Link copied!
Sign in / Sign up
1
Shares

ఈ 7 విషయాలు మీ కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చేస్తాయి!!


పిల్లలు అనగానే కుటుంబ నియంత్రణ మనకు గుర్తుకువస్తుంది. పిల్లలు పుట్టాక వారి ఇష్టాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబం లో తీసుకునే ప్రతి నిర్ణయం లోను పిల్లలు కీలక పాత్ర వహిస్తారు.అటువంటి నిర్ణయాలు తీసుకునేటపుడు ఈ 7 విషయాలని మర్చిపోకండి. ఇది మెరుగైన నిర్ణయాలను సులభంగా తీసుకోవడం లో సహాయ పడుతుంది.

1. ఖర్చులు 

పిల్లలు కనాలి అని అనుకునేటపుడు మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి అనేది గుర్తుంచుకోవాలి. అందువలన తగినంత సంపాదన ఉండేలా చూసుకోండి. ఒక వేల లేని పక్షం లో ఆర్ధికంగా స్థిరపడేవరకు పిల్లలు ని కనే ఆలోచన లేకపోవడం మంచిది.

2 . పిల్లల చదువు 

 పిల్లలకి ప్రీ స్కూల్ లో అడ్మిషన్ ఇప్పించడం సులభమైన విషయమే కావొచ్చు కానీ ఫీజులు ఆకాశాన్ని తాకుతాయి. మీ పిల్లలని ప్రీ స్కూల్ లో చేర్పించకపోతే వారు ఇతరుల కన్నా వెనకపడి ఉంటారు. అందువలన వారిని తప్పనిసరిగా ప్రీస్కూల్ లో చేర్పించండి.

3. కలిసి భోంచేయండి 

మీ ఇంట్లో పిల్లలు ఉన్నట్లు అయితే రోజుకి ఒక పూట అయినా సరే కుటుంబం అంతా కలిసి భోజనం చేసేలా చూసుకోండి. ఇలా చేయడం వలన పిల్లలు కుటుంబం లో వ్యక్తులు మధ్య అనుబంధం పెరగడమే కాకుండా వారు ఒకరు గురించి ఒకరు బాగా తెలుసుకోగలుగుతారు. ఇది పిల్లలు పెద్ద వయసులోకి వచ్చాక ఎదురు మాటలు మరియు ఎదురు తిరడటం వంటి వాటిని తగ్గిస్తుంది.

4. సరుకులు 

నెలవారి  సరుకులు మరియు ఇతర అవసరాల లిస్టును తయారు చేసుకోవడం ఎంతో సహాయపడుతుంది. సరుకులు వంటి వాటికీ ఇంటి రాబడి లో కీలకపాత్ర పోషిస్తుంది. లిస్టు చేసుకోవడం వలన అధికంగా ఖర్చుపెట్టకుండా మనం జాగర్త పడగలము. ఈ అలవాటును మీరుగర్భవతి కాకముందే మొదలుపెట్టండి. ఎందుకంటే పిల్లలు పుట్టాక కూర్చులు అదుపులో పెట్టడం లో ఎంతో సహాయపడుతుంది.

5. కుటుంబ నియంత్రణ 

 పిల్లలు కనా లనుకునే విషయం లో నియంత్రణ పద్ధతులు వినియోగించే బదులుగా మీ ఋతు చక్రం గమనించుకుంటూ ఉండండి . మీ సంతానోత్పత్తి శాతం ఎక్కువగా ఉన్న రోజుల్లో శృంగారం ని నియంత్రించండి.

6. మాట్లాడండి 

 మీరు ఉన్న పరిస్థితుల్లో ఉన్న ఇతర కుటుంబ వ్యక్తులతో మాట్లాడుతూ ఉండండి. ముందుగా వారు వారి పిల్లలని ఏ స్కూల్ లో చేర్పించారు , ఎంత ఖర్చు అయ్యింది, పిల్లల వయసు వంటివి కనుక్కోండి. మీ పిల్లలకి ఏది మంచి స్కూల్ అని పరిశోధించి చేర్పించండి.

7. రెండో సంతానం 

 ఒక పిల్లాడు పుట్టిన తరువాత రొండోవ పిల్లదానిని జాగర్తలు తీసుకుని కనండి. ఒకరిని పోషించడమే ఎంత కష్టం అనే విషయం మీకు తెలిసిందే. రొండో బిడ్డ గురించి బాగా అలోచించి నిర్ణయం తీసుకోండి. అమ్మ పాలు ఇవ్వడం అనేది నియంత్రణ పద్దతి కాదు. అమ్మ పాలు ఇస్తున్నప్పుడు కూడా ఒక తల్లి గర్భవతి అయ్యే అవకాశాలు ఎన్నో ఉన్నాయి.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon