Link copied!
Sign in / Sign up
52
Shares

త్వరగా, సులువుగా గర్భం రావాలంటే ఏం చేయాలో మీకు తెలుసా..!

గర్భం అనేది శృంగారం చేయడం వలనే వస్తుంది అనుకోవడం చాలా పొరపాటు. సరైన సమయంలో, సరైన పొజిషన్ లో భార్యాభర్తలు సంభోగంలో పాల్గొన్నప్పుడే గర్భం రావడానికి కారణమవుతుంది. ఐతే కొంతమంది దంపతులు ఎప్పుడు శృంగారంలో పాల్గొంటున్నా కూడా మాకు పిల్లలు కలగడం లేదే అని బాధపడుతూ ఉంటారు. అసలు పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏంటి? త్వరగా, సులువుగా గర్భం రావాలంటే ఇక్కడ తెలుసుకుందాం..

మగవారి సమస్యలు ఇలా ఉన్నాయి :

గర్భం రావడానికి మగ, ఆడ ఇద్దరు కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే కొందరు దంపతులు ఆలస్యంగా చేసుకోవాల్సిన సమయానికి కన్నా ఎక్కవ వయస్సులో పెళ్లి చేసుకోవడం (30 దాటాక), ఒత్తిడి, ఆందోళన, శృంగారంలో భయం, తీసుకునే ఆహారం కారణంగా,  అనారోగ్య సమస్యల వలన, వీర్యంలో నాణ్యత లేకపోవడం పిల్లలు కలగకపోవడానికి కారణం.

ఆడవారి సమస్యలు గర్భం దాల్చకపోవడానికి :

పీరియడ్స్ నెలకు కరెక్ట్ గా ఎప్పుడు జరగకపోవడం, హార్మోన్ల అసమతుల్యత, మహిళలలోని అండాశయం ఫిమేల్ సెక్స్ హార్మోన్స్, ఆలస్యంగా  చేసుకునే వివాహాలు, థైరాయిడ్ సమస్యలు, ఇంతకుముందు జరిగిన మిస్ క్యారేజ్ ల కారణంగా.. ఇలా ఆడవారిలో ఈ సమస్యల కారణంగా గర్భం దాల్చకపోవడానికి కారణాలు. ఐతే గర్భం రావాలంటే ఏం చేయాలో ఇక్కడ ఈ రోజు వివరంగా తెలుసుకోండి.

ఈ డేట్స్ మహిళలు గుర్తుపెట్టుకోవాలి..

పురుష వీర్యకణాలు ఎక్కువ సమయం యోనిలో ఉండటం వలన గర్భం దాల్చుతారు. అది కూడా మహిళలకు అండం విడుదల అయ్యే సమయంలో గర్భం దాల్చుతారు. మహిళలకు నెలకు ఒకసారి మాత్రమే అండం విడుదల అవుతుంది. అదే మగవారిలో వేల సంఖ్యలో ఒక్కసారి శుక్ర కణాలు విడుదల అవుతాయి. మాములుగా మగవారి నుండి విడుదలైన శుక్రకణాలు మహిళల శరీరంలోకి ఐదు రోజుల వరకు ఉంటాయి. అదే మహిళల నుండి విడుదలయ్యే అండం ఏడు నుండి పన్నెండు గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో శుక్రకణాలు అండంతో ఫలదీకరణం చెందినట్లయితే గర్భం వస్తుంది. అండంతో ఫలదీకరణం చెందిన తర్వాత పది గంటలలో పిండం ఏర్పడుతుంది.

శృంగారం చేసే పొజిషన్స్

పిల్లలు పుట్టడానికి శృంగార భంగిమలు కూడా ముఖ్యమని గుర్తించాలి. మగవారు పైన ఉండి మహిళలు కింద ఉండి శృంగారంలో పాల్గొనటం అనేది అందరికీ తెలిసిన విషయం. ఐతే మగవారి నుండి ఈ సమయంలో బయటకు విడుదలైన శుక్రకణాలు (వీర్యం) వృధా కాకుండా గమ్యస్థానానికి కరెక్ట్ గా చేరేలా భంగిమ ఉండాలి. మహిళలలో అండం విడుదలకు 4 లేదా 5 రోజుల ముందుగానీ, అండం విడుదలకు ముందు రోజు సంభోగం చేయడం వలన గర్భాన్ని పొందవచ్చు. మహిళలకు అండం ఎప్పుడు విడుదల అవుతుందో తెలిసే ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో సంభోగం చేస్తే సరిపోతుంది. అలాగే యోనిలోపల మహిళల వీర్యం ఉండేలా శృంగార భంగిమలు పాటించాలి.

కండోమ్స్ లో వాడకూడనివి

ప్రస్తుతం మార్కెట్ లో వివిధ రకాల కండోమ్స్ లభిస్తున్నాయి. వీటిలో కొన్ని మగ, ఆడ ఇద్దరి ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఎక్కువ. అందుకని వీలైనంత వరకు లూబ్రికేషన్స్ ఉన్నటువంటి కండోమ్స్ ఉపయోగించకపోవడం మంచిది.

ఈ విషయాలు మీకు ఉపయోగపడతాయని అనుకుంటే అందరికీ SHARE చేయండి.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon