Link copied!
Sign in / Sign up
7
Shares

ఈ పాపను బయటకు తీసాక తిరిగి కడుపులోకి పంపి కుట్లు వేశారు : తర్వాత ఏమి జరిగింది?


అవును ఇది మీరు నమ్మలేని నిజం!! అమెరికాలో జరిగిన సంఘటన. ఒక పాపను 23 వారల వయసులో బొడ్డు పేగు తెంపకుండా కడుపునుండి బయటకు తీసి, మళ్ళి కడుపులోకి పంపి కుట్లు వేశారు. తరవాత పూర్తిగా నెలలు నిండిన తరువాత మళ్ళి బయటకు తీశారు. అసలేం జరిగిందో కొంచెం వివరంగా తెలుసుకుందాం…

ఈ పాప కడుపులో ఉండగా 22 వరాల సమయంలో, తనకు చాలా అరుదైన కణితి ఉందని కొన్ని వైద్య పరీక్షల ద్వారా తేలింది. దానిని కడుపులో అలానే వదిలేస్తా బిడ్డకు, తల్లికి ప్రమాదం. ఒకవేళ ఆ కణితిని తొలిగించడానికి, 22 వారాల బిడ్డను బయటకు తీస్తే, బిడ్డకు ప్రమాదం. అందుకే వైద్యులు, తల్లికి బిడ్డకు ప్రమాదం జరగని ఒక ఆలోచనకు వచ్చారు. ముందుగా బిడ్డను సిజేరియన్ ద్వారా బొడ్డు తాడు తెంపకుండా కడుపు నుండి బయటకు తీసి, కణితిని తొలిగించి, తిరిగి కడుపులోకి పంపారు. పూర్తి నెలలు నిండిన తరువాత సిజేరియన్ డెలివరీ ద్వారా తల్లి బిడ్డకు జన్మనిచ్చింది.

ఇప్పుడు తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు..ఇలాంటి ఆపరేషన్ ప్రపంచంలోనే మొదటి సారి జరిగిన అరుదైన సంఘటన. ఇలా ఈ పాప అమ్మ కడుపు నుండి రెండు సార్లు బయటకు వచ్చింది.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon