Link copied!
Sign in / Sign up
4
Shares

గర్భంతో ఉన్న మహిళలు ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 పదార్థాలను తాకరాదు : చాలా ఇబ్బందులు ఎదురవుతాయి

ఓ మహిళకు తల్లి కావడం కంటే అదృష్టం ఇంకేముంటుంది. అమ్మతనం కోసం ఓ మహిళ ఎంతగానో ఎదురు చూస్తుంది. మరి అటువంటి సమయం ఆసన్నమైనప్పుడు గర్భిణి ఎంతో సంయమనం పాటించాలి. అన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. తల్లి కాబోతున్నారనే సంతోషంలో కొంతమంది మహిళలు సరైన జాగ్రత్తలు తీసుకోరు. ముఖ్యంగా ఆహారం విషయంలో గర్భిణీలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా అయితేనే వాళ్లు పండంటి బిడ్డకు జన్మనివ్వగలరు. ఏ మాత్రం అలసత్వం వహించినా.. అజాగ్రత్తగా ఉన్నా కడుపులో ఉన్నప్పుడే లేదంటే పుట్టిన తర్వాత పిల్లలకు ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

చాలా మంది మహిళలకు ప్రెగ్నెన్సీ రాగానే అది తినాలి.. ఇది తినాలి అని అనిపిస్తుంటుంది. కానీ, తొందరపడి అదీ ఇదీ తినేయకూడదు. ఇంట్లో కూడా సంతోషంలో అన్ని తీసుకొచ్చి తినాలని బలవంత పెడుతుంటారు. కాని.. ఒక్కసారి ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయ్యాక ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిందే.

మరికొంతమంది అవి తినొద్దు... ఇవి తినొద్దు, అవి తినాలి.. ఇవి తినాలి అంటూ తెగ నస పెడుతుంటారు. మరి.. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే.. అసలు ప్రెగ్నెన్సీ సమయంలో ఏం తినకూడదో తెలుసుకుందాం పదండి.

సీఫుడ్ అండ్ ఫిష్

చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కాని మంచినీటి చేపలోనే ఈ యాసిడ్స్ ఉంటాయి. కాని.. ఉప్పు నీటిలో బతికే చేపలు లేదా సముద్రపు చేపలు కొంచెం కలుషితం అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇక.. ఐస్ లో పెట్టి దాచే చేపల్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక.. స్వార్డ్ ఫిష్, కింగ్ మాకెరెల్, టైల్ ఫిష్ లాంటి వాటిలో మెర్క్యూరీ ఎక్కువగా ఉంటుంది. ఇది గర్భిణీలకు చాలా ప్రమాదం. అందుకే గర్భిణీలు వీటికి దూరంగా ఉండాలి. ఇంకా సుషి చేపలు కూడా ప్రమాదకరమే. ఇంకా.. సీఫుడ్ వల్ల లోపల పిండానికి ఏదైనా ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే.. గర్భిణీలు సాధ్యమైనంత వరకు సీఫుడ్ ను అవాయిడ్ చేయడం ఎంతో మంచింది. కాని.. మంచి నీటి చేపలను మాత్రం తినొచ్చు. కాకపోతే.. వాటిని సరిగ్గా ఉడకబెట్టాలి.

మాంసం

గొర్రె, మేక, కోడి.. వేరే ఏ జంతువు మాంసంలోనైనా ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి. కాని.. వాటిలో ఉండే బ్యాక్టీరియా చాలా డేంజర్. అందుకే.. సరిగా వండితే.. బ్యాక్టీరియా మొత్తం వెళ్లిపోతుంది. అది ఏమాంసమైనా కాని.. బీఫ్ అయినా.. మటన్ అయినా.. పోర్క్ అయినా.. చికెన్ అయినా.. సరిగ్గా వండితేనే.. గర్భిణీలకు పెట్టాలి. లేదంటే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

స్టోర్ చేసిన మాంసం, చికెన్ ను కనీసం 73 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఉడకబెట్టాలి. ఇక.. గుడ్ల విషయానికి వస్తే కొంతమంది పచ్చి గుడ్లనే ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటుంటారు. కాని.. గర్భిణీలకు మాత్రం ఇది అస్సలు కరెక్ట్ కాదు. పచ్చి గుడ్లలో ఉండే సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా వామిటింగ్ ను కలగ చేస్తుంది. అంతే కాదు.. విరోచనాలు కూడా అయ్యే ప్రమాదం ఉంటుంది. పచ్చి గుడ్లతో చేసే వంటకాలకు కూడా దూరంగా ఉండాలి.

ఒకవేళ గుడ్లను తినాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉడకబెట్టుకొని తినాలి. అది కూడా సరిగ్గా ఉడికితేనే. లేదంటే సరిగ్గా వేయించిన ఆమ్లేట్ తినొచ్చు. మీకు కొలెస్టరాల్ ఎక్కువగా ఉంటే.. హార్ట్ సమస్యలు ఉంటే పసుపు సొన తీసేసి తినండి.

డెయిరీ ప్రాడక్ట్స్

అవును. మీరు చదివేది నిజమే. డెయిరీ ప్రాడక్ట్స్ ను తినకూడదు. కాకపోతే ఓ కండీషన్. పాశ్చురైజ్ చేసిన పాలనైతే ఏమాత్రం టెన్షన్ లేకుండా తీసుకోవచ్చు. ఎందుకంటే పాలు, చీజ్, పన్నీరు, క్రీముల్లో కాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి.

పండ్లు, కూరగాయలు

పండ్లు, కూరగాయలు నిస్సంకోచంగా తినొచ్చు. కాని.. అవి ఎలా పండిచ్చినవో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. చాలా మంది కెమికల్ వేసి పండ్లు, కూరగాయలు పండిస్తుంటారు. అటువంటి వాటికి దూరంగా ఉండటమే మేలు. ఇంటిదగ్గర పండించుకునే పండ్లు, కూరగాయలు తినడమే మేలు.

కెఫిన్ పదార్థాలు

కెఫిన్ లాంటి పదార్థాలకు దూరంగా ఉండటం ఎంతో మేలు. వాటి వల్ల ఎటువంటి లాభాలు ఉండవు. గర్భిణీలు కెఫిన్, నికోటిన్, టాన్నిన్ లాంటి పదార్థాలకు దూరంగా ఉండటం ఎంతో మంచిది. అలాగే సాఫ్ట్ డ్రింక్స్ కూడా తాగకండి.

మిగతా సమయాల్లో ఎలా ఉన్నా.. ప్రెగ్నెన్సీ సమయంలో మాత్రం ఖచ్చితంగా కొన్ని ఆహార నియమాలు పాటించాల్సిందే. ఏవి తిన్నా.. సహజంగా పండిన పదార్థాలను తినడం మేలు. వీలైనంత వరకు కెమికల్ ఫుడ్డుకు దూరంగా ఉండండి.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon