Link copied!
Sign in / Sign up
0
Shares

ఫ్రిడ్జ్ వాసన రాకుండా ఎలా శుభ్రం చేసుకోవాలి..??

ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఫ్రిడ్జ్ ఉపయోగిస్తున్నారు. పండ్లు, కూరగాయలు, దోశపిండి, ఇడ్లీ పిండి, చేసుకున్న వంటలు పాడవకుండా.. ఇలా ప్రతి ఒక్కటీ ఫ్రిడ్జ్ లో పెట్టడం జరుగుతోంది. అయితే ఇలా ఫ్రిడ్జ్ వాటితో నిండిపోవడం వలన ఫ్రిడ్జ్ నుండి వాసన వస్తుంటుంది. ఈ ఆహార పదార్థాలను మనం ఉపయోగించడం వలన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని ఎప్పటికప్పుడు ఫ్రిడ్జ్ ను శుభ్రంగా ఉంచుకోవాలి. అందుకు సులభంగా ఇక్కడ చెప్పుకునే ఈ గృహ చిట్కాలను ఫాలో అయితే చాలు. నిపుణులు చెప్పిన ఈ సలహాలు మీకు బాగా ఉపయీగపడతాయి కూడా..

కట్ చేసిన నిమ్మకాయలు

 

ఫ్రిడ్జ్ వాసన రాకుండా, ఫ్రిడ్జ్ లో ఉన్న పదార్థాలు చెడిపోకుండా ఉండాలంటే ఒకటి లేదా రెండు నిమ్మకాయలను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ నిమ్మకాయ ముక్కలను ఫ్రిడ్జ్ లో ఉంచుకోవడం వలన వాసన రాదు మరియు బొద్దింకలు వంటివి ఆ చుట్టుపక్కలకు కూడా దరిచేరవు.

బేకింగ్ సోడా

 

ఇది చాలా ఉత్తమమైన రెమెడీగా చెప్పుకోవచ్చు. ఒక చిన్న గ్లాస్ లో బేకింగ్ సోడాను ఉంచి ఫ్రిడ్జ్ లో ఒక మూలన 5 లేదా 6 గంటలపాటు పెట్టడం వలన ఫ్రిడ్జ్ లో ఉండే వాసనను బేకింగ్ సోడా బయటకు రానివ్వదు మరియు ఆ వాసనను బేకింగ్ సోడా నిలిపివేస్తుంది. 5 గంటల తర్వాత బేకింగ్ సోడాను బయటకు తీసేయవచ్చు.

పూలు ఉంచేటప్పుడు

 

చాలామంది ఫ్రిడ్జ్ లో పూలు ఉంచేటప్పుడు ఎటువంటి కవర్ లేదా బాక్స్ ఉపయోగించకుండా డైరెక్ట్ గా ఉంచడం వలన వాసన వస్తుంటుంది. ఇలా వాసన రావడం వలన ప్రతి ఆహార పదార్థం కూడా పూలవాసన పరిమళిస్తూ ఉంటుంది. అందుకని ఇకపై ఎప్పుడు ఇలా చేయడం మర్చిపోకండి.

లవంగాలు

 

నిమ్మకాయ లేదా ఆరంజ్ తీసుకుని సగానికి కట్ చేసుకోవాలి. ఇలా సగానికి కట్ చేసుకున్న నిమ్మకాయలో కొన్ని లవంగాలను ఉంచుకుని ఫ్రిడ్జ్ లో ఒకచోట పెట్టడం వలన వాసన రాకుండా నిలిపివేస్తుంది. ఇది కూడా బెస్ట్ రెమెడీగా చెప్పుకోవచ్చు మరియు ఖర్చు కూడా తక్కువే.

బంగాళదుంప
 

ఒక బంగాళదుంపను తీసుకుని దానిపై ఉన్నటువంటి తొక్కను తీసివేసి ఫ్రిడ్జ్ లో ఒకచోట పెట్టాలి. ఇలా చేయడం వలన ఫ్రిడ్జ్ లో ఉన్న వాసన దూరం అవుతుంది. రెండు లేదా మూడు రోజుల తర్వాత బంగాళదుంపను బయటకు తీసివేయాలి. అలాగే ఒక గ్లాస్ లేదా బాక్స్ లో ఓట్ మీల్ లేదా కాఫీ బీన్స్ ఉంచడం వలన వాసనను పోగొడతాయి.

ఫ్రిడ్జ్ ను శుభ్రం చేసేటప్పుడు

ఫ్రిడ్జ్ ను శుభ్రం చేసేటప్పుడు అందులో ఉన్న ఆహార పదార్థాలను బయటకు తీసి ఒక బాక్స్ లో ఐస్ ముక్కలను ఉంచి అందులో ఆహార పదార్థాలను ఉంచాలి. ఆ తర్వాత ఫ్రిడ్జ్ స్విచ్ ఆఫ్ చేసి కోలిన్ తో శుభ్రం చేసుకోవాలి. బాగా ఆరిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్ లో ఆహార పదార్థాలను, పండ్లు, కూరగాయలను ఉంచుకోవాలి.

ఇలా చేయడం వలన ఫ్రిడ్జ్ వాసన రాకుండా నిలిపివేయవచ్చు..

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon