Link copied!
Sign in / Sign up
42
Shares

ఏమి జరిగిందో తెలియక చనిపోయిన అమ్మ పక్కన అలానే 5 గంటలు నిద్రపోయిన బాలుడు

సమాజం అందరికి అన్ని ఇవ్వదు. సంతోషాలు, సంబరాలతో కొందరి జీవితాలు నిండిపోతే, ఇంకొందరివి వంటరితనంతో మిగిలిపోతాయి. ఆ వంటరి జీవితాలు ఎక్కడో మొదలయ్యి ఇంకెక్కడో ముగిసిపోతాయి. అలాంటి ఒక వ్యదార్థుల జీవితం హైదరాబాద్ లోని ఒస్మానియా హాస్పిటల్ వంటరిగా ముగిసిపోయింది.

అసలేం జరిగింది?

ఆదివారం రాత్రి సమీనా అనే 36 ఏళ్ళ మహిళ, తన 8 ఏళ్ళ కొడుకుతో ఒస్మానియా జనరల్ హాస్పిటల్ కు వచ్చింది. తనతో ఎవరు లేరు. ఆమె తీవ్రమైన గుండె జబ్బు సమస్యతో కొన్నేళ్ళుగా బాధపడుతుంది. ఆమెను హాస్పిటల్ లో చేర్చుకున్న వైద్యులు వైద్యం మొదలు పెట్టారు. కానీ ఆమెకు గుండె జబ్బు చాలా తీవ్రంగా ఉండడం తో వైద్యులు ఆమెను బ్రతికించ లేకపోయారు. ఆమె చనిపోయాక శవాన్ని ఎవరికి అప్పచెప్పాలో అక్కడి సిబ్బందికి అర్ధం కాలేదు. అసలు ఆమె గురించి తెలుసుకోడానికి ప్రయత్నించగా. ఆమె భర్త వదిలేయడం తో తన కొడుకుతో వంటరిగా జీవిస్తుంది. బంధువులు కూడా ఎవరు లేరు. అయితే గుండె జబ్బు సమస్యతో బాధపడుతున్న ఆమెను ఎవరో హాస్పిటల్ లో వదిలేసి వెళ్ళారని తెలిసింది.

అయితే అక్కడి సిబ్బంది, ఈ విషయాల గురించి చర్చిస్తుండగా అసలేం జరుగుతుందో అర్ధం కానీ బాబు.  వాళ్ళ అమ్మను చూసి చాలా సేపు అవ్వడంతో, ఏమి జరుగుతుందో అర్ధం కాక, చనిపోయిన వాళ్ళ అమ్మ పక్కన అలానే పడుకుండి పోయాడు. అమ్మ ఇంకా బ్రతికే ఉందేమోనని తనను లేపడానికి ప్రయత్నించాడు. మార్చరీకి తరలిస్తుండగా అడ్డు పడి అమ్మ అంటూ ఏడుస్తూ అక్కడే ఉండిపోయాడు. ఈ సంఘటన అక్కడి సిబ్బందిని, వైద్యులను కూడా కంట తడి పెట్టించింది. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon