Link copied!
Sign in / Sign up
14
Shares

మీ పిల్లలు మంచి రంగుతో పుట్టాలంటే కడుపుతో ఉన్నప్పుడు ఈ 5 ఆహారాలు తీసుకోండి

బిడ్డ పుట్టగానే ప్రతి ఒక్కరూ ఎలా ఉన్నాడు, పాప ఎలా ఉంది, ఏ రంగులో ఉన్నారు, ఎవరి పోలిక తో జన్మించారు..ఇలా ప్రతి ఒక్కరూ అడిగే ప్రశ్నలు. ప్రగ్నన్సీ సమయంలో కూడా తమకు ఎవరు పుట్టనున్నారు, అందంగా ఉంటారా..! ఇలా ఎన్నో ప్రశ్నలు గర్భంతో ఉన్న మహిళలకు వస్తుండే ఆలోచనలు. బిడ్డ రంగు, పోలిక అనేది కేవలం మీరు తీసుకునే ఆహారమే కాకుండా దంపతులు లేదా మీ కుటుంబంలో ఎవరి పోలికలైనా వచ్చే అవకాశం ఉంది. ఐతే కడుపులో ఉన్న శిశువు రంగును మార్చే ఆహార పదార్థాలు ఇవేనని అంటున్నారు ప్రముఖ వైద్య నిపుణులు…

సోంపు

ఒక గ్లాస్ నీటిలో కొన్ని సోంపులు వేసి, ఉదయం వడగట్టుకొని ఈ నీటిని సేవించడం వలన బిడ్డ రంగు మంచి రంగులోకి వస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాగే ప్రగ్నన్సీ మహిళకు అలసట, వికారాన్ని కూడా తగ్గిస్తుంది.

కుంకుమపువ్వు
దీని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే కుంకుమపువ్వు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. గర్భవతిగా ఉన్నపుడు 2 వ నెల నుండి గోరు వెచ్చని పాలలో చిటికెడు కుంకుమపువ్వు కలిపి తీసుకోవడం వలన కడుపులోని బిడ్డ అందంగా, ముద్దుగా ఉండటమే కాకుండా బిడ్డ ఎదుగుదలకు మంచిదేనని చెబుతున్నారు.
నెయ్యి

మనదేశంలో గర్భిణీ మహిళలు సరైన పోషక ఆహారం తీసుకోకపోవడం వలన చాలామంది బిడ్డలు గర్భంలో మరణించడం లేదా ఏదైనా సమస్యలతో పుట్టడం జరుగుతోంది. అలాగే గర్భిణీ మహిళకు కొన్ని సార్లు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందుకని మీ డైలీ లైఫ్ లో భాగంగా నెయ్యిని ఆహారంతో పాటు తీసుకోవడం వలన బిడ్డ ఎదుగుదలకు మరియు మంచి రంగుకు సహకరిస్తుంది.

ఆరంజ్

ప్రగ్నన్సీతో ఉన్నప్పుడు 3 వ నెల నుండి ఆరంజ్ తీసుకోవడం వలన బిడ్డ రంగు మారడానికి బాగా ఉపయోగపడుతుందని నిపుణులు ఇస్తున్న సలహా. ఎందుకంటే ఇందులో ఉండే విటమిన్ సి వలనే ఈ విధంగా జరుగుతుంది.

కొబ్బరి

గర్భంతో ఉన్నప్పుడు ప్రతిరోజూ కాస్త కొబ్బరి తినడం వలన, కొబ్బరి లోపలి భాగం ఎలా ఐతే తెల్లగా ఉంటుందో, బిడ్డ కూడా అలా తెల్లగా, అందంగా పుడతాడని మన పెద్దలు చెబుతున్నారు.

పాలు

ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలు ప్రగ్నన్సీ సమయంలో సేవించడం వలన గర్భంలో ఉన్న బిడ్డ అందంగా, తెల్లగా పుట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయట. అలాగే ఆ మహిళకు కూడా మంచి ఆరోగ్యకరం.

బాదం

గర్భంతో ఉన్నప్పుడు ప్రతి రోజూ రెండు లేదా మూడు బాదంలను తినడం గానీ బాదం మిల్క్ తాగడం వలన బిడ్డ మంచి రంగుతో పుడతాడట. మంచి రంగుతో జన్మించడమే కాకుండా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఈ ప్రపంచంలోకి వస్తారని అంటున్నారు.

గుడ్లు

కొందరు చెబుతున్న ప్రకారం ప్రగ్నన్సీతో ఉన్నప్పుడు రెండవ నెల నుండి గుడ్లు తినడం వలన బిడ్డ తెలుపు రంగుతో అందంగా, ఆరోగ్యంగా పుడతాడని ఆరోగ్య నిపుణులు ఇస్తున్న సలహా..

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే తప్పకుండా SHARE చేయండి… 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon