Link copied!
Sign in / Sign up
7
Shares

ఈ ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్ లో పెడితే విషంతో సమానం..!

ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో కంపల్సరీగా ఉండాల్సిన వస్తువుగా ఫ్రిడ్జ్ ను చెప్పుకుంటున్నారు. ఫ్రిడ్జ్ ఇంట్లోకి వచ్చినప్పుడు ప్రతి ఆహారాన్ని, ప్రతి పండ్లను అందులో ఉంచడం, ముందుగానే ఫుడ్ రెడీ చేసుకుని చెడిపోకూడదని అందులో ఉంచుకుని మళ్ళీ వేడి చేసుకుని తినడం..ఇలా ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్ అయిపొయింది. ఐతే ఇక్కడ చెప్పుకునే ఈ ఆహార పదార్థాలతో పాటు మరికొన్నింటిని ఫ్రిడ్జ్ లో అస్సలు ఉంచకూడదు. అవేంటో మీరే తెలుసుకోండి.

తేనె

తేనెను ఎప్పటికీ ఫ్రిడ్జ్ లో ఉంచకూడదు. ఏ సీజన్ లో అయినా సరే తేనె బయట ఎన్ని రోజులు ఉన్నా సరే చెడిపోదు. అందుకని తేనెను ఫ్రిడ్జ్ లో పెట్టకండి. సాధారణంగా ఏ అల్మారాలోనో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో ఉంచడం వలన తేనె రుచిని కోల్పవలసి వస్తుంది.

అరటిపండ్లు

అరటిపండ్లు చెడిపోకుండా ఉండటానికి చాలామంది ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటారు. ఇలా చేయడం వలన అరటిపండ్లలో ఎంజైమ్స్ దెబ్బతింటాయి. అలాగే చల్లటి ఉష్ణోగ్రతల కారణంగా అరటిపండ్ల ప్రక్రియ వేగాన్ని దెబ్బతీస్తాయి. అందుకే వీటిని బయటే ఉంచడం ఉత్తమం.

పొటాటో

ఫ్రిడ్జ్ లో ఉండే చల్లని ఉష్ణోగ్రతల కారణంగా బంగాళాదుంపలలో చక్కర శాతం త్వరగా పెరిగే అవకాశం ఉంది. అలాగే వీటిని పేపర్ బ్యాగ్ లేదా కవర్ లో కూడా ఉంచాల్సిన అవసరం లేదు. నీటితో శుభ్రం చేయకుండా ఎలా ఉన్నవాటిని అలా మీ వంట రూమ్ లోని కప్ బోర్డ్ లో ఉంచుకోవచ్చు.

టమోటో

 

మార్కెట్ నుండి తీసుకువచ్చిన టమోటోలను రిఫ్రిజిరేటర్ లో ఉంచడం వలన చల్లటి ఉష్ణోగ్రతల కారణంగా త్వరగా పండిపోయే అవకాశం ఉంది మరియు అంతకుముందు ఉండే రుచిని కోల్పోవడం జరుగుతుంది.
ఉల్లిపాయలు

తరిగిన ఉల్లిపాయ ముక్కలు లేదా ఉల్లిపాయలను కవర్ లో ఉంచి ఫ్రిడ్జ్ లో పెట్టినా సరే ఉల్లిపాయల నుండి వాసన వస్తూ ఉంటుంది. వీటి వాసన ఇతర ఆహారాలకు కూడా వస్తుంది కాబట్టి ఫ్రిడ్జ్ లో ఉంచకపోవడం బెటర్.

వెల్లుల్లి

మన శరీర రోగనిరోధక శక్తిని పెంచే వెల్లుల్లిని ఫ్రిడ్జ్ లో ఉంచడం వలన దీనిని ఆహారంలో వాడినా ఫలితం ఉండదు. ఎందుకంటే చల్లటి ఉష్ణోగ్రతల కారణంగా ఇందులో ఉండే రుచి మరియు సువాసన మిస్ అవుతుంది మరియు ఫ్రిడ్జ్ లో ఉంచడం వలన కుళ్లిపోయే అవకాశం కూడా కలదు.

బ్రెడ్

చాలామంది బ్రెడ్ త్వరగా పాడైపోతుందని ఫ్రిజ్ లో పెట్టడం చేస్తుంటారు. ఇకపై అలా చేయకండి. ఎందుకంటే ఫ్రిజ్ చల్లటి వాతావరణానికి బ్రెడ్ త్వరగా ఆరిపోయి గట్టిగా అవుతుంది. అలాగే రుచిని కూడా కోల్పోవలసి వస్తుంది.

పుచ్చకాయ

మార్కెట్ నుండి తీసుకువచ్చిన వాటర్ మెలాన్ (పుచ్చకాయ) ను కట్ చేయకుండా ఉంటే ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో ఉండే బీటా కెరోటిన్ ను కోల్పోవలసి వస్తుంది. ఒకవేళ మీరు కట్ చేసిన పుచ్చకాయను ఫ్రిజ్ లో పెట్టాలి అనుకుంటే ఒక కవర్ లేదా బాక్స్ లో ఉంచుకోవాలి.

పూలు

పూలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిడ్జ్ లో ఉంచకూడదు. పూల సువాసన మొత్తం ఫ్రిడ్జ్ లో ఉన్నవటువంటి ఇతర ఆహార పదార్థాలపై ప్రభావం చూపించి వాసనను కలుగజేస్తాయి.

ఊరగాయలు

సూర్యకాంతి పడకుండా ఊరగాయ, ఆవకాయలను ఇంట్లో ఉంచడం వలన రెండు మూడేళ్ళ పాటు పాడవ్వకుండా ఉంటాయి. ఎస్..నిజమే కావాలంటే మీ పెద్దవారిని అడగండి. మంచి నూనె ఉపయీగించి బాగా తయారు చేసిన ఊరగాయలు చెయ్యి పెట్టకుండా గరిటె వాడితే బాగానే ఉంటాయి. అలాగే ఫ్రిడ్జ్ లో ఉంచడం వలన రుచి పోతుంది మరియు చల్లటి ఉష్ణోగ్రతలకు పాడవుతాయి.

మరి ఫ్రిడ్జ్ లో ఏమి ఉంచుకోవాలి అని ప్రతి ఒక్కరికీ ఈ పాటికే అనుమానం వచ్చే ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ లో దాని గురించి చెప్పుకుందాం.. చలికాలంలో పిల్లలకు ఫ్రిడ్జ్ లోని ఆహారాన్ని ఇవ్వకండి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon