Link copied!
Sign in / Sign up
26
Shares

ఫేస్బుక్ వ్యయస్థాపకుడు మార్క్ జుకెర్ బెర్గ్ తన చిన్న కూతురుకు భావోద్వేగంతో రాసిన లేఖ: మీకోసం తెలుగులో


ప్రియమైన ఆగస్ట్,

ఈ ప్రపంచానికి స్వాగతం. నువ్వు పెద్దయితే ఏమవుతావో చూడాలని, మీ అమ్మా నేను చాలా ఉత్సాహంగా ఉన్నాం.

మీ అక్క పుట్టినప్పుడు, తను, నువ్వు ఎదిగే ఈ ప్రపంచం ఎలా ఉండాలో కోరుకుంటూ,  ఒక ఉత్తరం రాశాం-- ఉత్తమమైన చదువు, తక్కువ జబ్బులు, బలమైన సంఘాలు, గొప్ప సమానత్వం కలిగిన ప్రపంచాన్ని వాగ్దానం చేసాం. సైన్స్ అండ్ టెక్నాలజీ లో సాధించే పురోగతి వలన మీరు మాకన్నా మంచి జీవితాలని పొందుతారు. దాన్ని సాధించడానికి నా పాత్ర తప్పకుండా ఉంటుంది. అది నా బాధ్యత. చాలా మంది దీనిలో తప్పులు గురించి మాడ్లాడుతున్నారు, కానీ నేను దీనిలోని మంచి విషయాలే చివరకు విజయం సాధిస్తాయి అనుకుంటున్నాను. మీ తరం భవిష్యత్తు గురించి మేము చాలా ఆశావాదంతో ఉన్నాం.

కానీ నీకోసం రాస్తున్న ఈ ఉత్తరంలో రేపటి భవిష్యత్తు గురించి కాకుండా, నీ బాల్యం గురించి మాట్లాడాలని అనుకుంటున్నాం.  ఈ ప్రపంచంలో అందరూ ఎందుకో చాలా కోపంతో ఉన్నారు. నువ్వు అలా కాకుండా బాల్యాన్ని ఆటపాటలతో ఆనందంగా గడుపు.

నువ్వు పెద్ద అయ్యాక, నీకు అసలు తీరిక ఉండదు. అందుకే చిన్నప్పుడే నీ చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదించు, ప్రతి పువ్వు వాసన చూడు, నీకు నచ్చిన ఆకులను సేకరించు. నీకు నచ్చిన డా. స్యూస్ కథలను మళ్ళి మళ్ళి చదువు. నువ్వే కొత్త కథలను రాయి. మన ఇల్లు మొత్తం, నీ బుజ్జి బుజ్జి పాదాలతో పరిగెత్తు. బాగా నిద్రపో. నీ కలలో కూడా మా ప్రేమను పొందుతావు.

బాల్యం చాలా అందమైనది. ఒక్కసారే వస్తుంది. అందుకే భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించకు. దాని కోసం మేము ఉన్నాం. నీతో పాటు, నీ తరం పిల్లలందరుకు, బతకడానికి ఈ ప్రపంచాన్ని ఒక అద్భుతమైన ప్రదేశంగా మారుస్తాం. అందుకు నేను చేయగలిగినదంతా చేస్తాను.

ఆగస్ట్, నిన్ను మేము చాలా ప్రేమిస్తున్నాం. నీతో కలిసి మా జీవితాన్ని పంచుకోడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాం. నీ జీవితం, సంతోషంతో, ప్రేమతో నిండిపోవాలని కోరుకుంటున్నాం.

ప్రేమతో,

అమ్మా నాన్న   

ఈ ఉత్తరాన్ని అందరికి చేరేలా తప్పకుండా  SHARE చేయండి...

 

ఇవి కూడా చదవండి..

గర్భంలో ఉన్న బిడ్డ రాసిన లేఖ నేరుగా తల్లి గుండెల్లోకి చేరింది 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon