Link copied!
Sign in / Sign up
1
Shares

గర్భాదారణ సమయంలో రక్తస్రావం జరగడం ప్రమాదమా?


ప్రెగ్నెన్సీ సమయంలో రక్తస్రావం అన్నది సాధారణమైన విషయమే. మొదటి త్రైమాసికంలో ఇది మరింత సాధారణం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

స్రావానికి గల కారణాలు

మొదటి త్రైమాసికంలో బ్లడ్ స్పాటింగ్ కావడం వల్ల రక్త స్రావం జరగవచ్చు. స్పాటింగ్ జరగడానికి కారణాలేంటంటే,

- బిడ్డ అమరికలో ఇబ్బందుల వల్ల

- ఇంఫెక్షన్స్

- గర్భాశయ పాలిప్స్

స్పాటింగ్ అనేది చాలా సాధారణ విషయం. దీని వల్ల తక్కువ మోతాదులో స్రావం జరుగుతుంది. అయితే ఎక్కువగా స్రావం జరిగితే వైద్యున్ని సంప్రదించాలి.

ఎక్కువగా బ్లీడింగ్ జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే,

1. మొలార్ ప్రెగ్నెన్సీ

మొలార్ ప్రెగ్నెన్సీలో అసాధారణ కణజాలం ఒక్కోసారి పెరుగుతుంది. దీని వల్ల రక్త స్రావం జరగవచ్చు. ఒక్కోసారి దీని ప్రభావం శరీరంలోని ఇతర భాగాలపై పడి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో ఖచ్చితంగా డాక్టర్‌ను కలవడం మంచిది.

2. ఎక్టోమిక్ ప్రెగ్నెన్సీ

ఎక్టొమిక్ ప్రెగ్నెన్సీలో గర్భం ఫాలోపియన్ ట్యూబ్‌ను ఆక్రమించే అవకాశం ఉంది. ఆ గర్భాన్ని ముందుగా గుర్తించలేకపోతే ఫాలోపియన్ ట్యూబ్ పగిలే ప్రమాదం ఉంది. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

మొదటి త్రైమాసికంలో బ్లీడింగ్ అనేది సాధారణ విషయం అయితే 2వ, 3వ త్రైమాసికంలో బ్లీడింగ్ అనేది చాలా ప్రమాదకరం. ఎట్టి పరిస్థితులలోనూ నిర్లక్ష్యం చేయరాదు. స్రావాం ఎందుకు జరుగుతుందో ఒకసారి చూద్దాం.

1.ప్లాసెంటా

ప్లాసెంటా అనేది ఏర్పడితే బిడ్డ బయటకు వచ్చే దారి మూసుకుపోతుంది. దీని వల్ల స్రావం జరిగే అవకాశం ఉంది. ఇది చాలా రేర్‌గా జరిగేటప్పటికీ ఒకవేల జరిగితే చాలా సమస్యలు వస్తాయి కాబట్టి వెంటనే వైద్యున్ని సంప్రదించడం మేలు.

2.ప్లాసెంటా ప్రసవ విరోధం

ఒక్కోసారి ప్లాసెంటా వల్ల ప్రసవం జరిగే సమయంలో యుటెరస్ భాగం నుండి వేరవుతుంది. ఇలాంటి సమయాలలో కూడా రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితి ఎదురైతే తల్లికి, బిడ్డకు హానికరం. వెంటనే వైద్యున్ని కలవడం మంచిది.

3.ముందస్తు ప్రసవం

ముందస్తు ప్రసవం వల్ల కూడా రక్తస్రావం కావచ్చు. ముందుగా ప్రసవం జరిగే అవకాశం ఉన్నప్పుడు యుటెరస్ భాగంలో ఉండే కవాటం తెరుచుకోవడం వల్ల బ్లీడింగ్ జరిగే అవకాశం ఉంది. దీనిని కూడా నిర్లక్ష్యం చేయకూడదు.

గర్భాధారణ సమయంలో రక్తస్రావం సాధారణమే అయినా గమనిస్తూ ఉండాలి. ఎక్కువ స్రావం జరిగినట్లు అనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon