Link copied!
Sign in / Sign up
0
Shares

గర్భంతో ఉన్న మహిళలు చలికాలంలో ఎలా ఉండాలి? ఇలా చేయకపోతే తల్లికీ, బిడ్డకు ప్రమాదం

గజగజ వణికించే చలికాలం మొదలైందండోయ్. గర్భం దాల్చిన స్త్రీలు చలికాలంలో ఎలా ఉండాలని కొంతమంది మమ్మల్ని అడిగారు. మహిళలకు గర్భం దాల్చడం, బిడ్డకు జన్మను ఇవ్వడం తమ జీవితంలో అత్యంత ఆనందమైన క్షణాలు. అయితే కొంతమంది సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన మధ్యలోనే గర్భం కోల్పోవడం జరుగుతోంది కాబట్టి వింటర్ లో గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తెలుసుకోండి. అందరికీ తెలియజేయండి.

జలుబు రాకుండా చూసుకోవాలి

వాతావరణంలో మార్పులు జరగగానే శరీరంలోనూ మార్పులు జరగడం సాధారణమే. అయితే గర్భం దాల్చిన స్త్రీలు చలికాలంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. జలుబు, జ్వరం, ఫ్లూ వంటి వ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి కాబట్టి నీరు వేడి చేసుకుని చల్లారిన తర్వాత తాగడం చేయాలి.

రోడ్లపై, ఫుట్ పాత్ లపై నడవకండి

చలికాలంలో రాత్రి, ఉదయం ఎక్కువగా మంచు కురుస్తూ ఉంటుంది. అటువంటి సమయాలలో రోడ్లపై, ఫుట్ పాత్ లపై నడవటం వలన మంచుకి కాలు జారి కిందపడి అవకాశం ఉంది. దీనివలన మీకు మీ బిడ్డకు మంచిది కాదు. కాబట్టి వీలైనంత వరకు ఇంట్లోనే ఉండటం మంచిది.

డైట్

చలికాలంలో చాలామంది సరైన పోషకాహారం కన్నా మసాలా ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ గర్భంతో ఉన్న మహిళలు వాటి జోలికి వెళ్ళకూడదు. సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోవడం ఖచ్చితమైన డైట్ పాటించడం చేయాలి. ఇలా చేయడం మీకు మీ బిడ్డకు ఆరోగ్యకరం.

ఎక్కువ నీరు

సాధారణంగా చలికాలంలో చలి ప్రభావం వలన గొంతు, నాలుక తడి ఆరకపోవడం వలన నీరు దప్పికగా అనిపించదు. కానీ ప్రెగ్నన్సీ మహిళలు ఎక్కువ మోతాదులో నీటిని తాగడం వలన శరీరం డీహైడ్రేషన్ కు గురి అవ్వదు. జ్యూస్, కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి. ఎందుకంటే జలుబు చేసే అవకాశం ఉంటుంది.

ఎటువంటి దుస్తులు ధరించాలి?

గర్భంతో ఎప్పుడు హాస్పిటల్ కు వెళ్లాల్సి వస్తుందో తెలియదు కాబట్టి, వింటర్ లో మీ శరీరాన్ని బాగా కప్పి ఉంచుకోవాలి. స్పెటర్స్ ధరించడం, కాళ్లకు, చేతులకు సాక్సులు వేసుకోవడం చేయాలి. ఎందుకంటే చలికాలంలో సూక్ష్మక్రిములు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీ శరీరాన్ని వెంటనే చేరుతుంటాయి.

నిద్ర వ్యాయామాలు

గర్భంతో ఉన్నప్పుడు మీకు విశ్రాంతి చాలా అవసరం కాబట్టి మంచి నిద్రను పొందండి. అలాగే చలికాలంలో త్వరగా నిద్రలేయడానికి కష్టం కాబట్టి ఆలస్యంగా నిద్రలేచిన సాయంత్రం పూట గర్భంతో ఉన్నప్పుడు చేయాల్సిన ఎక్సర్ సైజెస్ చేయాలి. మీ శరీరం గురించి మీ కన్నా ఎక్కువగా ఎవరికి తెలియదు కాబట్టి మీరే జాగ్రత్తగా ఉండాలి.

అందం, బరువు

చలికాలంలో త్వరగా చర్మం పొడిబారుతు ఉంటుంది కాబట్టి బాడీలోషన్స్ శరీరంపై అప్లై చేసుకోవడం చేయాలి. అలాగే గర్భం దాల్చిన మహిళలు సరైన బరువును తప్పనిసరిగా మైంటైన్ చేస్తూ ఉండాలి. చలికాలంలో ఈ జాగ్రత్తలు పాటించడం వలన మీతో పాటు మీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon