Link copied!
Sign in / Sign up
9
Shares

గర్భంతో ఉన్నప్పుడు మీరు మీ అత్తగారికి చెప్పాల్సిన 5 విషయాలు : మీ అత్త మాత్రమే చేయగల పనులు

ఒక మహిళ గర్భం దాల్చిన దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు, ఆ తర్వాత బిడ్డను సరిగ్గా చూసుకోవడం వరకు.. ఇలా ఎన్నో రకాల పనులు ఆ తల్లి ఒక్కరే చేసుకోవడం కుదరదు. ఖచ్చితంగా తనకు ఓ తోడు కావాలి. అందుకే.. గర్భం, పిల్లల గురించి తెలిసిన వాళ్లను గర్భిణీలకు తోడుగా ఉంచుతారు. వాళ్లు గర్భిణీ అమ్మ గాని, అత్త గాని లేదంటే బంధువులలో ఎవరైనా కాని తోడుంటారు. గర్భిణీలకు ఏదైనా తెలియకపోతే అలా కాదు ఇలా అని సలహాలు ఇస్తుంటారు.

మరి.. పెళ్లికి ముందు అమ్మాయిలకు అమ్మ తోడుగా ఉంటే.. పెళ్లి తర్వాత భర్త తర్వాత తోడుండే మహిళ అత్తే. పెళ్లి తర్వాత అత్తతో మంచి రిలేషన్ షిప్ కలిగి ఉండాలి. గర్భం దాల్చాక మీరు ఏం చేయాలి.. ఏం చేయకూడదు.. ఎలా ఉండాలి.. ఇలాంటి విషయాలన్నింటినీ మీరు మీ అత్త దగ్గర్నుంచి తెలుసుకోవచ్చు. ఎందుకంటే.. ఆమె కూడా అమ్మే కదా. వాళ్లకు మీ కన్నా ఎక్కువే తెలుస్తుంది. అందుకే.. మీరు గర్భిణీగా ఉన్నప్పుడు మీ అత్త నుంచి ఎటువంటి విషయాలు నేర్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1. సలహాలు అడుగుతూ ఉండండి

మీ అత్త కూడా తల్లే కాబట్టి తనకు గర్భం మీద చాలా అవగాహన ఉంటుంది. అందుకే.. మీ ప్రెగ్నెన్సీ సమయంలో మీకు ఎన్నో విలువైన సలహాలు ఆమె ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు గర్భిణీగా ఉన్నప్పుడు వచ్చే చిన్న చిన్న సమస్యలను సహజమైన పద్ధతిలో ఎలా నివారించవచ్చో ఆమె మీకు వెల్లడిస్తుంది.

2. డాక్టర్ ను సంప్రదించినప్పుడు తనను కూడా తీసుకెళ్లండి

మీరు గర్భిణీగా ఉన్నప్పుడు చాలా సార్లు డాక్టర్ ను కలవాల్సి ఉంటుంది. అయితే.. మీరు డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్లినా ఒంటరిగా మాత్రం వెళ్లకండి. ఎవరో ఒకరిని తోడుగా తీసుకెళ్లండి. మీ అత్తగారు ఖాళీగా ఉంటే ఆమెను తీసుకెళ్లడం ఇంకా మంచిది. డాక్టర్లు చెప్పే సలహాలు తూచా తప్పకుండా పాటించడానికి మీ అత్త అన్నివిధాలా దోహదపడుతుంది. అంతే కాదు.. మీ ఇద్దరి మధ్య బంధం కూడా దృడపడుతుంది.

3. ప్రేమతో ఆహారాన్ని తినండి

గర్భిణీలు ఏం తినాలి.. ఏం తినకూడదు అనే విషయాలు మీ అత్తగారికి బాగానే తెలిసుంటుంది. కాబట్టి.. మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకోకుండా మీ అత్తగారు చెప్పే ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. తను ఆప్యాయంగా తినిపిస్తే.. తినండి. అప్పుడే మీ ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ పెరగడమే కాకుండా గర్భిణీగా మీరు సరైన ఆహారాన్ని తీసుకుంటారు.

4. డ్రెస్సులు ఏవి వేసుకోవాలో సలహా తీసుకోండి

సాధారణంగా మహిళలు తమకు నచ్చిన డ్రెస్సులు వేసుకుంటుంటారు. కాని.. గర్భిణీగా ఉన్నప్పుడు కూడా తమకు నచ్చిన డ్రెస్సులు వేసుకుంటామంటే కుదరదు. ఎందుకంటే.. గర్భిణీలు వదులైన డ్రెస్సులు వేసుకోవాల్సి ఉంటుంది. అందుకే... పెద్దలు చెప్పిన డ్రెస్సులు వేసుకోవాలి. మీ అత్తగారిని షాపింగ్ కు తీసుకెళ్లి తను ఏ డ్రెస్సులు తీసుకోవాలని చెబితే అవే తీసుకోండి. వాళ్లు ఏం చేసిన మన మంచి గురించే చేస్తారు అనే విషయాలు అస్సలు మరిచిపోవద్దు.

5. విశ్రాంతికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి

మహిళలే ఇంట్లో అన్ని పనులు చూసుకోవాలని అందరికీ తెలిసిందే. కాని.. గర్భిణీగా ఉన్నప్పుడు కూడా ఇంటి పనులు చూసుకోవడం కుదరదు. అందుకే.. గర్భిణీలు ఎక్కువగా విశ్రాంతికి ప్రాధాన్యం ఇచ్చి.. ఇంటి పనులను మీ అత్తగారికి లేదంటే ఇంట్లో ఉండే వేరేవాళ్లకు అప్పగించడం బెటర్.

 6. గర్భిణీగా ఉన్నప్పుడు వచ్చే సమస్యలను మీ అత్తగారికి చెప్పండి

గర్భిణీగా ఉన్నప్పుడు ఓ మహిళకు ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి. మరి.. వాటన్నింటినీ గర్భిణీగా ఆ మహిళ ఎదుర్కోవడం కష్టంగానే ఉంటుంది. అందుకే.. గర్భిణీలు ఖచ్చితంగా తమకు వచ్చే సమస్యలను అత్తగారితో పంచుకోవాలి. ఎటువంటి సమస్యలు వచ్చినా వాళ్ల దగ్గర పరిష్కారాలు ఉంటాయి. మీ సమస్యలను కూడా వాళ్లు ఎంతో జాగ్రత్తగా వింటారు. వాళ్లతో ఎప్పుడూ గర్భానికి సంబంధించిన విషయాల గురించి చర్చించండి. దీంతో మీకు కూడా ఏవైనా సందేహాలుంటే తీరిపోతాయి. ఏమంటారు.

గర్భిణీలు తమ అత్తలతో స్వేచ్ఛగా మసులుకొని.. తమకున్న సమస్యలను విడమరిచి చెబితే వాళ్లు కూడా సావదానంగా విని దానికి తగ్గ పరిష్కార మార్గాలను చెబుతారు.

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon