Link copied!
Sign in / Sign up
3
Shares

ఎదుగుతున్న పిల్లలకు మీరు తప్పకుండా నేర్పించాల్సిన 8 విషయాలు : వారి భవిష్యత్తుకు బాగా ఉపయోగపడతాయి

ఎదుగుతున్న పిల్లలు చాలా ఉత్సాహంగా ఉంటారు కావున వారిని అన్ని సమయాల్లోనూ బిజీగా ఉంచడం కష్టం కావచ్చు. వారు నిరంతరం మీ శ్రద్ధ అవసరం కోరుకుంటుండడం మీకు ఇంటి పనులు చేసుకోవడానికి మీకు సమయం లేకుండా పోతుంది. కానీ మీరు దానిని మార్చుకోవచ్చు. మీరు వారి దృష్టిని మళ్లించి, గంటల కొద్దీ వారిని బిజీగా ఉంచవచ్చు. ఇలా చేయడం ద్వారా మీకు సమయం దొరకడమే కాకుండా వారికి కూడా వివిధ మంచి అలవాట్లు ఏర్పడుతాయి.

1. కలరింగ్

ఒక పాయింట్ తరువాత, ఇది బోరింగ్ పొందవచ్చు. మీ గదిలో పొడవైన రోల్  కాగితాన్ని వేయడం ద్వారా వారు తనివి తీరా రోల్స్ అన్ని నిండేంతవరకు వేసుకుంటుంటారు. అవి అలానే దాచుకోండి, పెద్దయ్యాక మీ చిన్నారికి తన పెయింటింగ్ స్కిల్స్ చూపించండి.

2. ఆడుకునే పిండి 

Play-doh ఆడుకోవడానికి సులభంగా మరియు ఆనందంగా ఉంటుంది. కానీ, అది ఆరోగ్యకరమైనదిగా ఉండేలా చూసుకోండి. మీరు ఒక గిన్నెలో అన్ని పదార్ధాలలో ఉంచి మీ పసిబిడ్డను సొంత పిండి బొమ్మలను తయారు చేసుకోమని చేయండి. పిల్లలు కూడా హాయిగా గంటలు తరబడి బొమ్మలు చేసుకొని మురిసిపోతుంటారు. రంగు పొడి, పిండి, మొక్కజొన్న పిండి, ఉప్పు, 2 నుండి 4 టేబుల్ స్పూన్లు నూనెలో తగినన్ని నీరుపోసి కలిపిన మిశ్రమాన్ని వారికి ఇవ్వండి చాలు, హాయిగా ఆడుకుంటారు.

3. Obstacle Course ని ఏర్పాటు చేయండి

మీ చిన్నారిని బిజీగా ఉంచడానికి ఇంట్లో ఒక Obstacle Course ని ఏర్పాటు చేయడం అనేది ఒక మంచి పద్దతి. ఎందుకంటే, పిల్లలు దాని చాలా ఇష్టపడతారు మరియు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఆడుకుంటారు. అంతేనా, అంత మంచి బహుమానం ఇచ్చినందుకు మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తారు, రెండు ముద్దులు ఎక్కువ పెడతారు.

4. వంటలో భాగస్వామిని చేయండి

మీరు వంట చేస్తున్నపుడు సహాయం చేయమని చెప్పండి. గిన్నెలో పిండిని కలిపి ఇవ్వడం, ఫ్రిడ్జిలో ఉన్న కూరగాయలు అందివ్వమనడం వంటి పనులు చెప్పండి. వారికి అవి పనులులా కాకుండా ఎదో ఒక గొప్ప పనిలో భాగస్వామిని చేసారు అనే అనుభూతిని కలిగించండి.

5. వారికంటూ ప్రత్యేకంగా ఒక గుడారాన్ని ఏర్పాటు చేయండి

షాపులో దొరికే ఉన్న టెంట్ కొనుక్కోండి లేదా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఒక టెంట్ ని ఏర్పాటు చేయండి. అదే తన ఇల్లులా భావించేలా చేయండి. చిన్న చిన్న బొమ్మలు కొని దాంట్లో ఆడుకోమని చెప్పండి.

6. ఫోటోలు తియ్యమని చెప్పండి

ఈ కాలం పిల్లలకు ఫోటోలు అంటే చాల పిచ్చి. పిల్లకు మాత్రమేనా అందరికి ఇష్టమే. అందుకే వారు కొంచెం బోర్ ఫీల్ అవుతుంటే కెమెరా ఇచ్చి వాళ్ళకి నచ్చిన ఫోటోలు ఇంట్లో తీయమని చెప్పండి.

7. బెలూన్ టెన్నిస్

ఇది వర్షా కాలంలో పనికి వచ్చే సులభమైన మరియు సరదాగా ఆట. ఒక బెలూన్లో గాలి నింపి వారికి ఇచ్చి ఆడుకోమని చెప్పండి. పిల్లలు చాలా ఇష్టంగా ఆడే ఆట ఇది. కావాలంటే ఒక ప్లాస్టిక్ బ్యాట్ కూడా ఇవ్వండి. మీ ఫర్నిచర్ కి ఎటువంటి నష్టం జరగకుండా మరియు పిల్లకు ఇష్టంగా ఆడుకునే ఆట.

8. కలిసి చదవండి

పఠనం చాలా సరదాగా ఉంటుంది మరియు చిన్న వయస్సులోనే బోధించటం మంచి అలవాటు. కిడ్స్ వారు ఇష్టపడిన పుస్తకాలను ఎంతసేపు చదువుతా, బొమ్మలు చూసుకుంటా ఉంటారో వారికే తెలియదు. దీని వలన మీరు విశ్రాంతిని మరియు మీ చిన్నారి తెలివిని పొందుతాడు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అంటే అదే మరి!!!

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon