Link copied!
Sign in / Sign up
4
Shares

ఈ పాపకు కళ్ళు, చెవులు 2 సంవత్సరాలు పనిచేయలేదు : కళ్ళు వచ్చాక అమ్మను ఎలా చూస్తుందో చూడండి

ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారి పేరు నికోలి పెరీరా. ప్రపంచంలో పుట్టుకతోనే వచ్చే కొన్ని అనారోగ్య సమస్యలలో ఈ చిన్నారికి ఒక వ్యాధి సోకింది. కళ్ళలో ఫ్లూయిడ్ ఎక్కువగా ఉండటం చూపు సరిగ్గా కనిపించేది కాదు, దీని వలన చెవులలోకి చేరి చెవులు కూడా మూతపడిపోయాయి. ఇలా ఇబ్బంది పడుతున్న ఈ చిన్నారికి 2 ఏళ్ళ తర్వాత ఆపరేషన్ జరిగింది. అమ్మ చేతులను తాకుతూ తన ప్రేమను ఎలా చూపిస్తుందో చూడండి..

ఏం కావాలన్నా చేతులతో తాకేది..

ఎప్పటికీ మర్చిపోలేని సంతోషాలను తీసుకువస్తారు అని పిల్లలు పుట్టగానే ప్రతి ఒక్క తల్లితండ్రులు సంతోషపడుతూ ఉంటారు. కానీ ఆ భగవంతుడు రాసిన విధిరాత వలన కొన్ని సమస్యలు చిన్నతనంలో అనుభవించాల్సి ఉంటుంది. అలా ఈ చిన్నారి కూడా పసివయస్సులో తనకేం జరుగుతుందో కూడా తెలియని వింత జబ్బు బారిన పడింది. కళ్ళు కనిపించవు, అమ్మ నాన్న మాట్లాడుతున్నా ఏం కావాలి అని అడుగుతున్నా చెవులు వినిపించేవి కావు. ఆ చిన్నారి పేరెంట్స్ చాలా బాధపడేవారు. తన చేతులతో అమ్మను తాకుతూ తనకేం కావాలో చెప్పేది.

అందరి సహాయంతో కంటి చూపు వచ్చింది

తన కూతురికి కంటి చూపు తెప్పించడానికి తిరగని హాస్పిటల్ లేదు. కొన్నిసార్లు ఆపరేషన్ వరకు వెళ్లి నిలిచిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. శస్త్రచికిత్స చేసినా ఉపయోగం లేకపోయింది. డాక్టర్లు కచ్చితంగా కంటి చూపు వస్తుంది, పాప వినగలదు బాగా మాట్లాడగలదు అని చెప్పడంతో తమ వద్ద అంత డబ్బు లేకపోవడంతో సోషల్ మీడియా అయిన పేస్ బుక్ ద్వారా తన కూతురు సమస్యను చెప్పింది. అలా ఫండ్ రైజింగ్ ద్వారా దాదాపు $17000 యూఎస్ డాలర్లు వచ్చాయి. సక్సెస్ ఫుల్ గా ఆపరేషన్ జరిగింది. ఆ ఆపరేషన్ జరిగాక కంటి చూపుతో అమ్మను చూస్తూ నికోలి పెరీరా ఎలా ఆనందపడుతుందో ఈ వీడియోలో చూడండి.

తన కూతురికి కంటి చూపు వచ్చాక థాంక్యూ దేవుడా అని ఎంతో సంతోషంగా చెప్పింది నికోలి పెరీరా అమ్మ గారు… 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon