Link copied!
Sign in / Sign up
53
Shares

ఈ పరిస్థితి ఏ బిడ్డకూ రాకూడదు..! ఏం జరిగిందో మీరే చూడండి

మానవులుగా మనం సిగ్గు పడాల్సిన బాధాకరమైన విషయం ఇది. ఒక బిడ్డ మెట్లపై బట్టలు లేకుండా ఎండలో పడి ఉన్నాడు. కానీ, అక్కడ కొన్ని వందలమంది  నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా చూడటం లేదు, కనీసం బిడ్డ బ్రతికే ఉన్నాడా? లేదా? అని కూడా పట్టించుకోలేదు.  ఇటువంటి పరిస్థితి మరే బిడ్డకూ రాకూడదని ఆ భగవంతుడిని ప్రార్థించండి. అసలేం జరిగిందంటే…

ఒంటిపై బట్టలు లేవు..

ఈ సంఘటన కొన్ని రోజుల క్రితం మనీలా అనే నగరంలో జరిగింది. రద్దీగా ఉండే ఒక వీధిలో అటు నుండి వెళ్ళడానికి అక్కడ ఉన్న ఈ మెట్లపైనే వెళ్ళాలి.  ఆ మెట్లపై భగభగమండే సూర్యుడి కింద ఒక బిడ్డ బట్టలు లేకుండా పడి ఉన్నాడు. ఒక ఫోటోగ్రాఫర్ ఈ ఫోటోలను సొషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యాయి. ఆ ఫోటోగ్రాఫర్ చాలా సేపటి నుండి అలా నడుచుకుంటూ వెళ్తున్న వారిని చూస్తూ ఉన్నాడు. ఒక్కరు కూడా ముందుకు రాలేదు, బిడ్డను పట్టించుకోలేదు.

ఒక తల్లికి అప్పగించారు

ఫోటోగ్రాఫర్ ఆ పిల్లాడిని చూస్తూ కన్నీటితో ఫోటోలు తీస్తున్నాడు. తన ఫ్రెండ్ కు చెప్పి బిడ్డను తీసుకోమని పక్కనే ఇంటి నిర్మాణం పనులు జరుగుతుంటే ఈ బిడ్డ మీకు తెలుసా అని అడిగారు. ఏ ఒక్కరూ స్పందించలేదు. చివరిగా చిరిగిన బట్టలతో అమాయకంగా ఒక తల్లి వచ్చి బిడ్డను తన చేతుల్లోకి తీసుకుంది. ఫోటోగ్రాఫర్ ఆ బిడ్డ కోసం ఫుడ్ తీసుకువచ్చి ఆమెకు అప్పగించి వెళ్లారు. ఆ బాధాకరమైన ఫోటోలు ఇవే…

మానవత్వం మరిచి వెళ్తున్న కొంతమందికి ఈ ఫోటోలు చేరేలా ఈ ఆర్టికల్ SHARE చేయండి. మరే బిడ్డకు ఇలా జరగకూడదని కోరుకుందాం.. 

#1 మెట్లపై బట్టలు లేకుండా బాబు..

#2 మానవత్వం మరిచి వెళ్తున్న జనం 

#3 ఒక్కరు కూడా పట్టించుకోలేదు 

#4 మరే బిడ్డకు ఈ పరిస్థితి రాకూడదు 

 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon