Link copied!
Sign in / Sign up
84
Shares

జూన్ నెలలో ప్రజాదరణ పొందిన 10 పిల్లల పేర్లు

పుట్టిన పిల్లలకు పేరు పెట్టడం అన్నది చాలా ఆలోచించే ప్రక్రియ. ఎందుకంటే ఒకసారి పేరు పెడితే అదే జీవితాంతం ఉంటుంది. అందుకే పేరు పెట్టేటప్పుడు మనకు  తెలిసిన వారందరినీ కూడా ఏ పేరు పెడితే బాగుంటుందని అడుగుతాము. అప్పుడు మనకు ఉండే కంగారు మరింత ఎక్కువ అవుతుంది. దీంతో ఏ పేరు పెట్టుకోవాలో తెలియక మరింత సంధిగ్ధంలో పడతాము. అలాంటి వారి కోసం మేము ఈ నెలలో కొన్ని బాగా ప్రాచుర్యం పొందిన పేర్లను  ఇస్తున్నాము. అవేంటంటే...

 అమ్మాయిల పేర్లు మరియు అర్ధాలు

1.ఆభా: ఆభా అనే పేరును ఈ సంవత్సరములో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పెట్టుకున్నారు. ఆభా అంటే సంస్కృతంలో మెరుస్తుండటం లేదా ప్రకాశం చెందుతూ ఉండటం అని అర్థం

2.అక్షిత: అక్షిత అనే పేరు మన తెలుగు వారు ఎక్కువగా పెట్టుకొనే పేరు. దీని అర్థం ఏమిటంటే ఎప్పటికి మారనిది లేదా శాశ్వతమైనది అని. మీ పిల్లల మీద మీ ప్రేమ శాశ్వతమైనది కాబట్టి మీ పిల్లలకు ఈ పేరు సరిపోతుందేమో పరిశీలించండి.

3.శాన్వి: శాన్వి అనే పేరుకు అర్థం లక్ష్మిదేవి. అంతేకాక, శాన్వి అంటే అందం, ఐశ్వర్యం, దయ, మంచితనం వంటి ఎన్నో సుగుణాల కలయిక అని అర్థం. ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా ఉన్న వారు తమ పిల్లలకి శాన్వి అన్న పేరు పెట్టుకుంటారు.

 4.మైరా: మైరా అన్న పదం ఆంగ్ల బాషకు చెందినది. మైరా అన్న పదానికి లాటిన్‌లో ప్రసంశనీయమైన, అసాధారణమైన, వంటి అర్థాలు ఉన్నాయి. 

 5.కీరా: కీరా అన్న పదం ఐరిష్ బాషకు చెందినది. కీరా అంటే నల్లటి జుట్టు కలవారని అర్థం. ఇది విదేశీ పదం అయినప్పటికీ చాలా మంది భారతీయ తల్లిదండ్రులు తమ పాపకు ఈ పేరు పెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. 

పైన చెప్పినవన్నీ కూడా వినడానికి శ్రావ్యముగా, అర్థవంతంగా ఉండడముతో, ఈ తరం తల్లితండ్రులు వీటిని ఇష్టపడి తమ పిల్లలకి పెట్టుకుంటున్నారు.

 అబ్బాయిల పేర్లు మరియు అర్ధాలు

 1.ఆరవ్: ఆరవ్ అంటే ఎక్కువ తెలివి కలవారని, శాంతికి చిహ్నం అని అర్థం. కొంచెం కొత్తగా ఆలోచించే చాలా మంది తల్లితండ్రులు తమ అబ్బాయిలకు ఈ పేరును పెడుతున్నారు. ఈ పేరు అబ్బాయిలలో బాగా ప్రాచుర్యం పొందినది.

 2.వివాన్: వివాన్ అంటే అరుణోదయ కాంతి అని అర్థం. వివాన్ అన్న పేరు పెట్టుకోవడానికి చాలా మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. కృష్ణునికి ఉన్న వివిధ పేర్లలో వివాన్ కూడా ఒకటి. వివాన్ అన్న పదానికి సంగీతం అనే అర్థం కూడా వస్తుంది.

 3.ముహమ్మద్: ముహమ్మద్ అనే పేరును మన దేశంలో ఉన్న చాలా మంది ముస్లిం తల్లితండ్రులు తమ పిల్లలకు ఇష్టంగా పెట్టుకుంటారు. ముహమ్మద్ అంటే ప్రసంశనీయమైన అర్థం వస్తుంది. అంతేకాక, ప్రీతి పాత్రమైన అనే అర్థం కూడా వస్తుంది. ఈ పేరు కూడా ఈ సంవత్సరములో బాగా ప్రాచుర్యం పొందినది.

 4.అథర్వ: అథర్వ అనేది మన మొదటి వేదం. విఘ్నేశ్వరుడిని కూడా అథర్వ అని పిలుస్తారు. మీ పిల్లలకు ఆద్యాత్మికతతో కూడిన ట్రెండీ నేమ్ కావాలంటే ఈ పేరు సరిపోతుంది

 5.రుద్ర: రుద్రుడు అనగా శివుడు. రుద్ర అంటే నొప్పిని తగ్గించేవాడనే పర్యాయ పదం కూడా ఉంది.  ఇది కొంచెం పాతదైనప్పటికీ చాలా మంది పేరెంట్స్ ఈ పేరును తమ పిల్లలకు పెట్టుకుంటున్నారు. రుద్ర అన్న పేరు పిలవడానకి కూడా సౌకర్యంగా ఉంటుంది.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon