Link copied!
Sign in / Sign up
1
Shares

ఈ పిల్లాడికి చేతులు లేవు, గుండె ధైర్యం ఉంది. ప్రపంచం మొత్తం సలామ్ చేస్తోంది

సాధించగలను అన్న ఆత్మ విశ్వాసం, పోరాడగలను అన్న గుండె ధైర్యం..ఇవే ఈ ఆరేళ్ళ పిల్లాడి ఆయుధాలు. పుట్టుకతోనే చేతులు లేకపోయినా సాధించాలన్న పట్టుదల ఉంటే వైకల్యం అడ్డురాదని నిరూపించి కొన్ని కోట్ల మందికి స్ఫూర్తిగా నిలిచాడు ఇస్మాయిల్ జుల్పిక్. ఈ పిల్లాడికి ఇప్పుడు ప్రపంచం మొత్తం సలామ్ చేస్తోంది. ఎందుకో మీరే తెలుసుకోండి.

పుట్టుకతోనే చేతులు లేవు

6 ఏళ్ళ ఈ పిల్లాడి పేరు ఇస్మాయిల్ జుల్ఫిక్. పాపం పుట్టుకతోనే చేతులు లేకుండా జన్మించాడు. ఒకసారి స్విమ్మింగ్ పూల్ లోకి దిగి ఈత కొట్టాలని ప్రయత్నించాడు. చేతులు లేకపోవడం ఒక ఇబ్బంది ఐతే ఎలా ఈత ఆడాలో తెలియక ప్రమాదంలో పడ్డాడు. తల్లితండ్రులు చూసి బిడ్డను కాపాడుకున్నారు. ఆ తర్వాత నుండి స్విమ్మింగ్ పూల్ వైపు వెళ్ళొద్దని చెప్పారు.

కాళ్లతోనే తినడం, రాయడం

తల్లితండ్రులు స్విమ్మింగ్ పూల్ వైపు వెళ్ళొద్దని చెప్పినా మనస్సు మాత్రమే అక్కడికే లాగుతోంది ఇస్మాయిల్ కు. అలాగే చేతులు లేకపోవడంతో కాళ్ళతోనే రాయడం, బుక్స్ తిప్పి వేయడం, ఆహారం తీసుకోవడం చేసేవాడు. ఎప్పుడు ఇలా చేయడం వలన వెన్నెముక నొప్పిగా ఉంటోందని తల్లితండ్రులతో చెప్పేవాడు. తమ బిడ్డను చూసి కన్నీరు పెట్టుకునేవారు ఆ తల్లితండ్రులు.

తల్లితండ్రులను ఒప్పించాడు

కాళ్లతోనే తినడం, రాయడం చేస్తుండంతో అది వెన్నుకు నొప్పి కలిగిస్తూ ఉండేది. దీనితో స్విమ్మింగ్ చేయడం కష్టమని పేరెంట్స్ వద్దన్నారు. ఐతే తమ ఇంటికి దగ్గరలోని ఓ ప్రదేశంలో తనలాగే వికలాంగులైన చిన్నారులు ఈత కొట్టడం చూసి నేను నేర్చుకుంటాను నన్ను కూడా అక్కడ జాయిన్ చేయించండి పేరెంట్స్ ను కోరడంతో ఒప్పుకున్నారు.

ఒలింపిక్స్ లో కూడా..

కష్టమైనా ఇష్టపడి చేస్తున్న పని కాబట్టి త్వరగానే ఈత కొట్టడం, డైవింగ్ చేయడం, వెనుకకు ఈదుకొంటూ వెళ్లడం నేర్చుకున్న ఇస్మాయిల్ ఒలింపిక్స్ లో ఆక్టివ్ గా పాల్గొన్నాడు. ఇస్మాయిల్ ఆత్మవిశ్వాసం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇక రీసెంట్ గా వాళ్ళ దేశంలో జరిగిన స్విమ్మింగ్ పోటీలలో గెలిచి గోల్డ్ మెడల్ సాధించాడు. ఇప్పుడు తమ కొడుకును కన్నీరు పెట్టుకుంటూ ఆనందిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఇతడి పేరు మారుమోగుతోంది కూడా.

ఆత్మవిశ్వాసం ఉంటే వైకల్యం అడ్డుకాదని నిరూపించిన ఇస్మాయిల్ ను చూసి మనం నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. ఏమంటారు ఫ్రెండ్స్..

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon