Link copied!
Sign in / Sign up
23
Shares

ఏమి చేసిన మీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరగట్లేదా? అయితే ఇది చదవండి!!

బెల్లీ ఫ్యాట్.. అంటే పొట్ట కింద పేరుకుపోయే కొవ్వు. ఆ ప్రాంతంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతే.. నాజూకు నడుము కాస్త..  కొవ్వుతో సైజ్ పెరుగుతుంది. దీంతో మహిళలు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ముఖ్యంగా తల్లులు ఇటువంటి సమస్యలతో బాధ పడుతుంటారు.  ఒకవేళ బెల్లీ ఫ్యాట్ కనుక పొట్ట దగ్గర పేరుకుపోతే.. దాన్ని కరిగించుకోవడానికి చాలా కష్టపడాలి. ఎంత కష్టపడ్డా.. మీ బెల్లీ ఫ్యాట్ కరగట్లేదు అంటే దానికి కింది కారణాలు అయి ఉండొచ్చు.

ప్రసవానంతరం వచ్చే డిప్రెషన్

రీసెంట్ గా జరిగిన ఓ రీసెర్చ్ ప్రకారం... డిప్రెషన్ లో ఉన్నవాళ్లకు పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుందట. దానికి కారణాలు కూడా లేకపోలేవు. డిప్రెషన్ వల్ల ఆకలి వేయక పోవడం, వ్యాయామం చేయాలనే ఆసక్తి లేకపోవం, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం లాంటి వాటి వల్ల కొవ్వు పెరుగుతుంది.

ఇక.. చాలా మంది మహిళలు తల్లులు అయిన తర్వాత డిప్రెషన్ కు లోనవుతుంటారు. దీన్నే ప్రసవానంతరం డిప్రెషన్ అంటారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్లకు తెలియకుండానే పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోతుంది. అందువల్ల ప్రసవానంతరం తల్లులు వ్యాయామాలు చేయడం మంచిది. దీనివల్ల కొన్ని రకాల హార్మోన్లు, కెమికల్స్ మెదడు రిలీజ్ అవుతాయి. ఇవి ఫ్యాట్ ను కంట్రోల్ చేసే మెటబాలిజం రేటును పెంచుతాయి. ఇవి డిప్రెషన్ ను తగ్గించడంతో పాటు కొవ్వు కరగడానికి కూడా ఉపయోగపడతాయి.

ఆహారం

మనిషికి ఉన్న ఆహారపు అలవాట్లను బట్టి వాళ్లకు ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశముందో ముందే తెలుసుకోవచ్చు. అలాగే... ఈ ఫుడ్ వల్లనే పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోతుంది. మళ్లీ అదే ఫుడ్ ద్వారా ఆ కొవ్వు కరిగించుకోవచ్చు.

ఎలా అంటే.. అనవరసమైన, కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలను తిని కొవ్వు పేరుకుపోయేలా చేయడం కంటే... కొవ్వు పేరుకుపోని పదార్థాలను తీసుకోవాలి. అయితే.. సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకుంటేనే ఇటువంటి సమస్యలు వస్తాయి. అందుకే.. మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీఅన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల శరీరానికి కొంచెం మేలు జరుగుతుంది.

వ్యాయామం

చాలా మంది మహిళలు తమ పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు తగ్గడం కోసం రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. అయినా కూడా కొవ్వు మాత్రం తగ్గదు. సరైన వర్కవుట్లు చేయకపోతే అలాగే ఉంటుంది. పొట్ట దగ్గర కొవ్వును కరిగించడానికి కార్డియో, మజిల్స్ కాంబినేషన్ వర్కవుట్లు చేయాలి. దాంతో పాటు ఒంట్లో బలం పెరిగే వ్యాయామాలు చేయాలి.

వయసు

వయసు మీద పడుతున్న కొద్దీ మీ శరీరంలో ఉన్న మెటబాలిజం రేటు తగ్గుతూ పోతూ ఉంటుంది. దీంతో మీ పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కరగదు.

ప్యాకేజ్డ్ ప్రాసెస్డ్ ఫుడ్

ప్యాకేజ్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల అనేక నష్టాలు ఉంటాయి. దాంతో పాటు పొట్ట మీద కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది.  దీంట్లో ఉండే సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల కొవ్వు శాతం పెరిగిపోతుంది.

నిద్ర

డెలివరీ తర్వాత చాలా మంది తల్లులకు నిద్ర సరిగా పట్టదు. దీని వల్ల చాలా సమస్యలు వస్తాయి. దాంట్లో ఈ బరువు పెరగడమనేది ఒకటి. దాని వల్ల కూడా పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోయే చాన్స్ ఉంటుంది.

ఒత్తిడి

తల్లిగా ప్రమోషన్ వచ్చాక.. కాస్త ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. దాని వల్ల బెల్లీ ఫ్యాట్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే.. తల్లులు తమ ఒత్తిడిని ఎంత తగ్గించుకుంటే అంత మంచింది. ఒత్తిడి పెరగడం వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ శరీరంలో విడుదలవుతుంది. దీని వల్ల శరీరంలో ఫ్యాట్ పెరుగుతుంటుంది.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon