Link copied!
Sign in / Sign up
94
Shares

గర్భంలో ఉన్న బిడ్డ రాసిన లేఖ నేరుగా తల్లి గుండెల్లోకి చేరింది

ప్రియమైన అమ్మ,

మనం ఇంకా నేరుగా కలవలేదు అని నాకు తెలుసు కానీ నేను నీలో భాగమే. మొదటగా, నీ గర్భంలో ఉన్నందుకు నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను.  ఇక్కడ అంతా చీకటిగా ఉంది కానీ వెచ్చగా హాయిగా కూడా ఉంది అమ్మా. నేను నీ పొట్టలో నుండి బయట వచ్చి ఎప్పుడెప్పుడు నీ వడిలో నిద్రపోవాలా అని ఎదురు చూస్తున్నా.

అమ్మా… నీకొక విషయం తెలుసా? మన ఇద్దరిదీ ఒక రక్తమే, నీ రక్తమాంసాలతోనే నేను తయారయ్యాను. నువ్వు తినే ఆహారమే తింటున్న, నువు పీల్చే గాలినే పీలుస్తున్న. ఇది నాకు తెలుసు ఎందుకంటే బహ్మ ముడి ద్వారా మనం కలిసి ఉన్నాం కదా. నాకు నువు తినే ఆహారం ద్వారా కావాల్సిన పోషకాలు లభించి నేను రోజు నీ కడుపులో భద్రంగా పెరుగుతున్నా, నువ్వు ఏమి కంగారు పడకు.

ఇంకా చెప్పనా మా, నువు మాట్లాడే ప్రతి మాట వినపడుతోంది, నాకోసం నువ్వు ఆరాటపడే ప్రతి మాట వినపడుతోంది. అంతేనా, నువు కడుపు మీద చేయి వేసిన ప్రతి సారి నా మనస్సు ఉప్పొంగి నిన్ను చూడాలని ఆత్రుత పెరుగుతోంది. నీకు ఈ మధ్య కడుపులో చక్కలిగింత పెట్టినట్టు అనిపిస్తోందా? హహ… అది నా వల్లే మా, నాకు ఎక్కిళ్ళు వచినప్పుడు నీకు కడుపులో చెక్కిగింత పెడతా. బాగుంది కదా.

నేను వినగల్గినప్పటికీ నీ మాటలు పూర్తిగా అర్థ్వ కావడం లేదు కానీ ఒక్కటి మాత్రం తెలుసు, నీ గర్భంలో ఎంత ప్రశాంతంగా హాయిగా ఉందొ అంతే గొప్పగా బయట వచ్చాక నా జీవితం ఉంటుందని. నాన్న నిన్ను చూసుకుంటున్న తీరుని బట్టి నేను ఎంత అదృష్టం చేసుకున్నానో అని అనిపిస్తుంటుంది. నాన్న…! నిన్ను తొందరగా చూడాలి, నీ భుజం మీద ఎక్కి ఆడుకోవాలి.

నేను కడుపులో ఉండి నీకు చాలా కష్టాలు పెడుతున్న కదా మా… నన్ను క్షమించు… నేను బయట వచ్చాక నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంట, పెద్దయ్యాక నేను నువ్వు నన్ను చూసుకున్న దాని కన్నా బాగా చూసుకుంట. నువ్వు చూసుకునేంత బాగా ఎవరు చేసుకోలేరు అమ్మ, కానీ పెద్దయ్యాక ప్రయత్నిస్తా, నీ సంతోషమే నా లక్ష్యం.

ప్రేమతో

నీకు పుట్టబోయే బిడ్డ.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon