Link copied!
Sign in / Sign up
24
Shares

గర్భిణీ స్త్రీలు ఈ పది విషయాలకు ఎప్పుడు దూరంగా ఉండాలి : చాలా ప్రమాదం...


మనం తీసుకునే ఆహారం నుంచి చేసే అనేక పనులు మనతో పాటు గర్భంలో ఉన్న శిశువు మీద కుడా ప్రభావం చూపిస్తాయి. ఈ పరిస్థితులలో గర్భంతో ఉన్న వాళ్ళు చేసే ప్రతి పని, రెండు ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని చేయాలి. తల్లి బిడ్డకు చేటు చేసే అనేక విషయాలను తెలుసుకోని దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి దూరంగా ఉండాల్సిన విషయాలలో ముఖ్యమైనవి, ప్రమాదకరమైనవి ఇవే.....

ఒత్తిడి

కడుపుతో ఉన్నప్పుడు జరిగే శారీరక, మానసిక మార్పులు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తాయ్ . దీని వలన కలిగే పరిణామాలు తల్లితో పాటు శిశివుని కూడా బాధిస్తాయి. ఒత్తిడి వల్ల కలిగే నిద్రలేమితనం, మలబద్దకం వంటి విషయాలు శిశువు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఒత్తిడిని దూరం చేసుకోడానికి ఏదైనా వ్యాపకం అలవాటు చేసుకోవడం మంచిది.

పెంపుడు జంతువులు

మనకు ఎంత ఆహ్లాదం కలిగించినా కడుపుతో ఉన్నపుడు పెంపుడు జంతువులకు దూరంగా ఉండడం మంచిది. పిల్లి, కుక్క, పక్షులు లేదా ఇతర జంతువులు అనేక రకమైన వైరస్,బాక్టీరియా లను కలిగివుంటాయి, వీటికి దగ్గరగా ఉన్న సమయములో అవి మనకు వ్యాపించే ప్రమాదం వుంది. అందు వలన కడుపుతో ఉన్న వారు పెంపుడు జంతువులకు దూరంగా ఉండడం మంచిది.

పురుగు మందులు

దోమలు లేదా ఇతర ప్రమాదకరమైన పురుగుల నుంచి రక్షించుకోడానికి , ఇంట్లో జెట్ బిళ్ళలు లాంటి అనేక రకాల మందులు వాడడం సహజం.వీటివల్ల కలిగే మంచి ఎంతో చెడు కూడా అంతే వుంది. ఈ మందులు వాడే తీవ్రత పెరిగినప్పుడు వాటిలోని విష పదార్ధాలు శ్వాసలోకి చేరి నాడి వ్యవస్థ మీద ప్రభావం చూపించి తల్లికి బిడ్డకు ప్రమాదంగా మారే అవకాశం వుంది.

వ్యాయామం

వ్యాయామం ఆరోగ్యానికి మంచిదైనా కడుపుతో ఉన్నపుడు శరీరానికి అధిక శ్రమను కల్గినవి చేయకపోవడం మంచిది. డాక్టర్ల సలహా మేరకు ఎటువంటి వ్యాయామాలు చేస్తే మంచిదో అవి మాత్రమే చేయండి.

బరువులు ఎత్తడం

బరువులు ఎత్తడం, మోయడం లాంటి విషయాలకు ఎంత దూరంగా వుంటే అంత మంచిది.బరువులు ఎత్తడం వలన ఆ భారం గర్భంలోని శిశువు మీద పాడే అవకాశం వుంది చిన్నపాటి బరువు కల సరకుల సంచి అయినా సరే మీరు మోయకుండా వుండే వీలు చూసుకోండి.

బరువులు ఎత్తడం మోయడం లాంటి వి చేయాల్సి వచ్చినప్పుడు ఇతరుల సహాయం తీసుకోండి.

చేపలు

చేపలలో వుండే ఒమేగా 3 లాంటి పోషక విలువలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయ్. గర్భంతో వున్నపుడు చేపలను ఆహారంగా తీసుకోవడం తల్లి బిడ్డకు మేలు చేసే విషయమే కానీ మరి ఎక్కువ గా తీసుకోడం మంచిది కాదు. కొన్ని రకాల చేపలలో ఆరోగ్యానికి చేటు చేసే మెర్క్యూరీ అధికంగా వుంటుంది. దీనివల్ల కొన్ని దుష్పరిణామాలకు గురి కావలసి వస్తుంది. వారానికి 12 ఔన్సుల చేప మాంసం మించకుండా తీసకోవడం మంచిది. సాల్మన్, టునా లాంటివి తీసుకోవడం మంచిది,వీటిలో మెర్క్యూరీ శాతం తక్కువగా ఉంటుంది.

మద్యం

గర్భం దాల్చిన సమయములో దూరంగా ఉండాల్సిన విషయాలలో మద్యం అత్యంత ప్రమాదకరమైనది. మద్యం సేవించడం తల్లితో పాటు పుట్టపోయే శిశువుకి కూడా అనారోగ్య కలుగుతుంది. ఎందుకంటే, మద్యం రక్త ప్రసరణ ద్యార పిండంలోకి చేరుతుంది. అది పుట్టబోయే బిడ్డ చాలా ప్రమాదకరం. దీనివల్ల పుట్టబోయే శిశువుకు కలిగే దుష్పరిణామాలు జీవితకాలం బాధిస్తాయి .

ధూమపానం

ధూమపానం వలన నికోటిన్ ,కార్బన్ మోనాక్సైడ్ ,లెడ్ లాంటి ప్రమాదకరమైన పదార్ధాలు మీతో పాటు శిశువు కూడా చేరుతాయి. దీనివలన గర్భస్రావం, నెలలు ముందే కాన్పు జరగడం,శిశు మరణాలు లాంటి తీవ్రమైన పరిణామాలను ఎదురుకోవలసివస్తుంది. అందువలన కడుపుతో ఉన్న వారు ధూమపానానికే కాకూండా ధూమపానం చేస్తున్నవాళ్ళకి కూడా దూరంగా ఉండడం శ్రేయస్కరం..

మత్తుపదార్ధాలు

మత్తుపదార్ధాలు అలవాటు ఉన్నవారు వాటికి దూరంగా ఉండడం ఎంత కష్టమైన సరే కడుపుతో ఉన్నవారు తప్పక దూరం పాటించాలి. వీటి వల్ల కలిగే దుష్పరిణామాలు తల్లి తో పాటు శిశువును కూడా దీర్ఘ కాలం బాధిస్తాయి .గర్భంలో వున్నపుడే శిశువు చనిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon