Link copied!
Sign in / Sign up
1
Shares

గ్యాస్, అసిడిటీతో బాధపడేవారు ఏం తినాలి? ఏం తినకూడదు..! : అసిడిటీని తగ్గించే ఇంటి చిట్కాలు

పొట్ట ఉబ్బినట్లుగా ఉండటం, తెంపులు వస్తూ ఉండటం, కడుపులో ఛాతీ భాగంలో మంటగా ఉండటం, ఆకలి వేయకపోవడం, జీర్ణప్రక్రియ సరిగ్గా జరగకపోవడం.. ఇలా గ్యాస్, అసిడిటీ లక్షణాలు చాలామందిలో కనిపిస్తూ ఉంటాయి. హా, ఏముందిలే అని నిర్లక్ష్యం చేస్తే ఇది కాస్త ప్రమాదమనే చెప్పాలి. ఈ సమస్య కారణంగా కొందరికి ప్రశాంతత లేకుండా నిద్రకు దూరమవుతున్నారు కూడా. గ్యాస్, అసిడిటీతో బాధపడేవారు ఏం తినాలో, ఏం తినకూడదో, ఈ సమస్య నుండి బయటపడటానికి గృహ చిట్కాలు ఏవో ఇక్కడ మీరే చూడండి..

గ్యాస్, అసిడిటీ ఉన్నవారు ఏం తినాలి..! ఏం తినకూడదు?

మసాలా పదార్థాలు, కారం ఎక్కువగా ఉన్న ఆహారాలు, జంక్ ఫుడ్స్, సరైన సమయానికి ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, నీరు సరైన మోతాదులో తీసుకోకపోవడం ఇవన్నీ కూడా గ్యాస్, అసిడిటీకి కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ సమస్య ఉన్నవారు ఏం తినాలో, ఎటువంటి డైట్ పాటించాలో తెలుసుకోండి.

గ్యాస్, అసిడిటీ ఉన్నవారు తినకూడనివి :

▶️ మసాలా పదార్థాలు, ధూమ మద్యపానాలు అస్సలు ముట్టుకోకూడదు

▶️ పులుపుగా ఉన్నవి, కారం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని దూరం పెట్టాలి

▶️ బయట తయారుచేసే ఫాస్ట్ ఫుడ్స్, ఆయిల్, జంక్ ఫుడ్స్ ను తినకూడదు

▶ చిన్న చిన్న విషయాలకు భయపడటం, ఆందోళన చెందటం చేయకూడదు

గ్యాస్, అసిడిటీ ఉన్నవారు ఏం తింటే మంచిది..!

▶️ ఆహారం ఏది తీసుకున్నా సరే నెమ్మదిగా నమిలి తినాలి

▶️ తేలికగా జీర్ణమయ్యే ఆహారాలను మాత్రమే తినాలి

▶️ మరీ ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోకూడదు

▶️ సరైన సమయానికి ఆహారం తీసుకోవడం, ఎక్కువ నీటిని సేవించడం చేయాలి

▶️ మంచి నిద్ర, విశ్రాంతి అవసరం

గ్యాస్, అసిడిటీని చిటికెలో తగ్గించే ఇంటి చిట్కాలు

గ్యాస్, అసిడిటీ అనేది చిన్న సమస్య కాదు, ఈ విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. దీని గురించి పట్టించుకోకుండా వదిలివేయడం వలన ముందుంముందు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ చెప్పుకునే చిట్కాలు ఫాలో అవ్వండి.

తులసి ఆకులు

గ్యాస్, అసిడిటీ సమస్య ఉన్నప్పుడు వెంటనే రెండు లేదా మూడు తులసి ఆకులు నమలాలి. ఇలా చేయడం వలన తక్షణ ఉపశమనం కలుగుతుంది. లేదా ఒక గ్లాస్ నీటిలో కొన్ని తులసి ఆకులు మరిగించుకోవాలి. ఈ నీటిని సేవించడం వలన బాగా రిలీఫ్ గా ఉంటుంది.

దాల్చిన చెక్క పొడి

ఒక గ్లాస్ నీటిలో కాస్త దాల్చిన చెక్క పొడిని వేసుకుని బాగా మరిగించి టీలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కాస్త చల్లార్చి సేవించడం వలన అసిడిటీ సమస్యకు చెక్ పెట్టవచ్చు. తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కావడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది.

కడుపు ఉబ్బరంగా ఉంటే

ఈ సమస్య ఉన్నప్పుడు కొందరికి ఆహారం తీసుకోవాలనిపించదు, పొట్ట నిండుగా ఉబ్బరంగా ఉన్నట్లు ఉంటుంది. అందుకని ఇలాంటి వారు ఆహారం తీసుకునే పది నిముషాల ముందు రెండు లేదా మూడు చిన్న అల్లం ముక్కలను కాస్త ఉప్పులో కలుపుకుని తింటే మంచిది.

లవంగాలు, యాలకులు

లవంగాలు మరియు యాలకులను గ్యాస్, అసిడిటీ సమస్య ఉన్నప్పుడే అవసరం లేదు. నార్మల్ గా కూడా వీటిని అవి రెండు ఇవి రెండు మిక్స్ చేసుకుని తినటం వలన జీర్ణప్రక్రియ బాగా జరుగుతుంది. ఇక గ్యాస్, అసిడిటీ ఉన్నవారికి ఇది మంచి రెమెడీ అనే చెప్పాలి. అలాగే పెరుగుకు బదులుగా ప్రతి రోజూ ఒకటి లేదా రెండు గ్లాసుల మజ్జిగను తీసుకోవడం వలన అసిడిటీ నుండి రిలీఫ్ గా ఉంటుంది.

పైన చెప్పుకున్న వాటిలో ఏవైనా సరే మీకు నచ్చిన టిప్స్ పాటించవచ్చు. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మాకు కామెంట్ చేయవచ్చు. 

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon