Link copied!
Sign in / Sign up
2
Shares

ఈ 6 లక్షణాలు కనపడితే మీ కాన్పు ముందే జరుగుతుంది

 

ఫలానా డేట్ కు కాన్పు వస్తుందని డాక్టర్లు ముందే చెబుతారు. కానీ కొన్ని సందర్భాల్లో ముందే రావచ్చు. అలాంటప్పుడు వచ్చే నొప్పులు స్త్రీలకు నిజంగా పీడకలే. ఆ బాధను భరించలేరు. చాలామందికి ఈ నొప్పులు ఎప్పుడు వస్తాయో తెలీదు. ఈ రోజుల్లో టెక్నాలజీ అడ్వాన్స్ అయింది కాబట్టి, ముందే బిడ్డను కనకుండా డాక్టర్లు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. అయితే ముందస్తు కాన్పు వస్తే  ఈ నొప్పుల లక్షణాలు ముందస్తు కాన్పు (ప్రీ మెచ్యూర్ డెలివరీ) రావడానికి రెండు, మూడు వారాల ముందు నుంచే కనబడతాయి. అవి:

1. వెన్ను నొప్పి : 

కాన్పు రావడానికి చాలా ముందు నుంచే వెన్ను నొప్పి వస్తుంది. అసౌకర్యంగా ఉంటుంది.

2. డిస్చార్జి : 

ప్రి మెచ్యూర్ లేబర్ పిరియడ్ లో బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుంది.

3. ఒత్తిడి : 

కటి ప్రాంతంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే యోని నొప్పి కూడా ఉంటుంది.

4. వికారం: 

 వికారంగా ఉంటుంది. వాంతులవుతాయి. ఫ్లూ జ్వర లక్షణాలు కనిపిస్తాయి.

5. సంకోచం : 

ప్రతి పది నిముషాలకూ శరీరం సంకోచించినట్టు అనిపిస్తుంది.

6. తిమ్మిరి: 

పీరియడ్ వచ్చే టైంలో మాదిరిగా కడుపు కింది భాగంలో తిమ్మిరిగా ఉంటుంది.

ఈ లక్షణాలు తీవ్రంగా కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon