Link copied!
Sign in / Sign up
2
Shares

గర్భంతో ఉన్నపుడు కడుపులోని బిడ్డ, మీ శరీర అవయవాలు ఎలా కదులుతాయో చూపే అద్భుతమైన వీడియో..

గర్భం దాల్చడం అనేది మహిళకు ఎంత గొప్ప వరమో, గర్భంతో ఉన్నప్పుడు ఎదురయ్యే పరిస్థితులను తట్టుకోగల శక్తిని కలిగి ఉండటం కూడా అంతే గొప్ప విషయం. అమ్మ రుణం ఎందుకు ఎప్పటికీ తీర్చుకోలేనిదో తల్లి కడుపునుండి బయటకు వచ్చిన ప్రతి బిడ్డకు ఎప్పుడో ఒకప్పుడు అర్థమవుతుంది. అయితే గర్భం దాల్చిన తర్వాత కడుపులోని బిడ్డ పెరుగుదలలో వస్తూ ఉంటాయి. ఇలా కేవలం కడుపులోని బిడ్డకు మాత్రమే జరగదు. గర్భం దాల్చిన మహిళ శరీర అవయవాలలోనూ మార్పు జరుగుతుంది. ఇక్కడ చూడబోతున్న ఈ వీడియో ద్వారా అమ్మ కడుపులో బిడ్డ పెరుగుదల మరియు మహిళ శరీర అవయవాలలో ఎటువంటి మార్పు జరుగుతుందో ఇక్కడ చూడండి…

Video Credits : Museum of Science and Industry, Chicago

అసలు అమ్మ కడుపులో బిడ్డ ఎదుగుదల మొదలైనప్పటి నుండి గర్భంతో ఉన్న మహిళ శరీర అవయవాలలో ఎటువంటి మార్పు ఉంటుంది. అవయవాలు కదులుతున్నప్పుడు ఆ ఒత్తిడి ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టమే కానీ, బయటకు పెరుగుతున్న గర్భం మాత్రమే మనం చూడగలుగుతున్నాం, అలాగే లోపల ఎలా ఉంటుందో మీరు ఎప్పుడు చూడని, నమ్మలేని ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.

గర్భిణీ మహిళ శరీరంలో జరిగే మార్పులు

గర్భం దాల్చిన తర్వాత నెలలు గడిచేకొద్దీ బిడ్డ పెరుగుదల క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. అలా పెరుగుతున్నపుడు మహిళ శరీర అవయవాలలో కూడా మార్పు వస్తుంది. ఇలా జరుగుతున్నప్పుడు తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కాకపోవడం, గుండెల్లో మంటగా ఉండటం, పిత్తాశయంలో సమస్యలు, కాళ్ళ వాపులు ఉంటాయి. కడుపు సైజు పెరుగుతున్నప్పుడు స్ట్రెచ్ మార్క్స్, కొన్నిసార్లు చర్మం ప్రకాశవంతం ఉండటం, కొన్నిసార్లు ప్రకాశవంతం లోపించడం కనిపిస్తూ ఉంటాయి. అవయవాల సైజులో మార్పు కారణంగా ఈ విధంగా ఉంటే ప్రతి పది నిముషాలకు లేదా ఇరవై నిముషాలకు జీర్ణాశయ సమస్య కారణంగా బాత్ రూమ్ వెళ్లడం జరుగుతుంది.

డెలివరీ జరిగిన తర్వాత

గర్భంలోని బిడ్డ సైజు పెరుగుతున్నప్పుడు సాధారణంగా కంటే ఎక్కువగా అవయవాలు మార్పు జరిగినప్పుడు ఎలా ఉంటుందో పైన వీడియో చూశారు కదా. అలాగే బిడ్డకు జన్మను ఇచ్చిన తర్వాత కొందరు మహిళలు అలాగే లావుగా ఉండటం, కొందరిలో బరువు తగ్గడం చూస్తూ ఉంటారు. ఇలా మహిళల శరీరం మళ్ళీ సాధారణ స్థితికి చేరుకోవడానికి కాస్త సమయం పడుతుంది. అందుకే అమ్మ రుణం బిడ్డ ఎప్పటికీ తీర్చుకోలేనిది అని అంటారు. 

Cover Image Source : What to Expect

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon