Link copied!
Sign in / Sign up
6
Shares

మీ శరీరాన్ని ఉక్కులా మార్చే ‘అల్లం జ్యూస్’ : ఎలా చేసుకోవాలి? ప్రయోజనాలు..

మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారే. అయితే కొన్ని సహజసిద్ధమైన పానీయాలు, ఆయుర్వేద చిట్కాలు, మీ ఇంట్లోనే దొరికే వస్తువులతో చేసుకోవడం వలన మీ శరీరానికి ఎటువంటి అనారోగ్య సమస్యలు కలగకుండా కాపాడుకోవచ్చు. అటువంటి వాటిలో అల్లం జ్యూస్ ఒకటి. అల్లం జ్యూస్ ఎలా చేసుకోవాలి, దానివలన కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం…

అల్లం జ్యూస్ ఎలా చేసుకోవాలి..?

రెండు గ్లాసుల నీటిలో కొంచెం అల్లం ముక్కను వేసి బాగా మరిగించాలి. మరిగించిన తర్వాత కొద్దిసేపు చల్లార్చి దానిని వడగట్టుకుని సేవించాలి. లేదా ఒక గ్లాస్ వేడి నీటిలో అల్లంను మెత్తగా నూరుకుని ఆ నీటిలో కలిపి వడగట్టుకున్నా చాలు దీంతో అల్లం జ్యూస్ రెడీ అయినట్లే. దీనిని ఉదయాన్నే పరగడుపునే తీసుకోవడం వలన ఎన్ని ప్రయోజనాలో చూడండి.

బరువు తగ్గుతారు

అల్లం జ్యూస్ ను ప్రతి రోజూ క్రమం తప్పకుండా అధిక బరువు ఉండేవారు సేవించడం వలన బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. మీరు బ్రష్ చేసిన తర్వాత అల్లం జ్యూస్ తీసుకోవడం చేయాలి.

చెడు కొలెస్ట్రాల్

ప్రతి రోజూ ఉదయం అల్లం జ్యూస్ ఒక గ్లాస్ సేవించడం వలన రక్త సరఫరా బాగా జరుగుతుంది. రక్త సరఫరా బాగా జరిగి, గుండె సంబంధిత సమస్యలు లేకుండా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను శరీరం నుండి వేరు చేసి మంచి కొలెస్ట్రాల్ ఉండేలా తోడ్పడుతుంది.

జలుబు, దగ్గు ఫటాఫట్

కొందరు ఎప్పుడు చూసినా జలుబు, దగ్గు, నీరసంగా ఉందని అంటుంటారు. అటువంటివారు తప్పకుండా ఈ అల్లం జ్యూస్ సేవించడం వలన ఈ సమస్యలకు గుడ్ బై చెప్పవచ్చు అల్లంలో ఉండే యాంటీ బయోటిక్ గుణాలు మిమ్మల్ని స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తాయి.

వాంతులు, వికారం

కొందరికి ప్రయాణాలు చేస్తున్నా లేదా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు వెంటనే వాంతులు లేదా వికారం జరుగుతూ ఉంటాయి. అటువంటివాళ్ళు ఈ అల్లం జ్యూస్ సేవించడం లేదా అల్లం ముక్కను బుగ్గన పెట్టుకుని చప్పిరించడం వలన ఈ సమస్య ఉండదు. అలాగే అల్జీమర్స్ సమస్యతో బాధపడేవారు అల్లం జ్యూస్ రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది.

బెస్ట్ మెడిసిన్

చాలామందికి ఉన్న సమస్యలలో ఆహారం త్వరగా జీర్ణం మరియు మలబద్ధకం.  గ్యాస్, అసిడిటీ, నీరసం కారణంగా ఏ పని త్వరగా పూర్తి చేయలేరు మరియు చేస్తున్న పనిపై ఆసక్తి కనబరచలేరు కాబట్టి వీళ్ళకి బెస్ట్ మెడిసిన్ ఏదైనా ఉందంటే అది అల్లం జ్యూస్ మాత్రమే. కొన్ని రోజుల పాటు ఉదయాన్నే అల్లం జ్యూస్ సేవించడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోండి.

మేం చెప్పిన ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే అందరికీ SHARE చేయండి… 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon