Link copied!
Sign in / Sign up
4
Shares

ఈ 5 మాటలు మీ భర్తతో ఎప్పటికీ అనకూడదు, చెప్పకూడదు..

పెళ్లి తర్వాత తమ జీవితం చాలా బాగుండాలి, చక్కగా ఉండాలని ప్రతి భార్యభర్త కోరుకోవడంలో తప్పేమీ లేదు. అయితే కొన్నికొన్ని సార్లు తమకు తెలియకుండా జరగడం వలన, అవగాహన లేకపోవడం వలన, అంతకుముందు జరిగిన విషయాలు ఒకేసారి ఇద్దరికీ తెలియకపోవడం వలన మనస్పర్థాలు ఎదురై ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంటాయి. అందుకని, ఇక్కడ చెప్పుకునే ఈ 6 విషయాలను మీరు మీ భర్తతో అనకూడదు, చెప్పకూడదు. ఇవి మీ దాంపత్య జీవితానికి సమస్యగా మారుతాయి.. ఆ విషయాలు ఏంటో మీరే చూడండి. 

మీ అమ్మగారు ఉన్నారు చూడు..

మీ ఆయన అమ్మగారు అంటే మీ అత్తగారితో పడకపోవడమో, ఆమె చెప్పే పనులు లేదా మాటలు నచ్చకపోయినా, ఆమె చేసే పని మీకు నచ్చకపోయినా సరే వెంటనే మీ ఆయన దగ్గరకు వెళ్లి, 'మీ అమ్మగారు ఉన్నారు చూడు..' అంటూ ఆమె గురించి ప్రతిసారీ చెప్పడం వలన అతడికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో వాటిని మీరే చక్కదిద్దుకోవాలి. ఇవన్నీ మీ ఆయనకు తెలియడం వలన ఇద్దరి మధ్య లేనిపోని సమస్యలు తలెత్తుతాయి. 

నీకు ఏమీ తెలియదు..

పెళ్లి చేసుకున్న తర్వాత మగవాళ్ల జీవితం చాలా కొత్తగా ఉంటుంది. భార్య ఏ విషయం చెప్పకపోయినా అర్థం చేసుకుని ముందే గ్రహించలేకపోవడం, పిల్లల బట్టలు డైపర్లు వంటివి మార్చడం, ఏదైనా ఇంట్లోకి కావాల్సిన వస్తువులను తీసుకురావడం..ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మహిళలు చేసినంత సులభంగా మగవాళ్ళు చేయలేపోవచ్చు. అందుకని, వెంటనే 'నీకు ఏమీ తెలీదు, నువ్వు వేస్ట్..'అనే మాటలు ముఖం మీదే అనటం వలన బాధపడతారు. అందుకు బదులుగా మీ పనుల్లో సాయం చేయమని కోరండి. 

మా పుట్టింటికి వెళ్ళిపోతాను..

ప్రతి ఒక్కరి భార్యాభర్తల జీవితంలో సంతోషాలు, గొడవలు, కోపతాపాలు సర్వసాధారణమే. భర్త ఏదైనా కోపంగా మాట్లాడినా, ఆయన మీకు నచ్చని పని తెలిసో తెలియకో చేసినా సరే వెంటనే ఈ మాట అనకూడదు. 'మా పుట్టింటికి వెళ్ళిపోతాను..'అనే మాటలు ప్రతిసారీ ఆయనతో అనకుండా, ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వినకుండా దూరంగా వెళ్లడం చేయకుండా కొద్దిసేపు సైలెంట్ గా ఉండటం, కూర్చొని బాగా ఆలోచించడం వలన మంచిది. కోపంతో తీసుకునే నిర్ణయాలు చాలా సమస్యలను తీసుకువస్తాయి. 

నువ్వు నా గురించి అస్సలు ఆలోచించడం లేదు..

భర్త ఎప్పుడు తన జీవితంలోకి అడుగుపెట్టిన తన భార్య గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. అయితే కొన్ని టెన్షన్ ల కారణంగానో, ఆర్ధిక సమస్యల వలనో ఎప్పటికీ ఒకే విధంగా ప్రేమ చూపించలేకపోవచ్చేమో గానీ ప్రేమ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. ఒకరోజు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ చెప్పకపోయినా, లంచ్ టైం లో ఫోన్ చేయకపోయినా, మీకు ఏదైనా వస్తువులను బయటనుండి వచ్చేటప్పుడు తీసుకురాకపోయినా 'నీకు నాపై ప్రేమ తగ్గింది, నువ్వు నా గురించి అస్సలు ఆలోచించడం లేదు, పట్టించుకోవడం లేదు..' అనే మాటలు అస్సలు అనకూడదు.. 

ఇంతవరకు రాకుండా ఏం చేస్తున్నావ్

ఇంటి నుండి ఆఫీస్ కు వెళ్లేముందు సాయంత్రం త్వరగా రమ్మని మీ భర్తకు మీరు ముందే చెప్పి, అతడికోసం ఎదురుచూస్తూ ఉండవచ్చు. అయితే మీ భర్త అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యంగా వస్తే, ఇంటికి రాగానే 'నీకోసం నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను, ఇంతవరకు రాకుండా అసలు ఏం చేస్తున్నావ్, ఎక్కడికి వెళ్ళావ్..' అంటూ అడగకుండా ఆయనను లోపలికి స్వాగతించి, ఎందుకు ఆలస్యం అయ్యిందో ఆ కారణం వినాలి. 

ఇవి వినడానికి, చెప్పుకోవడానికి చిన్న కారణాలే కావచ్చు గానీ దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచే కారణమవుతాయి. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, ప్రతి ఒక్కరికీ ఈ విషయాలు తెలియాలనే ఉద్దేశ్యంతోనే చెప్పడం జరిగింది.. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon