Link copied!
Sign in / Sign up
10
Shares

ఎక్కువ సెక్స్ చేయడం వలన మీ యోని వదులైపోతుందా?


స్త్రీలకు తమ యోని గురించి అనేక సందేహాలు, అనుమానాలు ఉంటాయి. యోని గురించి పూర్తి వివరాలు తెలుసుకుని,  అవగాహనతో ఉండడం చాలా అవసరం. యోనకి సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకోవడం వలన అనేక సమస్యలకి దూరంగా ఉండచ్చు. కానీ స్త్రీలు యోనికి సంబంధించిన తమ సందేహాలను అలానే ఉంచుకుంటారు. ముఖ్యంగా యోని వదులైపోవడం మీద అనేక ప్రశ్నలు ఉంటాయి. సహజంగా సెక్స్ చేయడం వలన యోని వదులైపోతుందేమో అనే అనుమానం చాలా మంది స్త్రీలకు వుంది. అసలు అందులో ఎంత నిజం ఉందొ తెలుసుకుందాం…

ఎక్కువ సెక్స్ యోనిని వదులుచేస్తుందా?

ముందుగా మనం తెలుసుకోవాల్సింది. స్త్రీలు ఎలా విభిన్నంగా ఉంటారో వారి యోనులు కూడా అంతే భిన్నంగా ఉంటాయి. యోని సైజు అందరిలో ఒకేలా ఉండదు. కొందరివి చిన్నగా, కొందరివి పెద్దగా ఉంటాయి. యోని ఎలాస్టిక్ గుణాన్ని కలిగివుంటుంది. సాగడం, తర్వాత సంకోచించడం చాలా సహజంగా జరుగుతాయి.

స్త్రీలలో శృంగార కోరికలు కలిగినప్పుడు యోని సాగి వెడల్పు అవుతుంది. శృంగార సమయంలో అలానే వదులుగా ఉండి. తరువాత సాధారణ స్థితికి సంకోచిస్తుంది. అంతేకాని అధికంగా సెక్స్ చేయడం వలన యోని వదులవ్వడం జరగదు.

యోని వదులవ్వడానికి కొన్ని కారణాలు
1. సహజ కాన్పు

సహజ కాన్పు ద్వారా పిల్లలకు జన్మనివ్వడం మీ యోనిని వదులు చేస్తుంది. అయితే తక్కువ వయసులో పిల్లలకు జన్మనిచ్చే మహిళలలో యోని తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. కానీ ఎక్కువ వయసులో పిల్లలకు జన్మనిచ్చే మహిళలలో యోని వదులై అలానే ఉండిపోతుంది.

2. వయసు

మహిళలు వయసు పెరిగే కొద్ది యోని కండరాలు ముడుచుకుపోతాయి, దాని కారణంగా యోని వదులైపోతుంది. అంతే యోని పొడి బారిపోవడం కూడా జరుగుతుంది. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon