Link copied!
Sign in / Sign up
1
Shares

ఫేషియల్ చేసుకునే సమయంలో మీరు చేస్తున్న 4 సాధారణ తప్పులు

ముఖం అందంగా, కాంతివంతంగా కనిపించడానికి మహిళలు ఎక్కువగా ఫేషియల్ చేయించుకుంటూ ఉంటారు. ఇందులో తప్పేమీ లేదు. ఎందుకంటే అందంగా ఉండటం లేదా కనిపించడం వలన ఆత్మ విశ్వాసం మరింత పెరుగుతుంది. ఎక్కడైనా ఏదైనా మాట్లాడాలన్నా భయపడరు. ఐతే చాలామంది ఫేషియల్ చేయించుకునే ముందు, తర్వాత కొన్ని సాధారణ తప్పులు చేస్తున్నారు. ఇలా చేయకూడదు మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా మీకోసం..

ఎండలోకి వెళ్ళకూడదు

మీ ముఖంపై ఉన్నటువంటి జిడ్డు, మచ్చలను తొలగించుకోవడానికి ఎంతో కష్టపడి చేయించుకున్న ఫేషియల్ తర్వాత 48 గంటలపాటు  మీ ముఖానికి ఎండ తగలకుండా చూసుకోవాలి. ఎండ పడటం వలన ఫేస్ ప్యాక్ లేదా ఫేషియల్ ప్రభావం తగ్గిపోతుంది.

మేకప్ వెంటనే వద్దు

ఫేషియల్ లేదా ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత వెంటనే మళ్ళీ మేకప్ వేసుకోకూడదు. ఎందుకంటే ఫేషియల్ తర్వాత చర్మ రంధ్రాలు తెరుచుకుని ఆక్సిజన్ ను గ్రహిస్తుంది కాబట్టి. వెంటనే మేకప్ వేసుకోవడం వలన మీ ఫేషియల్ వృధా అయినట్లే కదా. అలాగే మీ చర్మంపై దుమ్ము, ధూళి పడకుండా చూసుకోవాలి.

ఫేషియల్ తర్వాత స్నానం

ఫేషియల్ చేయించుకున్న తర్వాత చాలామంది చేస్తున్న మరొక తప్పు ఏంటంటే వేడిగా లేదా చల్లగా ఉన్న నీటితో స్నానం చేయడం. ఇది మంచిది కాదు, గోరు వెచ్చగా ఉన్నటువంటి నీటితో స్నానం చేయడం ఉత్తమం.

ఫేషియల్ చేయించుకోవడానికి ముందు

మీరు ఫేషియల్ చేయించుకోవడానికి ముందు తలస్నానం చేసుకుని ఫేషియల్ లేదా ఫేస్ ప్యాక్ వేసుకోవడం వలన మీ తలలోని దుమ్ము, ధూళి మీ ముఖంపై పడకుండా చేసుకోవచ్చు. తలస్నానం చేసి ఫేషియల్ చేయించుకుంటే మీ ముఖం మరింత కాంతివంతంగా ఉంటుంది.

ఫేషియల్ తర్వాత

ఫేషియల్ తర్వాత ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో రెండు స్పూన్ల నిమ్మరసం మరియు ఒక స్పూన్ తేనె కలిపి మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని సేవించాలి. ఇలా చేయడం వలన చర్మంపై ప్రెషర్ పాయింట్స్ ను దూరం చేసి మీ ముఖానికి మంచి విశ్రాంతిని అందిస్తుంది. అలాగే ప్రతి రోజూ 5 లీటర్ల నీటిని తీసుకోవడం వలన మీ ముఖం మరింత అందంగా, కాంతివంతంగా ఉంటుంది.

ఫేషియల్ ఎలా చేయించుకుంటే బాగుంటుంది, ఇంకా ఇందుకు సంబంధించి మీకు ఏమైనా టిప్స్ ఉంటే అందరికీ తెలిసేలా తెలుపవచ్చు.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon