Link copied!
Sign in / Sign up
3
Shares

గర్భవతిని కావడం లేదని బాధపడుతున్నారా..! అసలు కారణాలు ఇవే, వెంటనే తెలుసుకోండి

మీరు గర్భం దాల్చాలని ఎంతో  కాలం నుండి ప్రయత్నిస్తున్నారా? ఎంత ప్రయత్నించినా మీరు ప్రేగ్నన్ట్ కాకపోవడానికి కారణాలను తెలుసుకోవడం మీకు చాలా అవసరం. గర్భం దాల్చడం కేవలం దంపతులు కలవడం మీద మాత్రమే ఆధారపడివుండదు. గర్భాన్ని నియంత్రించే అనేక కారణాలు ఉంటాయి. అవన్నీ సక్రమంగా ఉంటేనే మీరు ప్రేగ్నన్ట్ కాగలరు. మిమ్మల్ని ప్రేగ్నన్ట్ కాకుండా ఆపుతున్న కారణాలేంటో ఇక్కడ తెలుసుకోండి…

1. అతి ఎక్కువ లేదా అతి తక్కువగా కలవడం 

దంపతులు బాగా దగ్గరవ్వటం  అత్యంత ప్రధానమైన అవసరం. ఆనందాన్ని ఇస్తూ పునరుత్పత్తికి కారణమవుతుంది. ఏకాంతంగా కలవడం ఇంతే చేయాలనీ ఏమి లేదు, కానీ కేవలం గర్భం దాల్చడం కోసమే అతిగా పాల్గొనటం మంచిది కాదు. అలానే మొక్కుబడిగా కలవడం వలన గర్భం దాల్చే అవకాశం తగ్గుతుంది. అందుకే తరచుగా కలుస్తూనే, మీ అండ విడుదల రోజున తప్పకుండా దంపతులు కలిసేలా చూసుకోవాలి. 

2. అధిక వత్తిడి

వత్తిడి మీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కృంగదీస్తుంది. దీని వలన మీరు గర్భం దాల్చే అవకాశాలు చాలా తగ్గిపోతాయి. అండాశయాన్ని నియంత్రించే హైపోథలామస్ ప్రక్రియలను వత్తిడి దెబ్బదీస్తుంది. దీని వలన మీ నెలసరి ఆలస్యమవుతుంది. అంతేకాకుండా సరైన సమయానికి అండం విడుదల కాదు.

3. మగవారిలో సమస్య

చాలా మంది దంపతులకు పిల్లలు పుట్టకపోవడానికి ప్రధాన కారణం మగవారిలో లోపాలు ఉండడం. మగవారి నుండి విడుదలయ్యే కణాల సంఖ్య తక్కువగా ఉండడం, ఈ కణాల కదలికలు మందంగా ఉండడం ప్రధాన లోపాలు. వీటి కారణంగా అండంలోకి మగవారి నుండి విడుదలయిన ఆ కణాలు ప్రవేశించలేవు, మీరు గర్భం దాల్చలేరు.

4. కలుసుకున్న తర్వాత

చాలా మంది మహిళలు భర్తతో కలుసుకున్న తర్వాత, మహిళల ప్రైవేట్  ప్రాంతాన్ని నీళ్ళతో కడిగేసుకుంటారు. అలా చేయడం మీరు గర్భవతి కాకుండా ఆపుతుంది. ఏకాంతం పూర్తయ్యాక అలాకడగడం వలన, మగవారి నుండి విడుదలయిన కణాలు తొలిగిపోతాయి. అందుకే  పూర్తయిన తరువాత, అలానే వెల్లకిలా పడుకోవడం వలన ఆ కణాలు లోపలకి పోవడానికి అవకాశం ఉంటుంది.

5. లో దుస్తులు

శరీరాకృతి అందంగా కనిపించడానికి మహిళలు లోదుస్తులను చాలా బిగుతుగా వేసుకుంటారు. కానీ అలా బిగుతుగా వేసుకోవడం వలన మీ పునరుత్పత్తి అవయువాలు దెబ్బతింటాయి. అలా లో దుస్తులు బిగుతుగా వేసుకోవడం కూడా మీరు గర్భం దాల్చకపోవడానికి ఒక కారణం.

6. నిద్ర లేమి

మీ శరీర క్రియలన్ని సక్రమంగా జరగాలంటే నిద్ర చాలా అవసరం. ఒక వేళ సరైన నిద్రను మీ శరీరానికి ఇవ్వలేకపోతే, వత్తిడి పెరిగి అది మీ పునరుత్పత్తి క్రియలను మందగించేలా చేస్తుంది. అందుకే శరీరానికి అవసరమైన మేరకు ప్రశాంతంగా నిద్రపోండి.

7. అధిక బరువు లేదా తక్కువ బరువు

అధికంగా లేదా తక్కువగా బరువుండడం, మీ సంతాన అవకాశాలను ప్రభావం చేస్తుంది. తక్కువ బరువుండడం వలన అండం విడుదలవదు. అధికంగా ఉండడం నెలసరిలో సమస్యలకు కారణం అవుతుంది. అందుకే మీ ఎత్తుకు తగ్గ బరువు ఉండడం మంచిది.

 
8. వాతావరణ కాలుష్యం

వాతావరణ కాలుష్యం స్త్రీలలో, పురుషలలో సంతాన లోపాలను కలిగించడానికి ఒక కారణం. వాయు కాలుష్యం, పురుగుల మందులు, రేడియేషన్, పొగ, ఇలాంటి వన్ని శరీర క్రియల మీద ప్రభావ చూపిస్తూ, సంతాన లోపాలను కలిగిస్తున్నాయి.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon