Link copied!
Sign in / Sign up
4
Shares

ఈ 10 బ్యూటీ ప్రొడక్ట్స్ జోలికి అస్సలు వెళ్ళకండి

మహిళలు అందంగా కనిపించడానికి వివిధ రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కానీ అన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ మీకు మంచి చేసేవి అయ్యుండవు.  కొన్ని రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండడమే మంచిది. అలాంటి ప్రమాదకరమైన బ్యూటీ ప్రొడక్ట్స్ ఏంటో ఇక్కడ తెలుసుకోండి... 

1. హార్ష్ ఎక్సఫోలియాన్ట్స్ ( Harsh Exfoliants)

ఎక్సఫోలియాన్ట్స్ డెడ్ స్కిన్ నిర్మూలించడంలో మరియు చర్మాన్ని కాంతివంతం చేయడంలో అత్యంత ప్రభావితమైనవి. కానీ హార్ష్ ఎక్సఫోలియాన్ట్స్ వాడటం మంచిది కాదు. సరైన ఎక్సఫోలియాన్ట్స్ ఎంచుకోక పోతే మీ చర్మానికి ఆపద తప్పదు. వీటిని వాడటం వలన చాలా మంది మహిళలు చర్మం పొడిబారడం, చికాకుగా ఉండటం మరియు మొటిమలు రావడం గమనించారు. ఇటువంటివి జరగకుండా నివారించడానికి మరియు మచ్చలేని చర్మం కోసం jojoba వంటి మృదువైన పూసలు కలిగిన exfoliants వాడండి.

2. పెర్ఫ్యూమ్డ్ ప్రొడక్ట్స్ (Perfumed Products)

సువాసన గల ఉత్పత్తులకు ఎంత దూరంగా ఉంటె అంత మంచిది. ఈ రోజుల్లో ప్రతి ప్రోడక్ట్ సువాసనతోనే ఉంటున్నాయి, కానీ సువాసన ఉంటె ఇరిటేషన్ పెరిగే అవకాశం ఉంది. ప్రధమంగా సహజ సువాసన ఉన్న ప్రొడక్ట్స్ వాడటం ఉత్తమం.

3. హెయిర్ రిమూవల్ క్రీమ్స్ (Hair Removal Creams)

హెయిర్ రిమూవల్ క్రీమ్స్ వాడటానికి సులువుగా మరియు త్వరగా ఉపయోగించేలా ఉంటాయి. కానీ అవి అంత తొందరగా పని చేయడానికి కారణం వాటిలోని కెమికల్స్. సాధారణంగా ఈ క్రీమ్స్ చర్మపు రంద్రాలను పెద్దవిగా చేసి హెయిర్ సులువుగా వచ్చేలా చేస్తాయి. అసలు సమస్య ఇదే. చర్మపు రంద్రాలు పెద్దవిగా చిన్నవిగా అవ్వటం వలన ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాబట్టి వీటిని తక్కువుగా ఉపయోగించడం మంచిది.

4. మినరల్ ఆయిల్ (Mineral Oil)

మినరల్ ఆయిల్ దాదాపు ప్రతి బ్యూటీ ప్రొడెక్టులో ఉంటుంది. కానీ అందరికి తెలియని విషయం ఏమిటంటే మినల్ ఆయిల్ లోని గుణాలు చర్మపు రంద్రాలను మూసివేస్తాయి. దాని వలన బ్లాక్ఖేడ్స్, మొటిమలు వంటివి రావడం జరుగుతుంది. అందువలన పెట్రోలియం మరియు పారఫిన్ లేని ప్రొడక్ట్స్ ఎంపిక చేసుకోవడం ఉత్తమం.

5. సోప్ (Soap)

రెగ్యులర్ సోప్ వాడటం కంటే క్లీనర్లు వాడటం మంచిది ఎందుకంటే ఇవి మీ చర్మంలోని మలినాలను తొలగించడంతో పాటు కావాల్సిన పోషణ కూడా అందిస్తాయి.

6. ఆల్కహాల్ ఉన్న ప్రొడక్ట్స్

పైన చెప్పిన వాటిలానే ఆల్కహాల్ ఉన్న ప్రొడక్ట్స్ కూడా మంచివి కాదు. అవి తొలుత మంచిగానే కనిపిస్తాయి కానీ పోను పోను మీ చర్మం మీద దుష్ఫలితాలు చూపించడం మొదలు పెడతాయి. అందువలన నీటి లేదా గ్లిజరిన్ తో తయారయిన ప్రొడక్ట్స్ వాడటం మేలు.

7. జుట్టుకు రంగులు వేసుకోవడం

రంగులంటే అందరికి ఇష్టమే అందుకే ఈరోజుల్లో అందరు తమ జుట్టుకు కూడా వివిధ రంగులు వేసుకుంటున్నారు. జుట్టుకి రంగు వేసుకోవడం వలన అందంగా కనపడటం మాత్రమే కాదు మీ స్వభావంలో కూడా మార్పు వస్తుంది. కానీ వాటి వలన చాల ప్రమాదాలు ఉన్నాయని ఈ మధ్యనే తెలుసుకున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. కావున సహజ రంగులను వేసుకోవడం మంచిది.

8. నెయిల్ పోలిష్

నెయిల్ పోలిష్ వేసుకోవాలనే సరదా ఎవరికి ఉండదు చెప్పండి. కానీ నెయిల్ పోలిష్ వేసుకోవడం వలన మెదడు తన పని చేసే విధానం నెమ్మదించిపోతుంది. కాబట్టి ఈ విషయంలో పేరు పొందిన ప్రొడక్ట్స్ మాత్రమే వాడండి.

9. యాంటీ పెర్సపిటంట్స్ (Anti Perspitants)

యాంటీ పెర్సపిటంట్స్ అనేక సమయాల్లో ఉపయోగపడినప్పటికీ వాటిని వాడటం తగ్గించడం మంచిది. ఎందుకంటే అవి ఎక్కువ మోతాదులో క్యాన్సర్ కి కారణమయ్యే అల్లుమినియం సాల్ట్స్ ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణంగా అల్లుమినియం సాల్ట్స్ అని గుర్తించారు. అందువలన సహజమైన డియోడరెంట్స్ ని ప్రయత్నించండి.

10. విటమిన్ A సన్ స్క్రీన్

విటమిన్ A లేదా రెటినోల్ అనే ఖనిజాలు దాదాపు సగానికి పైగా సన్ స్క్రీన్స్ లో వాడుతున్నారు. కానీ విటమిన్ A ఎండకు తగిలితే ప్రమాదకరంగా మారి క్యాన్సర్ కి దారి తీయొచ్చు. విటమిన్ A ఎండలో మాత్రమే ప్రమాదకరం కానీ రాత్రి పూసుకుని పడుకునే క్రీమ్స్ లో ఉంటె ప్రమాదం లేదు. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon