Link copied!
Sign in / Sign up
81
Shares

ఈ 6 పిల్లల ప్రాడక్ట్స్ అస్సలు వాడకండి. చాలా ప్రమాదకరం

పిల్లలకు సౌకర్యంగా మరియు సంతోషంగా ఉండాలని మనం మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వారికి సమకూరుస్తుంటాము.  కానీ అవి పిల్లలకు  ఎంత వరకు మంచివి,  ప్రమాదం ఏమైనా ఉందా అని తెలుసుకోవడం తల్లిదండ్రులుగా మన భాద్యత. ఈ క్రమంలో పిల్లలకు హాని చేసే 6 ప్రాడెక్ట్స్ ఇప్పుడు తెలుసుకుందాము.

1. బేబీ వాకర్స్

తెలిసో తేలికో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ పిల్లల కోసం బేబీ వాకర్స్ కొంటున్నారు. పిల్లలు కూడా వాటిని అమితంగా ఇష్టపడుతున్నారు. నేను కూడా మా బాబుకి కొనిచ్చాను కానీ ఈ విషయం తెలిసాక వాడనివ్వలేదు. పిల్లలు వాకర్ వాడటం వలన ఎదుగుదల కొంచెం నెమ్మదిస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా, ఒక సర్వే ప్రకారము దాదాపు 21000 మంది పిల్లలకు బేబీ వాకర్ నుండి మెట్ల మీద దొర్లి కింద పడటం వలన గాయాలయ్యాయి అని సమాచారం. అందువలన, సహజంగా పిల్లలకు నడక నేర్పడం అత్యంత శ్రేయస్కరం.

2. క్రిబ్ టెంట్స్ (తొట్టి గుడారాలు)

క్రిబ్ టెంట్స్ ని మనం పిల్లలు సురక్షితంగా ఉండడానికి ఉపయోగిస్తాము. కానీ, దాని వలనే ప్రమాదం కూడా ఉందని గుర్తించాలి. పిల్లలను క్రిబ్ టెంట్స్ లో పాడుకోబెట్టి దానిలోనే బెల్ట్స్ తో సురక్షితంగా ఉండాలని బిగిస్తాం. కానీ, పిల్లలు కదిలినప్పుడు, లేవడానికి ప్రయత్నించినప్పుడు ఆ బెల్ట్స్ వాళ్ళకి చుట్టుకుని ఏమైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. అందువలన క్రిబ్ టెంట్స్ కొనడం బదులు పిల్లల పరుపులు కొనడం ఎంతో ఉత్తమం.

3. పసి పిల్లల బాత్ టబ్స్ (స్నానం చేయించే తొట్టెలు)

బాత్ టబ్స్ ని వాడటం వలన పిల్లలకు సురక్షితంగా స్నానం చేయించ వచ్చు అని చాలా తప్పు అభిప్రాయం కలగ చేస్తున్నారు. ఈ టబ్ పిల్లలు నిటారుగా కూర్చోబెట్టడానికి ఉపయోగ పడుతుందని చెప్తున్నారు. నిజమే. కానీ పిల్లలు కింద పడే పోయే అవకాశం ఉంది అని ఎవరు చెప్పట్లేదు. ఒక సర్వే ప్రకారం దాదాపు 170 మంది బాత్ టబ్స్ వాడడం వలన చనిపోయారంట. కాబట్టి, సహజ పద్దతిని అవలంభించడమే మంచిది అని చాలా మంది మహిళలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

4. స్లిoగ్ క్యారియర్స్

వీటిని మనం రోజు చూస్తూ ఉంటాము. అమ్మ కానీ నాన్న కానీ పిల్లలను వీటిలో ఎత్తుకొని వాకింగ్ కి వెళ్లడం, సరదాగా పిల్లలను పార్క్ లో తిప్పడం లాంటివి చేస్తుంటారు. కానీ, దాదాపు 15 మంది పిల్లలు ఇలా ఎత్తుకోవడం మూలాన ఊపిరి ఆడక చనిపోయారంటే నమ్ముతారా? అంతే కాకుండా మరెంతో మంది పిల్లలకు చిన్నపాటి గాయాలు కూడా అయ్యాయని ఒక సర్వే అధ్యాయనం. పిల్లలను స్లిoగ్ క్యారియర్స్ లో ఎత్తుకోవడంతో వారి బిగుసుకొని, ఒత్తిడికి గురి అవ్వడమే దీనికి కారణం అని నిపుణుల అభిప్రాయం.

5. బంపర్స్

నిజానికి వీటిని పిల్లల తలకి దెబ్బ తగలకుండా ఉండటానికి తయారు చేయడం జరిగింది. కానీ అతి చిన్న వయసులోనే పిల్లల తలకదలికలను నిరన్తరించడం అంత మంచిది కాదు. పిల్లలు సహజంగా వారి తలను వారే సర్దుకోవడమే మంచిది. దీని వలన పిల్లల మెడ కూడా బలపడుతుంది.

6. స్లీప్ పొజిషనర్

2010 లో అమెరికా ప్రభుత్వం స్లీప్  పొజిషనర్స్ కి వాడే అప్పుడు జాగ్రత్త వహించాలి అని ఒక హెచ్చరిక జారీ చేసింది. వారి ప్రకారం దాదాపు 10 మంది పిల్లలు దీనిని వాడటం వలన ఊపిరాడక చనిపోయారంట. స్లీప్ పొజిషనర్ పిల్లలను పొట్ట మీదకు తిరగకుండా ఉంచ డానికి తయారు చేయబడినవి. ఈ స్లీప్ పొజిషనర్ లో ఆసిడ్ రిఫ్లెక్స్ సమస్యలను తగ్గించడానికి తలని కొంచెం ఎత్తడానికి వీలుగా ఉంటాయి. కానీ పిల్లలు పొరపాటున తలని పొజిషనర్కి విరుద్దంగా పెడితే వారికి ఊపిరి అందకుండా పోయే ప్రమాదం ఉంది. అందువలన వీటిని వాడకపోవడం మంచిది.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon