Link copied!
Sign in / Sign up
16
Shares

ఈ 9 చిట్కాలను ఫాలో అయితే ప్రసవం తర్వాత కూడా అందంగా ఉంటారు


ప్రసవం తర్వాత మహిళల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. మీరు లావు అవుతారు, మీకు పొట్ట దగ్గర మార్క్స్ వస్తాయి,  మీ బ్రెస్ట్ ఎక్కువవడం లేదా సాగడం జరుగుతుంది. ఇవన్నీ జరగడం వల్ల మీరు మునుపటి అందాన్ని కోల్పోతారు. ఆ అందాన్ని తిరిగి పొందడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటంటే,

ప్రకాశవంతంగా ఉండండి

ప్రసవం జరిగిన తర్వాత మీ మొహంలో కాంతి తగ్గిపోతుంది. అయితే మీరు డీలా పాడాల్సిన అవసరం లేదు. మీ శరీరానికి కావల్సిన ఆంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల మీరు కాంతివంతంగా మారవచ్చు. యాంటీ ఆక్సీడెంట్లు బెర్రిస్, రేగుపళ్ళు, ఆరెంజ్ పళ్ళు, ఎండుద్రాక్ష వంటి వాటిలో ఎక్కువగా ఉంటాయి.

నీటిని ఎక్కువగా తీసుకోండి

ప్రెగ్నెన్సీ సమయంలో మీ శరీరంలో నీటి శాతం చాలా వరకు తగ్గి ఉంటుంది. కాబట్టి నీటిని వీలైనంత ఎక్కువగా తీసుకోండి. అంతేకాక, ప్రతిరోజు కనీసం ఒక గ్లాస్ పళ్ళ రసం తీసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు మునుపటి కాంతిని పొందవచ్చు.

ప్రెగ్నెన్సీ గుర్తులను తొలగించుకోండి

ప్రసవం జరిగిన తర్వాత మహిళల పొట్ట మీద మార్క్స్ రావడం సహజం. ఆ మార్క్స్ తగ్గించుకోవడం ద్వారా అందాన్ని పెంచుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ లేదా ఆముదంతో మర్ధనా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఫేస్‌ప్యాక్ వేయండి

ప్రసవాన్ని ఎదుర్కొన్న తర్వాత వచ్చే హార్మోన్ అసమతుల్యం వల్ల మీ ముఖం మీద నల్లటి మచ్చలు వచ్చే అవకాశం ఉంది. వీటిని పోగొట్టుకోవడానికి ఫేస్‌ప్యాక్స్ తరచుగా వేసుకోండి. వెల్లుల్లీ పేస్ట్‌ను లేదా ఆరెంజ్ తొక్కను ఫేస్ మీద అప్లై చేయవచ్చు.

కళ్ళ కింద వలయాలు

ప్రెగ్నెన్సీ సమయంలో నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల కళ్ళ కింద వలయాలు వచ్చే అవకాశం ఉంది. వాటిని తొలగించుకోవడానికి దోస ముక్కలను లేదా టీ బ్యాగ్‌లను మీ కళ్ళ కింద పెట్టుకోండి. ఇలా రోజూ చేస్తూ ఉంటే కళ్ళ కింద మచ్చలు తగ్గిపోతాయి.

పాపతోపాటూ నిద్రపోండి

పాప ఎప్పుడు నిద్రపోతుందో అప్పుడే మీరు కూడా నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు బాగా విశ్రాంతి దొరికే అవకాశం ఉంది.

జుట్టు మీద శ్రద్ధ తీసుకోండి

మీకు ఆందోలన కలిగించే మరో విషయం ఏమిటంటే, మీ జుట్టు రోజూ రాలిపోవడం. మీరు మీ పాప కోసం చేసే పనులతో బిజిగా ఉండటం వల్ల జుట్టు మీద శ్రద్ధ తీసుకోలేక పోతారు. కాబట్టి జుట్టు డ్రై కాకుండా రోజూ ఆయిల్ పూయండి.

డ్రై స్కిన్ మీద దృష్టి పెట్టండి

ప్రసవం తర్వాత మీ చర్మం, మీ పెదవులు డ్రైగా మారి జీవాన్ని కోల్పోతాయి. కాబట్టి మీరు ప్రతిరోజూ క్రీమ్‌స్, లిప్ బాంస్ పూయడం మంచిది. దీంతో పాటూ మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోండి.

వ్యాయామం చేయండి

ప్రసవం తర్వాత సాధారణంగానే మహిళలు బరువు పెరుగుతారు. కాబట్టి రోజూ చిన్నపాటి వ్యాయామం చేయడం వల్ల తిరిగి మునుపటి ఆకృతికి రావచ్చు.  కేవలం 10-25 నిముషాల వాకింగ్ మీకు ఫలితాలను ఇవ్వవచ్చు.

మీరు మునుపటి ఆరోగ్యాన్ని, అందాన్ని పొందాలంటే పైచిట్కాలు పాటించండి.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon