Link copied!
Sign in / Sign up
8
Shares

ఎవరి కోసం మీరు ఎట్టి పరిస్థితులలోనూ మార్చుకోకూడని 12 విషయాలు

పెళ్ళి అయిన తర్వాత కొన్ని అలవాట్లు మార్చుకోవల్సి వస్తుంది. అవన్నీ మీభర్త కోసమే అయితే మీకు కూడా సంతోషమే. అయితే, మీరు ఎంతగానో ఇష్టపడే భర్త కోసం కూడా మీరు మార్చుకోకూడని కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటంటే,

మీ ఐడెంటిటీ

సాధారణంగా మీకు పెళ్ళి అయిన తర్వాత మీపేరు మార్చుకోవల్సి వస్తుంది. అయితే మీకు పూర్తిగా ఇష్టం అయితేనే పేరును మార్చుకోండి లేదా మీకు అదో అచారం అయితే మార్చుకోండి. అంతేకాని మీకు ఇష్టం లేకపోతే అస్సలు మార్చుకోకండి. స్వతంత్ర భావాలు కలిగిన మహిళగా మీ ఐడెంటిటిని నిలుపుకోండి.

కలలు

ప్రతి ఒక్కరికీ కొన్ని లక్ష్యాలూ, కలలు ఉంటాయి. అయితే వాటిని మీరు అయిన తర్వాత మార్చుకోవాల్సిన పని లేదు. మీకు సమయం దొరికినప్పుడల్లా మీ లక్ష్యాల వైపు దృష్టి సారించండి.

నమ్మకాలు, అభిప్రాయాలు

మీకు చిన్నప్పటి నుండి కొన్ని నమ్మకాలు, అభిప్రాయాలు ఏర్పడి ఉంటాయి. వాటిని మాభర్త కోసం మార్కోవాల్సిన పని లేదు.

కెరీర్

మీ కెరీర్ గురించి మీకంటూ కొన్ని ఆలోచనలు, కలలు ఉంటాయి. వాటిని మీరు మార్చుకోవాల్సిన పని లేదు. మీ కెరీర్ అంటే మీకు ఎంత సిహ్టమో మీభర్తకు చెప్పండి. తద్వారా వారు మిమ్మల్ని ఇంకా ప్రోత్సహించే అవకాశం ఉంది.

మీ కుటుంభాన్ని చుసుకోండి

మీకు పెళ్ళి అయిన తర్వాత మీ కుటుంభానికి అసరాగా ఉండకూడదు అని ఎవరూ చెప్పరు. మీరు మీ అమ్మకు, నాన్నకు పూర్తిగా సహకారం ఇవ్వండి. వారి ఆర్థిక పరిథితి సరిగ్గా లేకపోతే వారికి సహాయం చేయండి.

ఫ్యాషన్

మీరు పెళ్ళికి ముందు ఏవిధంగా ఫ్యాషన్‌ను ఫాలో అయ్యేవారో ఇప్పుడు కూడా అలాగే అవ్వండి. మీ భర్త కోసం మీ అభిరుచులను మార్చుకోవాల్సిన పని లేదు.

హాబీస్

మనకు బాగా సంతోషాన్నిచ్చే వాటిలో హాబీస్ కూడా ఉంటాయి. కాబట్టి మీకు పెళ్ళి అయిన తర్వాత ఎన్ని పనులు ఉన్నా మీ హాబీస్‌ను వదలకండి. వాటిని మీ భర్తతో పంచుకొని మరింత సంతోషం పొందడానికి ప్రయత్నం చేయండి.

స్నేహితులు

మీకు పెళ్ళి కాకముందు చాలా మంది స్నేహితులు ఉండి ఉంటారు. అయితె, పెళ్ళి తర్వాత సమయం లేక వారిని దూరం పెట్టి ఉండోచ్చు. మీకు బాగా దగ్గర అయిన స్నేహితులతో స్నేహాన్ని కొనసాగించండి.

స్వేచ్చ

మీరు ప్రతి దానికి మీ భర్త మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మీ పనులు మీరే చేసుకొనే విధంగా ప్రయత్నం చేయండి. మీకంటూ కొంచెం ప్రైవసీను ఉంచుకోండి.

నిర్ణయం

మీరు నిర్ణయాలు తీసుకోవడానికి మీ భర్త మీద ఆధారపడకండి. మీకంటూ సొంత నిర్ణయాలను అలవాటు చేసుకోండి. దీని ద్వారా మీకు నిర్ణయాలు తీసుకోవడంలో పరిపక్వత పెరుగుతుంది.

సొషల్ మీడియా

మన చుట్టూ ఉన్న చాలా మంది అమ్మాయిలు సోషల్ మీడియా వాడటాన్న్ని సమర్థించరు. అయితే, మీకు నిజంగా ఇష్టం ఉంటే సోషల్ మీడీయాలో చురుకుగా ఉండండి. అయితే, సైబర్ క్రైంస్ నుండి జాగ్రత్తగా ఉండండీ.

మీకోసం

రోజులో మీకు చాలా పనుల వల్ల మీకంటూ కొద్ది సమయం కూడా దొరకకపోవచ్చు. అలాంటి సమయాలలో మీకంటూ కొంత సమయాన్ని ఏర్పరచుకొని మీకిష్టమైన పని చేయండి, మీకు నచ్చిన సినిమా చూడటం వంటివ్ చేస్తూ ఉండండి.

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon