచే ఆయుర్వేద రహస్యాలు మన చుట్టూ ఉన్న మనం గమనించేలేకపోతున్నాం. ప్రతి చిన్న సమస్యకు ఒక టాబ్లెట్ వేసుకొని ఆ సమస్యకు ఇంకో సమస్యను జోడిస్తున్నాం. అందుకే మనం మర్చిపోయిన అనేక ఆయుర్వేద చిట్కాలను తిరిగి మీకు అందిస్తున్నాం. అందులో ప్రధానమైనది పసుపు. చిటికెడు పసుపు, గ్లాసు పాలు, మన పెద్దవాళ్ళు మనకు నేర్పిన ఈ ఆయుర్వేదాన్ని మనం ఎప్పుడో మర్చిపోయాం, కానీ విదేశీయులు ఇప్పుడు నేర్చుకుంటున్నారు, వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్న దీనిని వారు గోల్డెన్ మిల్క్ (Golden Milk) అని పిలుచుకుంటున్నారు. పసుపు కలిపిని పాలు మనకు ఎంత  మేలు చేస్తాయో ఇక్కడ చూడండి…

1. జలుబు, దగ్గు

చలి కాలంలో కాస్త జలుబు దగ్గు రాగానే వెంటనే ఏదో ఒక రెండు మాత్రలు వేసుకుంటాం. జలుబు దగ్గు తగ్గిపోతాయి. హమ్మయ్య అనుకుంటాం. కానీ జరిగే అసలు విషయాన్నీ మనం గమనించడం లేదు. జలుబు, దగ్గు, జ్వరం తగ్గడానికి టాబ్లెట్ పని చేసే విధానం మన రోగ నిరోధక శక్తిని మెల్లగా తగ్గిస్తుంది. మన రోగ నిరోధక శక్తిని పెంచుతూ మన జబ్బులు తగ్గించే ఒకేక్కా చిట్కా గోల్డెన్ మిల్క్. పసుపులో సహజంగా ఉండే యాంటి బ్యాక్టీరియ, యాంటి వైరల్ గుణాలు, వేడి పాలతో కలిసి, మన శరీరంలోని వైరస్ ను తొలిగిస్తాయి. మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

2. గుండె ఆరోగ్యం

ఈరోజుల్లో ముగ్గురిలో ఇద్దరు ఏదో ఒక గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. గుండె సంబంధిత వ్యాధులకు ప్రధానమైన కారణం అధిక కొవ్వు రక్తంలో చేరిపోవడం. ఇందుకు పరిష్కారం పసుపు బాదాం పాలు. పసుపులో ఉండే కర్కుమిన్ (Circumin) అనే పదార్ధం వీటిని తగ్గిస్తుంది. బాదాం పాలు గుండె కండరాలకు బలాన్ని ఇస్తుంది.

3. అజీర్తి

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో కోల్పోతున్నాం మరెన్నో అనారోగ్యాలను సంపాదించుకుంటున్నాం. ఆ అనారోగ్యాలో అందరికి వుండే సమస్య గ్యాస్ ట్రబుల్, అజ్జీర్తి. ఇందుకు పరిష్కారం కూడా గోల్డెన్ మిల్క్. పసుపు లో వుండే సర్కమిన్ గాళ్ బ్లాడర్ మీద ప్రభావం చూపించి, బైల్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఆహరం పూర్తిగా జీర్ణం అవడానికి సహాయపడుతుంది. పాలు అజీర్తి ని తగ్గిస్తాయి.

4. మెదడు

గోల్డెన్ మిల్క్ మీ మెదడుకు కూడా ఎంతో మేలు చేస్తాయి. పసుపులో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ మెదడు సమస్యలను నివారిస్తాయి. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఈ మధ్య జరిగిన ఆధునిక అధ్యాయనాల ప్రకారం మతిమరుపు, పార్కిన్సన్ లాంటి వ్యాధులను నివారించే లక్షణాలు పసుపులో ఉన్నాయి. పసుపును పాలతో కలిపి తీసుకోవడం వలన మెదడుకు కావాల్సిన కాల్షియమ్ అందుతుంది.

5. నొప్పులు

ఆయుర్వేదంలో నొప్పిని తగ్గించడానికి పసుపును వాడుతుంటారు. పసుపులో నొప్పులను తగ్గించే లక్షణాలు ఉంటాయి. సహజంగా మనం నొప్పులు తగ్గడానికి వాడే మాత్రలకు బదులు ఈ చిట్కా వాడండి. పీరియడ్స్ సమయంలో కలిగే నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి ఇది ఒక మేలైన, ఆరోగ్యమైన పరిష్కారం.

6. చర్మ సౌందర్యం

గోల్డెన్ మిల్క్ మనకు చేసే ఇంకో మేలు మన చర్మ సౌందర్యాన్ని రక్షించడం. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణం చర్మం లోని మృత కణాలను తొలిగిస్తుంది. చర్మాన్ని కాంతి వంతంగా మృదువుగా చేస్తుంది. క్రిములతో పోరాడి ఇన్ఫెక్షన్స్ దూరం చేస్తుంది.

7. ఎముకలు

రోజు పాలు తీసుకోవడం వలన ఎముకలు బలంగా తయారవడానికి కావాల్సిన కాల్షియమ్, వి టమిన్ D శరీరానికి అందుతాయి. పసుపు ఎముకుల సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.

8. నిద్ర

ఈ బిజీ లైఫ్ లో అందరూ కోల్పోతున్నది నిద్ర. సరైన నిద్ర లేకపోవడం అనేక రోగాలకు కారణమవుతుంది. దీనికి రోజు నిద్ర పోయే ముందు ఒక గ్లాస్ గోల్డెన్ మిల్క్ తాగడం. పసుపులో ఉండే ట్రీప్టోఫాన్ అనే అమైనో ఆసిడ్ నిద్రను ప్రేరేపిస్తుంది. అంతే కాకుండా ప్రశాంతమైన నిద్రను అందిస్తుంది. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon