Link copied!
Sign in / Sign up
12
Shares

ఈ కవలలు వేర్వేరు చర్మం రంగుతో జన్మించారు. ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ఈ చిత్రంలో ఎడమవైపు కనిపిస్తున్న చిన్నారి పేరు కరణి. తెల్లటి చర్మం మరియు నీలం కళ్ళతో జన్మించింది. కుడి వైపున ఉన్న అమ్మాయి జరని. కాస్త నలుపు చర్మంతో గోధుమ రంగులో కళ్ళు ఉంటాయి. ఈ ఇద్దరూ కవలపిల్లలు. తల్లి గర్భం నుండి ఒకేసారి బయటకు వచ్చిన ఈ కవలలు వేర్వేరు చర్మంతో ఎలా జన్మించారు? అని చాలామందికి ఉన్న అనుమానం. అదెలాగో ఇక్కడ చూద్దాం..

తల్లితండ్రుల పోలిక

Image Credits : ELITE PHOTOGRAPHY

ఒక సంవత్సరం క్రితం జన్మించిన ఈ కవల పిల్లలు తమ తల్లితండ్రుల పోలికలతో జన్మించడం విశేషం. తల్లి తెల్లగా అందంగా ఉంటుంది, ఆమె పోలికలతో కరణి జన్మించింది. మరో కూతురు జరని కాస్త నలుపు రంగుతో ఉంటుంది, నాన్న పోలికలతో జన్మించింది. జన్యువుల మిశ్రమ ఫలితం కారణంగానే ఇలా ఒకే కడుపు నుండి వచ్చిన పిల్లలు వేర్వేరు చర్మం రంగు మరియు విభిన్నమైన కంటిరంగును పోలి ఉన్నారని డాక్టర్లు అంటున్నారు. ఇలా 500 మందిలో ఒకరికి జరుగుతుందని చాలా రేర్ గా ఇలా జన్మిస్తారని అంటున్నారు.

షాక్ అయిన డాక్టర్స్

మొదట తల్లి గర్భం నుండి అమ్మాయి వచ్చింది. తెల్లగా అందంగా ఉంది. ఈ పాపలాగే మరో బిడ్డ కూడా అదే రంగుతో జన్మిస్తుందని డాక్టర్లు అనుకున్నారు. కానీ చివరికి డిఫరెంట్ స్కిన్ కలర్ తో మరో పాప తల్లి గర్భం నుండి రావడంతో షాక్ అయ్యానని చీఫ్ డాక్టర్ అన్నారు. తల్లితండ్రుల జీన్స్ (జన్యువుల) కారణంగానే పిల్లలు వేర్వేరు చర్మం రంగుతో జన్మిస్తారని అన్నారు. ఇప్పుడు ఈ పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారో కదా.. ఈ ఫోటోలను ఈ పిల్లల తల్లి విట్నీ మేయర్ పోస్ట్ చేశారు. 

ఈ కవలలకు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టమట. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేరట. ఈ సోదరీమణులు మీకు నచ్చి ఉంటే వెంటనే SHARE చేయండి.    

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon