Link copied!
Sign in / Sign up
7
Shares

గర్భవతిగా ఉన్నప్పుడు ప్రయాణం చేయాల్సి వస్తే ఈ 6 విషయాలు తప్పక గుర్తించుకోండి

మీరు సరదాగా ట్రిప్ ప్లాన్ చేసినా లేదా పని మీది దూరం ప్రయాణం చేయాల్సి వచ్చినా ముందు మీ సౌలభ్యం మరియు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వండి. మొదటగా ఒక ప్రయాణ ప్రణాలికను సిద్ధం చేసుకొని ఈ 6 విషయాలు దృష్టిలో పెట్టుకుంటే మీకున్న సమయాన్ని హాయిగా వినియోగించుకొని, ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా మీ ప్రయాణాన్ని పూర్తి చేయొచ్చు. మీరు ప్రేగ్నన్ట్ గా ఉన్నప్పుడు పర్యటించడానికి ఈ 6 చిట్కాలను పాటించండి

1. మీ గమ్యాన్ని ఎంచుకోవడం

ఎక్కువ సమయం అవసరం లేని ప్రదేశాలను ఎంచుకోండి. ఎందుకంటే గర్భధారణ సమయంలో ఎక్కువ సేపు ప్రయాణం చేయడం కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. ఆదర్శవంతంగా, రెండు గంటల ప్రయాణంలో చేరుకునే ప్రదేశాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నించండి. వెళ్లే ప్రదేశంలో మంచి దుకాణాలు మరియు వైద్య సౌకర్యాలు ఉన్నాయని తెలుసుకోవడానికి ఆన్లైన్లో కొద్దిగా పరిశోధన చేయండి. గర్భధారణ టీకాలు అవసరమయ్యే సమయంలో ప్రయాణించకుండా ఉండటం ఉత్తమం. అలాగే, మలేరియా, డెంగ్యూ లేదా జికా వంటి దోమల వలన సంభవించే వ్యాధులు ఉన్న ప్రాంతాలకు ప్రయాణించకుండా ఉండండి. అంతేకాకుండా ఎత్తిన ప్రాంతాలకు, అడ్వెంచర్ గేమ్స్ వంటి ప్రదేశాలకు దూరంగా ఉండటం మంచిది.

2. ముందుచూపు

ముందు చూపు ఉండటం వలన చాలా సమయం ఆదా అవుతుంది. ప్రయాణానికి ముందే కావాల్సినవన్నీ ఒకటికి రెండు సార్లు అలోచించి తీసుకోండి. గర్భం యొక్క 36 నుండి 38 వారాల సమయంలో ప్రయాణం చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి.

3. మీకు హాస్పిటల్లో ఇచ్చిన స్కాన్ మరియు ఇతర రికార్డ్స్ కాపీని తీసుకొని వెళ్ళండి

మీరు ఎక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నా, ఎల్లప్పుడూ మీ మెడికల్ నోట్ల కాపీని తీసుకువెళ్ళండి . మీరు మీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నప్పుడు, సమీప హాస్పిటల్ లేదా వైద్య సదుపాయం ఎక్కడ ఉన్నదో నిర్ధారించుకోండి. మీరు మీ యాత్రలో స్థానిక వైద్యుని నుండి చికిత్స తీసుకోవాలనుకుంటే, మీ గర్భధారణ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి వైద్య నిపుణుడికి మీ మెడికల్ రికార్డ్స్ అవసరం అవుతాయి. కావున వాటిని తప్పకుండా తీసుకొని వెళ్ళండి.

4. ఆహారం మరియు పోషణలో రాజీపడకండి

గర్భిణీ స్త్రీలు డీహైడ్రేషన్ నివారించడానికి, అమ్నియోటిక్ ద్రవం మరియు రొమ్ము పాలు తగ్గకుండా ఉండటానికి రోజుకు 8 నుండి 12 గ్లాసుల నీటిని తాగాలి. మీరు తినడానికి ప్యాకింగ్ చేసినప్పుడు, వీలైనన్ని పండ్లు మరియు కూరగాయలను చేర్చండి. ఎందుకంటే ప్రయాణంలో శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాలను అందించి మలబద్ధకం నివారించేందుకు అవి ఉపయోగపడతాయి. మీరు ఉంటున్నప్రదేశంలో నీటి భద్రత గురించి ఖచ్చితంగా తెలియకపోతే, తోలు తీసి తినగలిగే పండ్లను ఎంచుకోండి. డ్రై ఫ్రూట్స్, మంచి బిస్కెట్ పాకెట్స్ మరియు ఉడకబెట్టిన ధాన్యపు గింజలు తీసుకొని వెళ్ళడం ఉత్తమం.

5. సౌకర్యవంతగా ప్యాక్ చేయండి

మీరు గర్భవతిగా ఉన్నప్పుడు సౌకర్యవంతంగా ఉండటం చాలా ముఖ్యమైనది. సరైన బట్టలు, బూట్లు మరియు ఉపకరణాలు అత్యంత అవసరం. మీరు ఎక్కువ నడవాలనుకుంటే, సౌకర్యవంతమైన బూట్లు తీసుకోండి. మీరు కొన్ని వారాల కంటే ఎక్కువ దూరంగా ఉండాలని భావిస్తే, మీ bump పెరగినా సరిపోయే బట్టలు ప్యాక్ చేసుకోండి. వాతావరణకి అనువైన బట్టలను ప్యాక్ చేసుకోవడం మర్చిపోకండి.

6. రెగ్యులర్ బ్రేక్స్ తీసుకోండి

తగిన విశ్రాంతి తీసుకోవడం ద్వారా మీ సెలవుదినాన్ని ఆస్వాదించడానికి మీకు తగినంత శక్తి వస్తుంది.అందువలన తప్పకుండ అవసరమైనప్పుడు తగినంత విరామం తీసుకోండి. ఈ ప్రత్యేక సమయాన్ని పూర్తిగా ఆస్వాదించండి కానీ మీ ఆరోగ్యం మాత్రం నిర్లక్ష్యం చేయకండి. వాపు మరియు తిమ్మిర్లు తగ్గించడానికి రోజుకి కొంత సేపు చిన్న చిన్న వ్యాయామాలు చేయండి. వీలైనంత నిల్చుకోండి మరియు ఎప్పుడు ఒకే చోట కూర్చోకుండా కాస్త అటు ఇటు తిరగండి. మీరు డ్రైవింగ్ చేస్తున్నట్లయితే, గంట గంటకి తప్పనిసరిగా విరామం తీసుకోండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon