Link copied!
Sign in / Sign up
4
Shares

ఈ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం : గర్భిణీ స్త్రీలు బయటకు వస్తే ప్రమాదమా..?

జనవరి 31, 2018 సాయంత్రం గం.5.20 లకు మొదలై 7.25 నిముషాల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం కొనసాగుతుందని అటు శాస్త్రవేత్తలు, పండితులు, జ్యోతిష్యులు చెబుతున్నారు. మరికొన్ని గంటలలో ఆకాశంలో జరగనున్న అద్భుతం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఐతే ఈ రోజు చంద్రగ్రహణం అందరూ చూడవచ్చని అంటున్నా గర్భంతో ఉన్న మహిళలు బయటకు రావచ్చా? రాకూడదా? అనే ప్రశ్న చాలామందిని వెంటాడుతుంది.

గర్భిణీ స్త్రీలు చూడవద్దని జ్యోతిష్యులు

సంపూర్ణ చంద్రగహణం మరికొన్ని గంటలలో రానుంది. దీనిని ‘సూపర్ బ్లూ బ్లడ్ మూన్’ గా పిలుస్తున్నారు. ఎందుకంటే సాధారణ పౌర్ణమి కంటే చంద్రుడు ఈ రోజు పెద్దగా కనిపించడమే విశేషం. చివరిగా 1982 లో ఈ అద్భుతం కనిపించగా మళ్ళీ ఈ రోజున వస్తోంది. 2037 లో మళ్ళీ ఈ అద్భుతం కనిపించనుందట. ఐతే గర్భంతో ఉన్న మహిళలు ఈ గ్రహణం చూడకూడదని, కడుపులో ఉన్న శిశువుకు మంచిది కాదని, గ్రహణానికి రెండు గంటల ముందే ఆహారం తీసుకుని పడుకోవాలని, బయటకు రాకూడదని జ్యోతిష్యులు, పండితులు అంటున్నారు. అలాగే గ్రహణం వీడిన రెండు గంటల తర్వాత ఆహారం తీసుకోవచ్చని చెబుతున్నారు.

సైన్స్, శాస్త్రవేత్తలు చెబుతున్న నిజాలు

పైన చెప్పిన విషయాలు మూఢనమ్మకాలని, గర్భిణీ స్త్రీలకు, కడుపులో ఉన్న బిడ్డకూ సంపూర్ణ చంద్రగ్రహణం వలన ఎటువంటి ప్రమాదం ఉండదని సైన్స్, సైన్టిస్ట్స్ సూచిస్తున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆకాశంలో జరిగే ఈ అద్భుతాన్ని వీక్షించడం వలన ప్రమాదం ఉందనడంలో నిజం లేదని కొట్టిపారేస్తున్నారు. జ్యోతిష్యశాస్త్రాన్ని ఫాలో అవుతున్న వారు కొందరు ఉంటే, సైన్స్ ప్రకారం ఈ అద్భుతాన్ని వీక్షించడానికి సిద్ధమయ్యారు మరికొందరు.

సంపూర్ణ చంద్రగ్రహణం గురించి మీకు తెలిసిన ముఖ్యమైన విషయాలను COMMENT చేసి అందరితో పంచుకోగలరు. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon