భారతీయలు ఎక్కువగా ఇష్టపడే చల్లని పానీయాలలో లస్సీ ఒకటి. స్వీట్ లస్సీ, మింట్ లస్సీ, మ్యాంగో లస్సీ, ఫ్రూట్ లస్సీ ..ఇలా చాలా రకాలుగా లస్సీలను చేసుకోవచ్చు. ఫ్రూట్స్ ను ఉపయోగించి లస్సీ తయారుచేసుకోవడం వలన ఆరోగ్యానికి మంచిది మరియు శరీరానికి బలాన్ని ఇస్తాయి కాబట్టి ఈ రోజు ఫ్రూట్ లస్సీ ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం..
ఫ్రూట్ లస్సీకి కావాల్సిన పదార్థాలు :
మామిడిపండు - ఒకటి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి
అరటిపండు - 2 లేదా 3 తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
పాలు - ఒక చిన్న గ్లాస్
తాజా పెరుగు - 2 కప్పులు (ఇంట్లో చేసుకున్నది అయితే మంచిది)
యాలకులు - 4 లేదా 5
రోజ్ వాటర్ - ఒక టేబుల్ స్పూన్
పంచదార లేదా తేనె - 4 లేదా 5 స్పూన్లు
ఐస్ ముక్కలు - తగినన్ని
ఫ్రూట్ లస్సీ ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూడండి..

1. ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడిపండ్లు, అరటిపండ్లను మిక్సీలో వేసుకుని మిక్స్ చేయాలి. ఇందులో యాలకులు, రోజ్ వాటర్ మరియు పాలు మిక్స్ చేసుకోవాలి.
2. ఆ తర్వాత పెరుగు, పంచదార లేదా తేనె ఇంకొంచెం పాలు కలిపి మరోసారి మిక్సీ పట్టుకోవాలి.
3. దీంతో మీరు ఇష్టపడే ఫ్రూట్ లస్సీ రెడీ అయినట్లే.
4. మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని గ్లాస్ లో వేసుకోవాలి. దీన్ని సేవించేటప్పుడు గ్లాస్ పై భాగాన కాసిన్ని బాదం పలుకులు కలుపుకుని సేవిస్తే ఇంకాస్త రుచిగా ఉంటుంది.
సో, చూశారు కదా ఫ్రూట్ లస్సీ ఎలా చేసుకోవాలో. మామిడి పండ్లు, అరటిపండ్లు మాత్రమే కాదు యాపిల్, సపోటా, స్ట్రా బెర్రీస్, దానిమ్మ పండు ఇలా ఏవైనా మీకు నచ్చిన ఫ్రూట్స్ తో చేసుకోవచ్చు..
