Link copied!
Sign in / Sign up
19
Shares

ఎలాంటి ఆడవాళ్ళను మగవాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు..

మగవారు ఆడవారు ఇలా ఉండాలని, ఆడవాళ్లు మగవారు ఇలానే ఉండాలని కోరుకోవడం, కొందరంటే నచ్చకపోవడం మగ ఆడ ఇద్దరిలో సమానమే. అది వారి వారి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. అయితే మగవారు మాత్రం మహిళలు ఇలా ఉంటే ఎంతో సంతోషిస్తారు. ఇటువంటి మహిళలనే తమ జీవితంలోకి ఇష్టంగా ఆహ్వానిస్తారు.ఎటువంటి ఆడవాళ్ళని మగవాళ్ళు ఇష్టపడతారో మీరే చూడండి.

1.చిన్న పిల్లల మనస్తత్వం

చిన్నా పిల్లలలాగా ప్రవర్తించే ఆడవాళ్లంటే మగవారికి చాలా ఇష్టం. వారితో ఎక్కువ సమయం గడపడానికి కోరుకుంటారు. చిన్న పిల్లలలా వారు చేసే అల్లరి, చిలిపితనం, అమాయకత్వం వారికి ఇష్టం. అలాగే వీరు చేసే చిన్న చిన్న పనులే అవతలివారి ఒత్తిడిని, మానసిక ఆందోళనలను దూరం చేస్తాయని నమ్ముతారు. ఇటువంటి మహిళలు ఇంకా తెలివైనవారైతే మగవారు మరింత ఎక్కువగా ఇష్టం పెంచుకుంటారు.

2.రహస్య మహిళ

ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎవరికీ చెప్పుకోలేని కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. అటువంటి రహస్యాలు తెలుసుకోవడం అన్నా, ఆ రహస్యాలను ఛేదించడమన్నా మగవారికి చాలా ఇష్టం. అలా ఎవరికీ చెప్పుకోలేని ఇష్టమైన రహస్యాలను మగవారితో చెప్పుకుంటే వారి తీర్చగలరు మరియు ఎంతో గర్వంగా ఫీలవుతారు కూడా.

3.పడకగదిలో  అలా..

బహుశా ఇటువంటి ఆడవాళ్లంటే ఆసక్తి లేని మగవాళ్ళు ఉండరేమో. ఎందుకంటే మగ,ఆడ మధ్య మంచి బంధాన్ని ఏర్పపరచగలిగేది ఎక్కువగా  కాబట్టి అటువంటి మహిళలను ఇష్టపడని వారు ఉండరు. ఐతే ఎప్పుడు అదే ఆలోచనతో ఉన్న మహిళలను పెళ్లి చేసుకుంటారా? లేదా కేవలం రిలేషన్షిప్ లో మాత్రమే ఉంటారా? అనేది చెప్పడం కష్టమే.

4.ఒరిజినల్ గా ఉండేవారంటే

నిజానికి అబ్బయిలైనా, అమ్మాయిలైనా సరే వారి నిజజీవితంలో ఎలా ఉంటారో అలా ఉంటేనే వారికి చాలా ఇష్టం. ఇలా మగవారు కూడా తమ జీవితంలోకి వచ్చేవారు వారిలాగే ఉండటాన్ని ఇష్టపడతారు. ఐతే అటువంటి వారిని వెదికే టైంలో కొందరు మంచివాళ్ళలా యాక్టింగ్ చేస్తూ ఉంటారు . అటువంటి మహిళలంటే ఆ సమయం వరకు ఇష్టం ఉన్నా నిజం తెలిస్తే మాత్రం మహిళలే ఎక్కువగా బాధపడాల్సి వస్తుంది.

5.యాక్షన్ విమెన్

మగవారు ఎలా అయితే ఉంటారో అంటే భయం లేకుండా బయట ఎప్పుడైనా ధైర్యంగా తిరగడం, బైక్ రైడ్ చేయడం, గుర్రం స్వారీ చేయడం, ఎత్తైన ప్రదేశాలు ఎక్కడం, సాహసంగా ఉండేవారంటే బాగా ఇష్టపడతారు. ఇలా ఉండటం వలన ఎప్పుడైనా తమని తాము రక్షించుకోలగరని, వారికి ఒకరి తోడు ఎప్పటికీ ఉండాల్సిన అవసరం లేదని నమ్ముతారు.

6.చెడగొట్టే రకం

చెడగొట్టడం అంటే కొందరి మహిళలకు సరదా ఎలా అంటే చెడు తిరుగుళ్ళు తిరగడం ఒకటైతే తమనితామే ఆ స్థితిలోకి తెచ్చుకోవడం. కానీ ఈ విషయాలను బయటకు గొప్పగా నేనేదో సాధించాను అని మాత్రం చెప్పుకోరు. చెడిపోవడంలోనూ రకాలు ఉన్నాయి. ఒకటి తమను కోరుకున్న మగవారితో సుఖాన్ని పొందటం లేదా అతడితో ఉంటూ డబ్బులు ఖాళీ చేయడం, లైఫ్ ని ఎంజాయ్ చేయడం చేస్తుంటారు.

7.నమ్మకం కోల్పోనివారు

ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని బాధలు ఉన్నా సరే తమ తెలివితేటలతో, తమ ఆలోచనలతో ధైర్యంగా ముందుకు వెళుతూ తమపై తాము నమ్మకం కోల్పోని మహిళలంటే మగవారికి చాలా గౌరవం మరియు ఇష్టం కూడా. వీరి గొప్పతనాన్ని ఇతరులకు చెబుతారు మరియు పలువురికి ఆదర్శంగా నిలిచేలా చేస్తారు. ప్రతి మహిళలోనూ ఆ ఒక్క మ్యాటర్ మాత్రమే మగవారు కోరుకుంటారు అనుకోవడం పొరపాటు.

8.అమ్మ ప్రేమను పంచే మహిళ

మగవారి జీవితంలో అమ్మ తర్వాత ప్రధానపాత్ర పోషించేది వారి జీవితంలోకి వచ్చిన ప్రేయసి లేదా భార్య. అమ్మ నుండి నిస్వార్థమైన ప్రేమను, అనురాగాన్ని ఎలా ఐతే పొందగలిగారో అదే విధంగా తమ జీవితంలోకి రాబోయే మహిళ నుండి కోరుకుంటారు. ఇటువంటి మహిళలంటే మగవారికి ప్రత్యేకమైన గౌరవం మరియు ఇష్టం.

9.అందానికే ఈర్ష కలిగించే అందం

నిజమే మగవారు ఆడవాళ్లు అందంగా ఉండటాన్ని ఇష్టపడతారు.  అది కూడా వారు ఇష్టపడుతున్న వారిని మాత్రమే అందంగా, తమకు నచ్చిన విధంగా  ఉండాలని కోరుకుంటారు. అలాగే అందమైన మనసు కూడా ఉండాలని కోరుకుంటారు. తమ జీవితంలోకి ఒక అందమైన మహిళ రావాలని, ఆమెతో సమయం తెలియనంతగా గడపాలని కోరుకుంటారు. ఇటువంటి మహిళలను ప్రతి మగాడు ఇష్టపడతారు.

10.అసాధారణ మహిళ

మనం ఇదివరకే చెప్పకున్నాం కదా చిన్న పిల్లల మనస్తత్వం ఉండే మహిళలంటే మగవారు చాలా ఇష్టపడతారని.  అది నిజమే అలాగే అసాధారణంగా ఉండే మహిళలన్నా ఇష్టపడతారు. వారికి వీరికి చిన్న పోలిక ఉంటుంది. ఏ విషయమైనా సరే చాలా సీరియస్ గా తీసుకుని వీరు సాధించగలరు. అలాగే వీరు మగవారిని బాగా అర్థం చేసుకుంటారు మరియు బాగా నవ్వించగలరు.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon