Link copied!
Sign in / Sign up
2
Shares

ఈ 5 రకాలలో మీ భర్త ఏ రకమో తెలుసుకోండి..

ఏ మానవ సంబంధం అయినా నమ్మకం అనే పునాది మీదనే నిలబడుతుంది. భార్యాభర్తలు, స్నేహితులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు.. ఇలా ఏ బంధాలు అయినా వారి మధ్య సత్సంబంధాలు నెలకొనాలి అంటే ఒకరి మనసు మరొకరు అర్దం చేసుకుని ఉండాలి. అలాగే జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది భార్యాభర్తల బంధమే, ఎందుకంటే ఎవరితో అయినా జీవితంలో ఏదో ఒక సమయంలో మాత్రమే బంధాలు గాఢంగా ఉంటాయి. కానీ ఒక్క భార్యా భర్తల బంధంలోనే బ్రతికినంత వరకూ ఒకరికొకరు తోడూ నీడలా ఉండాలి. అలాంటి జీవిత గమనంలో ఎన్నో అపార్ధాలు, మనస్పర్థలు, అలకలు వస్తుండటం సహజం. ఏదైనా కానీ భార్యా భర్తలు ఒకరినొకరు అర్ధం చేసుకుంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు వారి జీవితం మీద ఏ మాత్రం ప్రభావం చూపకపోవచ్చు. అయితే భర్తల మనస్తత్వాలు ఎలా ఉంటాయో మీ భర్త అందులో ఏ వర్గానికి చెందుతాడో చూసుకోండి.

మీ భర్త మీకు సరిగ్గా అర్ధం కావట్లేదని మీరు భావిస్తున్నారా! అతని అలవాట్ల గురించి తెలిసినా కానీ ఇంకా అర్ధం కానిది ఏదో ఉందని అనుకుంటున్నారా! అయితే మీ భర్త ని అంచనా వేయటానికి, మనసుని తెలుసుకోవాడనికి ఇదే మీకు ఛాన్స్.. ఈ ఐదు రకాలలో మీ భర్త ఏ వర్గంలో ఉన్నాడో చూసుకోండి.

1. ఎప్పుడూ పని.. పనీ..

మిస్టర్ పర్ఫెక్ట్ లాగా ఎప్పుడు చూడండి.. పని పనీ అంటూ ఫ్యామిలీ తో సరిగా సమయం గడపరు వీళ్ళు. కానీ ఎంత చేసినా అది వాళ్ళ ఫ్యామిలీ కోసమే అని తెలుసుకోండి. పాపం వీళ్ళకి సొంతంగా సమయం అంటూ ఉండదు. ఎంత సంపాదించినా అదంతా కుటుంబం భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని చేసేదే. చేసే పనిలో ఎప్పుడూ బెస్ట్ గానే ఉంటారు. భవిష్యత్ లో తమ పిల్లలకు కూడా ప్రేరణగా నిలుస్తారు. కుటుంబానికి ఏ లోటూ లేకుండా అందరికీ మంచి జీవితం ఇవ్వడం కోసమని వీళ్ళ జీవుతాన్ని ధారపోస్తారు. ఇలాంటి భర్తని కలిగి ఉండటం అదృష్టమని చెప్పాలి.

2. దృఢమైన మనసు ఉన్న భర్త

ఇతనే మీ జీవితానికి బలం, బలగం. ఎలాంటి సందర్భంలో అయినా మీ వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తాడు. మిమ్మల్ని ప్రతీ విషయంలో చక్కగా అర్ధం చేసుకోగలడు. చాలా సహనం ఉంటుంది. ఎంత సహనం ఉంటుందంటే జీవితంలో ఒకటి రెండు సార్లకి మించి ఆవేశపడటం లేదా కోప్పడటం మీరు చూడరు మీ భర్తలో. అంతే కాక ఎవరూ అభిమానించనంతగా మిమ్మల్ని అభిమానిస్తారు, ప్రేమిస్తారు. పిల్లలతో కూడా చాలా సరదాగా ఒక ఫ్రెండ్ లాగా ఉండగలరు. జీవితం అంతా సంతోషంగా గడిచిపోతుంది.

3. ఫిలాసఫర్ మరియు ఫ్రెండ్

ఇతను బాగా ఆలోచిస్తాడు. ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించగలడు. మీకు మంచి స్నేహితుడిలా సలహాదారుగా కూడా ఉండగలరు. మీ మనసు బాలేకపోతే మంచి మాటలతో మీ మూడ్ మార్చగలరు. మీరు రోజులో చేసినవన్నీ సాయంత్రం కూర్చుని మాట్లాడుకునేతప్పుడు చెప్తే మంచిగా ఎనాలసిస్ చేసి మంచిగా చెప్పగలరు. మీ లైఫ్ ఇంకా మెరుగ్గా ఎలా లీడ్ చేయాలో కూడా సరైన సలహా ఇవ్వగలరు. మీ పిల్లల జీవితంలో, చదువులో, ఆటల్లో మంచిగా రాణించడానికి మీ భర్త పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుంది.

4. ఆశావాది

జీవితంపై ఆశ ఎక్కువగా ఉంటుంది. అతని కలలు, ఊహలు, ఆలోచనలు జీవితంపై కొత్త ఆశలు రేకెత్తిస్తాయి. ఆ విషయం మీకు బాగా నచ్చుతుంది అతనిలో. మీ భర్తకు దైవ భక్తి బాగా ఎక్కువ. దేవుడంటే భక్తితో పాటు భయం కూడా ఎక్కువే ఉంటుంది. అదే భక్తిని తమ పిల్లల్లో కూడా నాటుతారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భక్తిని మాత్రం వదలరు, పైగా ఎక్కువ అవుతుంది కూడా.

5. స్వేచ్చా జీవి

జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ గడపాలి అనేది వీరి తత్వం. ఇదే ఆఖరి రోజు అన్నట్లు అనుభవిస్తారు. ట్రావెలింగ్ చేయటం, కొత్త ప్రదేశాలు చూడటం వీళ్ళు తరచూ చేస్తుంటారు. అది కూడా ఒంటరిగా మాత్రం కాదు. ఎప్పుడూ ఫ్యామిలీ తోనే ఏమి చేసినా. ఇలాంటి భర్త దొరికితే మీ జీవితంలో లక్కీ డిప్ దొరికనట్లే. మీ పిల్లలు సంతోషం అయితే మాటల్లో చెప్పేది కాదు. ప్రపంచం మొత్తం చుట్టేయాలి అని కూడ ఇలాంటి భర్తలు అనుకుంటారు. జీవితం విషయం లో కూడా అంతే ప్లానింగ్ తో, సంతోషంతో ముందుకి వెళ్తుంటారు.

చూశారుగా.. ఈ ఐదు రకాలలో మీ భర్త ఏ వర్గంలో ఉన్నాడో చూసుకుని అతన్ని అర్ధం చేసుకుంటూ ఆనందంగా జీవించండి.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon