Link copied!
Sign in / Sign up
97
Shares

గర్భంతో ఉన్నప్పుడు మీరు ఏడిస్తే కడుపులోని మీ బిడ్డకు ఏమవుతుందో తెలుసా?

గర్భం దాల్చిన తర్వాత స్త్రీల ఆలోచనలలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. తనకు ఎవరు పుడతారు, సరిగ్గా ప్రసవం జరుగుతుందా, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగానే పుడతారు కదా..ఇలా ప్రతి క్షణం కడుపులోని శిశువు గురించే ఆలోచన చేస్తూ తమలో తామే మధనపడుతూ ఉంటారు. ఇలాంటి వాటిలో ప్రెగ్నన్సీ సమయంలో గర్భంతో ఉన్న మహిళ ఏడవటం వలన బిడ్డపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోండి. 

మీరు ఏడిస్తే మీ బిడ్డకు ఏమవుతుంది?

గర్భంతో ఉన్నప్పుడు ఎప్పుడు నవ్వుతూ, సంతోషంగా ఉండాలని వైద్యులు, పెద్దలు చెబుతూనే ఉంటారు. కానీ ఎప్పుడు అందరూ ఒకేలా ఉండలేరు కదా. కొందరు చాలా సంతోషంగా ఉంటే, మరికొందరు విచారంగా ఉంటారు. ప్రెగ్నన్సీ సమయంలో విచారం ఉండటం, మూడీగా ఉండటం సహజమే కానీ ఎప్పుడు ఇలా ఉండకూడదు. ముఖ్యంగా ఏడవటం వలన అది పుట్టబోయే బిడ్డపై ప్రభావాన్ని చూపుతుందని వైద్యులు అంటున్నారు.

తల్లి ఏడిస్తే బిడ్డకు ఎలా ప్రభావం కలుగుతుంది?

తల్లి కడుపులో శిశువు అప్పుడప్పుడు కాళ్లతో తన్నడం చేస్తుంటారు. ఇలా చేస్తే బిడ్డ ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడని అర్థం. అంటే మీరు సరైన ఆహారం తీసుకోవడంతో పాటు సంతోషంగా ఉండటం వలన. అలాగే బయటి శబ్దాలను, మాటలను గ్రహించగలడు. అలాగే ఎమోషన్స్ కూడా కడుపులోని బిడ్డకు తెలుస్తాయి. మీరు సంతోషంగా, నవ్వుతూ ఉంటే బిడ్డ కూడా అలానే ఉంటాడు. మీరు ఏడుస్తూ బాధపడటం చేస్తే కడుపులో శిశువు అలానే ఉంటారు.

ప్రెగ్నన్సీ అప్పుడు ఏడిస్తే పుట్టాక ఎలా ఉంటారు?

ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు కానీ అధ్యయనాల ప్రకారం గర్భంతో ఉన్నప్పుడు తల్లి ఇష్టంగా తినే ఆహార పదార్థాలను పెద్దయ్యాక పిల్లలు తినడం చేస్తుంటారు. తల్లికి ఇష్టమైన ఆటలు, గర్భంతో ఉన్నప్పుడు చేసిన ఇష్టమైన పనులు, అభిరుచులు, అలవాట్లు వారి పిల్లలకు వస్తాయని సర్వే ప్రకారం తేలిన విషయం. అలాగే తల్లి ఎప్పుడు విచారం, బాధపడటం వలన పిల్లల పెరిగి పెద్దయ్యాక విచారంగా ఉండటం, ఆక్టివ్ గా లేకపోవడం జరుగుతుంది. అదే ప్రెగ్నన్సీ అప్పుడు నవ్వుతూ, సంతోషంగా ఉంటే పిల్లలు కూడా పెద్దయ్యాక చలాకీగా, ఉత్సాహంగా ఉంటారు.

గర్భంతో ఉన్నపుడు మహిళలు ఏం చేయాలి, ఎలా ఉండాలి?

వికారం, వాంతులు, ఉత్సాహంగా లేకపోవడం ప్రెగ్నన్సీ సమయంలో సాధారణంగా జరిగే విషయాలు కాబట్టి. ప్రతి చిన్న విషయానికి మదనపడకుండా మీ ఆయనతో కలిసి సినిమాకు వెళ్లడం, స్నేహితులతో మాట్లాడటం, షాపింగ్ చేయడం, ఇష్టమైన టీవీ షో లేదా కామెడీ వీడియోలు చూడటం చేయాలి. అలాగే గర్భం సమయంలో చేయాల్సిన వ్యాయామాలు, ధ్యానం చేయడం చాలా మంచిది. మరో ముఖ్యమైన విషయం పోషక ఆహారం ఏ మాత్రం తక్కువ కాకుండా చూసుకోవాలి.

వైద్యుల ప్రకారం తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చాలా వరకు కడుపులో ఉన్న బిడ్డ బయటకు వచ్చాక అలానే ఉంటారని అంటున్నారు. అందుకే ఎప్పుడు నవ్వుతూ, సంతోషంగా ఉండండి. ఈ ఆర్టికల్ అందరికీ SHARE చేయండి.  

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon