Link copied!
Sign in / Sign up
7
Shares

ఈ 5 కారణాలు రెండవ కాన్పును మొదటి కాన్పు కన్నా కష్టతరంచేస్తాయి!!

ప్రెగ్నన్సీ అంత సులభమైన పని ఏమి కాదు. మీ శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి నొప్పిని 9 నెలలు భరించడానికి సిద్ధమవ్వాలి. 9 నెలలు తరువాత మీ బిడ్డను చూసి మీరు పడే సంతృప్తి ఎంతైనా ఈ 9 నెలల ప్రెగ్నన్సీ సమయంలో మాత్రం బాధను అనుభవించాల్సిందే. మొదటిసారి ప్రెగ్నన్సీ మీకు ఈ బాధలన్నిటిని పరిచయం చేస్తుంది. రెండవ సారి ప్రెగ్నన్సీ సమయంలో ఈ బాధలన్నీ ఉండవని మీరనుకుంటారు. కానీ కొన్ని కారణాలు మీ రెండవ ప్రెగ్నన్సీ ని మొదటి ప్రెగ్నన్సీ కన్నా కష్టతరం చేస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి…

1. సహాయం తగ్గుతుంది

మీరు మొదటి సారి ప్రేగ్నన్ట్ అయినప్పుడు మీ భర్త, తల్లి తండ్రులు, బంధువులు, స్నేహితులు మీ గురించి చాలా జాగ్రత్త తీసుకుంటారు. మీకు కావాల్సినవి, కోరుకున్నవి చిటికలో తెచ్చి మీ ముందు పెడుతారు. మీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటారు. కానీ రెండవ సారి ప్రేగ్నన్ట్ అయినప్పుడు అంత జాగ్రత్త ఉండదు. ఎందుకంటే మీకు మొదటి సారి ప్రెగ్నన్సీ అలవాటు అయ్యింది కాబట్టి రెండవ సారి ప్రెగ్నన్సీ సులభంగా ఉంటుందని వాళ్ళు అనుకుంటారు. కానీ మొదటి సారి మీరు పడిన బాధనే రెండవ సారి పొందుతారని వారికి తెలియకపోవచ్చు .

2. అంతా తెలుసు

మీరు మొదటి సారి ప్రేగ్నన్ట్ గా ఉన్నప్పుడు, మీరు మీకు పుట్టబోయే బిడ్డ గురించి, మీ బిడ్డను మొదటిసారి మీ వడిలోకి ఎత్తుకున్నప్పుడు కలిగే ఆనందమైన అనుభూతి గురించి ఆలోచిస్తారు. మీరు ఎదురుకోబోయే బాధ గురించి మర్చిపోతారు. కానీ రెండవ సారి కలిగే బాధలన్నీ మీకు అనుభవంలో ఉన్నాయి కాబట్టి వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తారు.

3. నిద్ర తగ్గుతుంది

మీరు మొదటి సారి ప్రేగ్నన్ట్ అయినప్పుడు మీకు నిద్రపోడానికి కాస్త సమయం దొరికేది. కానీ ఆ ప్రశాంతమైన నిద్ర మీకు రెండొవ సారి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక బిడ్డ వుంది, ఆ బిడ్డ ఆలనాపాలనా కూడా చూసుకోవాలి. మీకు నిద్రపోయే తీరిక దొరకదు.

4. లక్షణాలు తీవ్రమవుతాయి

మొదటి ప్రెగ్నన్సీ సమయంలో మీరు ఎదురుకున్న ప్రెగ్నన్సీ లక్షణాలు, వేవిళ్లు, వికారం, మార్నింగ్ సిక్నెస్. ఈ ప్రెగ్నన్సీ లక్షణాలు రెండవ సారి ప్రెగ్నన్సీ సమయంలో ఇంకా ఎక్కువవుతాయి. వాటి గురించి జాగ్రత్త తీసుకునే తీరిక కూడా మీకు తక్కువుంటుంది.

5. డాక్టర్

ఈ సారి మీరు చెకప్ చేయించుకోవడం కోసం డాక్టర్ దగ్గరకు వెళ్ళడం కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిన మీ వెంట బిడ్డ ఉండాలి. తన గురించి కూడా జాగ్రత్త తీసుకోవాలి.

ఇవన్నీ కారణాలు మాత్రమే, వీటి గురించి తెలుసుకుని వీటిని మీరు అధిగమించవచ్చు. మీ రెండవ ప్రెగ్నన్సీని కూడా సులభంగా పూర్తిచేయవచ్చు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon