Link copied!
Sign in / Sign up
0
Shares

మీ శరీరం నుండి వచ్చే దుర్వాసనను ఈ 4 ఆహారాలు వెంటనే పోగొడతాయి..

ఏదో ఒక సందర్భంలో మీ శరీర దుర్వాసన వలన మీరు ఇబ్బంది పడే ఉంటారు. శరీర దుర్వాసనకు అనేక కారణాలు ఉన్నాయి.  అందులో ఒక ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారం. అవును మీరు తీసుకునే ఆహరం మీ శరీర వాసనను నిర్ధారిస్తుంది. అందుకే మీరు తీసుకునే ఆహారంలో మార్పు మీ శరీర దుర్వాసనను పోగొడుతుంది. శరీర దుర్వాసనను పోగొట్టడానికి మీరు తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే…

1. మంచి నీళ్ళు

మంచి నీళ్ళు తాగడం మర్చిపోకండి. మీ శరీరానికి కావాల్సిన మంచినీళ్ళను తప్పకుండా తీసుకోండి. ఇది మీ శరీర అవయువాల పని తీరును  సరి చేయడమే కాకుండా శరీర దుర్వాసనను పోగొడుతుంది. నీరు తీసుకోవడం వలన శరీరం లో దుర్వాసనను కలిగించే టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి. దుర్వాసన దూరం అవుతుంది.

2. పెరుగు

పెరుగును తప్పకుండా మీ ఆహారంలో భాగం చేసుకోండి. పెరుగు మీ శరీరంలోని దుర్వాసన కారకమైన సుల్ఫ్ట్ (Sulfite) ను తొలిగిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ D మీ నోటిలోని బాక్టీరియా ను తొలిగిస్తుంది.

3. నిమ్మ రసం

నిమ్మ రసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కు టాక్సిన్స్ ను తొలిగించే లక్షణం ఉంటుంది. అందుకే రోజు ఉదయం గోరు వెచ్చని నీటితో నిమ్మ రసాన్ని తీసుకోండి. ఇది మీ శరీరంలోని మలినాలను తొలిగిస్తుంది.

4. మెంతులు

మెంతులు అందరి వంటింట్లో తరచుగా వాడేవే ఇవి మీ వంటల రుచిని పెంచడం మాత్రమే కాదు. మీ శరీర దుర్వాసనను కూడా పోగొడుతాయి. మెంతులు అరుగుదల శక్తిని పెంచుతాయి. అంతే కాకుండా శరీరంలోని చెడు పదర్ధాలను తొలిగిస్తాయి. శరీర దుర్వాసనను దూరం చేస్తాయి.

5. దాల్చిన చెక్క

దాల్చిన చెక్కను మీ ఆహరంలో తరచుగా వాడుతుందండి, అది మీ వంటలకు మీ శరీరానికి కూడా సువాసనను అందిస్తుంది. 

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon