Link copied!
Sign in / Sign up
16
Shares

ఎదిగే పిల్లల కోసం రుచికరమైన బలవర్ధకమైన 3 గంజి సూప్స్

పిల్లలు ఎదగడం మొదలుపెట్టేటప్పుడు వారికి ద్రవ, ఘన రూపంలో ఉండే ఆహార పధార్థాలను ఇవ్వడం మొదలు పెట్టాలి. వారికి రుచికరంగా ఉండే కొన్ని రకాల గంజి లేదా సూప్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అవేంటంటే,

1.బియ్యం గంజి  సూప్

కావల్సినవి

బియ్యం అర్ధ కేజి

గంజి పౌడర్ తయారుచేయు విధానం

- బియ్యాన్ని బాగా నానబెట్టాలి దీని వల్ల బియ్యంలో ఉన్న ఆర్సెనిక్ వెళ్ళిపోతుంది.

- ఆతర్వాత వాటిని ఎండలో ఎండబెట్టాలి.

- తర్వాత పాన్‌పై వేడి చేయాలి.

- ఆ తర్వాత బియ్యాన్ని గ్రైండ్ చేసి, ఆపొడిని ఒక డబ్బాలో పెట్టుకోవాలి.

గంజి చేయు విధానం

- ఒక పాత్రలో నీళ్ళు పోసి బాగా మరిగించాలి, ఆ తర్వాత బియ్యం పొడిని అందులో వేసి గడ్డ కట్టకుండా గరెటతో తిప్పుతూ ఉండాలి.

- అది గట్టిగా ఆయే వరకు వేడి చేయాలి.

- ఆ మిశ్రమానికి తల్లి పాలను లేదా ఏదైనా పళ్ళ రసాన్ని స్వీట్ కోసం యాడ్ చేయాలి.

2.గోధుమలు, ఓట్స్, ఆపిల్ గంజి

కావల్సినవి

- దంచిన గోధుమలు సరిపడా,

- ఓట్స్

- ఆపిల్స్

- వెన్న

- పాలు తగినన్ని

- చక్కెర తగినంత

తయారు చేయు విధానం

- వెన్నను కుక్కర్‌లో వేసి హీట్ చేసి దంచిన గోధుమలను కలపి 3 నుముషాల పాటూ వేడి చేయాలి.

- ఆ మిశ్రమానికి ఓట్స్ జతచేసి మరో 2 నిముషాలు వేడి చేయాలి.

- ఆ మిశ్రమానికి పాలు, ఒక కప్పు నీళ్ళు జతచేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి.

- అప్పుడు సుగర్, ఆపిల్స్ వేసి సుగర్ కరిగే వరకు ఆ మిశ్రమాన్ని తిప్పాలి.

3.అరటి, తేనె గంజి

కావల్సినవి

- మెదిపిన అరటి పళ్ళు

- ఓట్స్

- తేనే

- నీళ్ళు

తయారుచేయు విధానం

- పాన్‌లో నీళ్ళు పోసి, ఓట్స్ వేసి 2 నుముషాల పాటు వేడి చేయాలి.

- తీసేయడానికి కొంచెం ముందుగా  అరటి పళ్ళను మెదిపి అందులో వేయాలి.

- ఆ మిశ్రమం పైన కొంచెం తేనే వేయాలి.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon