Link copied!
Sign in / Sign up
10
Shares

ఈ 4 ఆయుర్వేద చిట్కాలు వాడితే మీ జుట్టు సహజంగానే నల్లబడుతుంది

జుట్టు నిగ నిగ లాడుతూ నల్లగా ఉంటే చాలా అందంగా ఉంటుంది. ప్రతి మహిళ తన జుట్టు నల్లగా ఉండాలని కోరుకుంటుంది. కానీ పొల్యూషన్, పోషకాహార లోపం వలన చిన్న వయసులోనే జుట్టు తెల్లబడి పోతుంది. అయితే జుట్టును నల్లబరుచుకోడానికి కెమికల్స్ తో కూడిన రకరకాల ప్యేస్ట్ లను వాడుతున్నారు. వాటిలో ఉన్న కెమికల్స్ వలన జుట్టు పూర్తిగా పాడైపోతుంది. అందుకే జుట్టును సహజంగా నల్లబరుచుకోడానికి కొన్ని ఆయుర్వేద చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.

1. కొబ్బరి నూనె, కరి వేపాకు

కావాల్సిన పదార్ధాలు :

కొబ్బరి నూనె - 1 కప్పు

కరి వేపాకు - కొన్ని ఆకులు

పెసర పిండి - 2 స్పూన్స్

తయారి విధానం :

1. కరివేపాకులు కడిగి మెత్తగా  రుబ్బుకోవాలి.

2. మెత్తగా రుబ్బిన కరివేపాకును నూనెలో వేసి వేడి చేయండి

3. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి, ఒక అరగంట వరకు అలానే ఉంచుకోండి.

4. తల స్నానం చేసిన తరువాత పెసర పిండి పెట్టుకుని, తల స్నానం చేయండి.

2. ఉసిరి కాయ, శికాకాయ

కావాల్సిన పదార్ధాలు :

1. ఉసిరి కాయ - 25 గ్రాములు

2. శికా కాయ - 25 గ్రాములు

3. కొబ్బరి నూనె - 4 చుక్కలు

తయారి విధానం :

1. ఉసిరి కాయలలోని విత్తనాలను తీసివేసి, శికా కాయతో కలిపి మెత్తగా రుబ్బండి. ఆ మిశ్రమాన్ని ఒక రాత్రి అలానే ఉండనివ్వండి.

2. పక్క రోజు మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 20 నిమిషాల వరకు అలానే ఉండనివ్వండి.

3. తల స్నానం చేసిన కొబ్బరినూనెతో జుట్టును మర్దన చేసుకోండి.

3. హెన్నా, నిమ్మ రసం

కావాల్సిన పదార్ధాలు:

1. హెన్నా తగినంత

2. నిమ్మ రసం - 4 స్పూన్స్

తయారి విధానం :

1. హెన్నా ను నిమ్మరసం తో మెత్తగా కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని ఒక రాత్రి అలానే నాననివ్వండి.

2. ఈ మిశ్రమం తో తలను మర్దన చేసుకుని 2 గంటల పాటు అలానే ఉంచుకోండి.

3. నీటితో జుట్టును కడిగిన తరువాత, షాంపూతో తల స్నానం చేయండి.

4. షాంపూ తరువాత కండీషనర్ వాడండి.

4. క్యారట్, బీట్ రూట్

కావాల్సిన పదార్ధాలు :

క్యారోట్ జ్యూస్ - సగం కప్పు

బీట్ రూట్ జ్యూస్ - సగం కప్పు

తయారి విధానం

1. క్యారోట్, బీట్ రూట్ జ్యూస్ ను కలిపి జుట్టుకు పెట్టుకోండి

2. పెట్టుకున్న ఆర గంట తరువాత తల స్నానం చేయండి.

3. క్యారోట్, బీట్ రూట్ జుట్టుకు ఏ హాని చేయకుండా సహజమైన రంగును అందిస్తాయి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon