Link copied!
Sign in / Sign up
8
Shares

గర్భంతో ఉన్నప్పుడు రోజుకి ఎన్ని గ్లాసుల నీరు తాగాలి..! : ప్రెగ్నన్సీతో ఉన్న మహిళలు తప్పక తెలుసుకోవాలి

గర్భం దాల్చిన తర్వాత ఆరోగ్యం పట్ల మునుపటికంటే ఇంకాస్త జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. మీతో పాటు మీ కడుపులో ఇంకో బిడ్డకు మీరు జన్మను ఇస్తున్నారు అనే కాదు, తల్లిగా మీరు తీసుకునే ఆహారం, మీరు పాటించే డైట్..ఇలా ప్రతి ఒక్కటీ కడుపులోని బిడ్డ ఎదుగుదలపై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా మీ శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి నీరు చాలా ముఖ్యమైనది. చాలామంది మహిళలు ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు నీరు తగిన మోతాదులో తీసుకోకపోవడం వలన చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అయితే గర్భంతో ఉన్నప్పుడు రోజుకి ఎన్ని గ్లాసుల నీటిని తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..

గర్భంతో ఉన్నప్పుడు రోజుకి ఎంత మోతాదులో నీరు తీసుకోవాలి..?

సాధారణంగా శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే కనీసం ఎనిమిది గ్లాసుల నీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అదే ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు మీతో పాటు గర్భంలో పెరుగుతున్న శిశువు ఆరోగ్యంగా ఉండటానికి నీరు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రోటీన్స్, విటమిన్స్, బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడే ఆహారాలతో పాటు నీరు తీసుకోవడం చాలా ముఖ్యం. డాక్టర్లు చెప్పిన ప్రకారం ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు రోజుకి 10 నుండి 12 గ్లాసుల నీటిని తీసుకోవడం చేయాలని చెబుతున్నారు. మీ శరీరానికి మాత్రమే కాదు, కడుపులోని బిడ్డ ఆరోగ్యం గురించి కూడా..

ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు నీరు తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు 

గర్భంతో ఉన్నప్పుడు నీరు తీసుకోవడానికి కొంతమంది ఆసక్తిని కనబరచరు. నీరు తీసుకోకపోవడం వలన శరీరం డీహైడ్రేట్ అయ్యి, నీరసం అలసట కలుగుతుంది. అయితే ఈ సమయంలో నీరు సేవించడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో మీరే చూడండి..

ఆహారం 

సాధారణంగా డాక్టర్ చెప్పిన ప్రకారం గర్భంతో ఉన్నప్పుడు న్యూట్రియన్స్ ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇది మంచిదే. మీరు తీసుకున్నటువంటి ఈ ఆహారం బిడ్డ ఎదుగుదలకు సరాసరి అందదు కాబట్టి, మధ్యవర్తిగా పనిచేసే నీరు తీసుకోవడం చేయాలి. నీరు మధ్యవర్తిగా అనుసరించి బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. 

శరీరాన్ని చల్లబరుస్తుంది 

గర్భం దాల్చిన తర్వాత చాలామంది కోరుకునేది మంచి విశ్రాంతి. ఇలా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఒకే గదిలో, ఆ గది టెంపరేచర్ ప్రకారం ఉండటం వలన శరీరం ఎప్పుడు కాస్త వేడిగా ఉన్నట్లు అనిపిస్తుంది. గర్భంతో ఉన్నప్పుడు మాత్రమే కాదు, సాధారణంగా కూడా మీ శరీరం వెచ్చగా లేకుండా చల్లగా, నార్మల్ గా ఉండటానికి తగినన్ని నీరు తప్పక తీసుకోవాలి. 

చర్మం కాంతివంతంగా 

ప్రతి రోజూ తగినంత మోతాదులో నీరు తీసుకోవడం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే గర్భంతో ఉన్నప్పుడు నీరు బాగా తీసుకోవడం వలన చర్మం కాంతివంతంగా మెరుస్తుంది మరియు సున్నితంగా ఉంటుంది కూడా. ప్రెగ్నన్సీ సమయంలో ఇలా నీటిని తీసుకోవడం వలన బిడ్డ చర్మంపై కూడా మంచి ప్రభావాన్ని చూపుతుంది. 

ఇదండీ గర్భంతో ఉన్నప్పుడు ఎంత మోతాదులో నీటిని తీసుకోవాలి, నీటిని తీసుకోవడం వలన ప్రయోజనాలు, ప్రతి ఒక్కరికీ తెలిసేలా షేర్ చేయండి.. 

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

cover image source : flickr

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon