Link copied!
Sign in / Sign up
15
Shares

దారుణం : ఆంధ్రాలోని ఈ ఊర్లో బాలింతలను 3 నెలలు వెలివేస్తున్నారు, ఎవరు తాకకూడదు.. ఎందుకంటే 😱😱

ప్రపంచంలో దాదాపు ప్రతి ఒక్కరి జీవితం కంప్యూటర్స్ తో నడుస్తూ ఉంటే ఇంకా  కొందరి జీవితాల్లో మాత్రమే వెలుగు దగ్గరకి చేరకుండా ఆచారాలు అనే చీకటిలో మిగిలిపోయాయి.  అలా చీకటిలో మగ్గిపోతున్న జీవితాల్లో అమ్మ గొప్పదనాన్ని తెలియజేసే ఆడవాళ్లు, బాలికలు ఉండటం బాధాకరం. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలిస్తే గుండెల్లో బాధకలుగుతుంది.

పిల్లలకు జన్మను ఇచ్చిన మహిళ 3 నెలలు బయటే ఉండాలి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో రొళ్ల మండలంలో గల గంతగొల్లహట్టి అనే గ్రామంలో బిడ్డకు జన్మను ఇచ్చిన బాలింతను ఊర్లోకి అడుగుపెట్టనివ్వరు, ఆమె తనతో పాటు తన బిడ్డతో కలిసి ఊరి పొలిమేరలో ఒక గుడిసెలో నివసించాలట. అలాగే వారికి ఎవరూ సహాయం చేయకూడదని, వారి పనే వాళ్ళే చేసుకోవాలని, వారిని తాకరాదు అనే ఆచారం ఇప్పటికీ ఉందట. ప్రతి నెల మహిళలను వేధించే పీరియడ్స్ (నెలసరి) సమయంలో మహిళలు మరియు ఆడపిల్లలను ఇంటి బయట లేదా ఊరి బయట ఉంచుతారు. బాలింతలు మూడు నెలలు పూర్తయ్యాక, మహిళలు నెలసరి గడిచాక స్నానం చేసి ఊర్లోగల గుడిని దర్శించుకుని అప్పుడు ఇంటికి వెళ్ళాలట.

ఎందుకు ఇలా చేస్తున్నారంటే..!!

ఒక మహిళ బిడ్డకు జన్మను ఇవ్వబోతుందని తెలిసినప్పుడు కొన్ని రోజుల ముందే తాటాకులతో ఒక గుడిసె లేదా రేకులతో ఇంటిలా ఊరికి 3 కి. మీ దూరంలో గల పొలిమేరలో ఆ ఇంటి సభ్యులు నిర్మిస్తారు. బిడ్డ పుట్టాక ఆమె అక్కడే బిడ్డతో పాటు ఉండాలి. ఎవరైనా వీరికి సహాయం చేసినా, తాకినా వాళ్ళు కూడా ఊర్లోకి రాకూడదు. దీనిని దైవాజ్ఞగా అప్పుడెప్పుడో ఫాలో అయినవి ఇప్పుడు కూడా పాటించడం ఆ ఊరి మహిళలను బాధిస్తోంది. అక్కడ కనీస సౌకర్యాలు దొరకవు, కరెంట్ అస్సలే ఉండదు. ఎవరూ చెప్పినా కూడా వీరిలో మార్పు రావట్లేదని అంటున్నారు కొందరు అధికారులు. ప్రభుత్వం ఈ సమస్యపై కొంత దృష్టి పెట్టి మహిళల సమస్యను గుర్తించి వారికో దారి చూపాలని కన్నీటితో చెప్పుకుంటున్నారు.

ఈ విషయంపై మీ COMMENT ను తెలుపగలరు. ఇటువంటివి ఇంకా ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon